Jump to content

సమరమే!


krish2015

Recommended Posts

  • పీవోకేపై దాడికి సిద్ధమవుతున్న భారత్‌?
  • స్వాధీనం చేసుకుని తీరతాం
  • నేతలు, అధికారుల వరుస ప్రకటనలు
  • జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలు దించుతారా?
  • పాక్‌ మరో దుశ్చర్యకు పాల్పడితే ఆ వెంటనే దాడి?
  • ఆత్మరక్షణలో పడి తలపట్టుకుంటున్న దాయాది
న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పాక్‌ ఆక్రమిత కశ్మీరును స్వాధీనం చేసుకోవడం కోసం భారత్‌ ప్రణాళికలు రచిస్తోందా? పీవోకే లక్ష్యంగా త్వరలో పాక్‌పై దాడి చేయబోతోందా? ఇందుకు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం కోసం దౌత్యపరమైన కసరత్తు కూడా చేస్తోందా? కశ్మీర్‌లో 370వ అధికరణ నిర్వీర్యం తర్వాత కేంద్ర మంత్రులు-బీజేపీ నేతల ప్రకటనలు, సైనికాధికారుల వ్యాఖ్యలు, కొంతకాలంగా సైన్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు... అన్నీ చూస్తుంటే భారత్‌ ఆ దిశగా అతివేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడో కాదు.. వచ్చే రెండు, మూడు నెలల్లోనే భారత్‌ పాక్‌పై దాడి చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ‘‘పీవోకే స్వాధీనం కోసం పాక్‌పై దాడికి భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది. కానీ తనకుతానుగా దాడి చేయకూడదని భావిస్తోంది.
 

ADVERTISEMENT

 
 
పాక్‌ వైపు నుంచి పుల్వామా తరహా దాడిగానీ, ఏదైనా కవ్వింపు చర్యగానీ జరిగితే ఆ వెంటనే భారత్‌ పీవోకేపై దాడికి దిగుతుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌కు మద్దతు రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది’’ అని కేంద్ర సర్కారు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పీవోకేను స్వాధీనం చేసుకుంటామంటూ భారత నేతలు వరసుగా చేస్తున్న ప్రకటనలు పాక్‌ను రెచ్చగొట్టి ఏదో తప్పటడుగు వేయించేందుకేననే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌ ఆర్థికంగా అష్టకష్టాల్లో ఉండడం, అక్కడి ప్రభుత్వం బలహీనంగా ఉండడంతో అదే అదనుగా మోదీ సర్కారు కశ్మీరు విషయంలో చకచకా కీలకమైన అడుగులు వేస్తోంది. 2016లో యూరి దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ దాడి చేసింది. దానికి పాక్‌ నుంచి గట్టి ప్రతిస్పందన ఏదీ రాకపోవడంతో భారత్‌ మరింత ధైర్యం పుంజుకుంది. గత ఏడాది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పీవోకేతోపాటు పాక్‌ ప్రధాన భూభాగంలోని బాలాకోట్‌పై కూడా దాడి చేసింది.
 
పాక్‌ దీనికి దీటుగా బదులీయలేకపోవడం, అంతర్జాతీయంగా కూడా పాక్‌కు మద్దతు దొరకకపోవడంతో భారత్‌ మరింత ముందుకు వెళుతోంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను నిర్వీర్యం చేసిన మోదీ సర్కారు... ఇప్పుడు ఏకంగా పీవోకే స్వాధీనం దిశగా పావులు కదుపుతోంది. పీవోకే భారత్‌లో అంతర్భాగమని గతంలో పలువురు భారతీయ నాయకులు, అధికారులు చేసే ప్రకటనలు కేవలం మన మొక్కుబడి విధాన ప్రకటనగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు నేరుగా పీవోకేను స్వాధీనం చేసుకుంటామంటూ బీజేపీ నేతలే కాదు... కేంద్రమంత్రులు, సైనికాధికారులు సైతం బల్లగుద్ది చెబుతున్నారు. పీవోకేను భారత్‌ త్వరలో స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు అమెరికా సహకారం అందిస్తుందని, ఈ మేరకు తనకు సమాచారం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గత ఆగస్టు 31న వెల్లడించారు.
 
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే బాధ్యతను భారత్‌ చేపట్టి, అమెరికా సైన్యం అఫ్గాన్‌ నుంచి వైదొలగేందుకు సహకరిస్తే పీవోకేపై భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఏకంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ‘‘పీవోకే ఏదో ఒకరోజు భారత్‌ పరిపాలన కిందికి వస్తుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. పీవోకే భారత్‌లో కలిసే రోజు ఎంతోదూరంలో లేదంటూ ప్రధాని కార్యాలయ సహాయమంత్రి, జమ్ముకశ్మీర్‌కు చెందిన జితేంద్రసింగ్‌ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు ఇదే ధోరణిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పీవోకేపై దాడికి సైన్యం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తేల్చిచెప్పారు. ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో సర్కారుకు ప్రత్యేకమైన వ్యూహం ఉందని ఆర్మీ మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ వెల్లడించారు. అయితే పీవోకేపై భారత్‌ ప్రకటనలకే పరిమితం కాలేదని, చాలా ముందుకు వెళుతోందని కొన్ని పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. దీర్ఘకాలంలో అవసరమయ్యే ఆయుధాల కొనుగోళ్లను పక్కనపెట్టి ... యుద్ధం వస్తే సైన్యానికి తక్షణం అవసరమయ్యే ఆయుధాలు, పరికరాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీరియ్‌సగా దృష్టి పెట్టింది.
 
ఇజ్రాయెల్‌ నుంచి ట్యాంకు విధ్వంసక క్షిపణుల్ని, స్పైక్‌ బాంబుల్ని అత్యవసరంగా కొనుగోలు చేసింది. వివిధ ఆయుధాలకు అవసరమైన మందుగుండు సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. పాక్‌ సరిహద్దులో సుఖోయ్‌ విమానాలను మోహరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. పీవోకేపై తాను దాడి చేస్తే పాక్‌ గగ్గోలు పెడుతుందని, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుందని భారత్‌కు తెలుసు. పాక్‌కు అలాంటి మద్దతు లభించకుండా చేయడమే లక్ష్యంగా దౌత్యపరమైన కసరత్తు కూడా జరుగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. పీవోకే స్వాధీనం గురించి విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడడం, ఓ బ్రిటన్‌ ఎంపీ కూడా పీవోకేపై వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనం. 370 నిర్వీర్యం తర్వాత మోదీ అమెరికా పర్యటనకు లభించిన స్పందన, ఆ సందర్భంగా ఉగ్రవాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌కు బలాన్నిచ్చాయి. కశ్మీర్‌పై జోక్యం చేసుకోవాలంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదేపదే కోరినా ట్రంప్‌ అంతగా స్పందించలేదు.
 
గల్ఫ్‌ దేశాల నుంచి సైతం పాక్‌కు మద్దతు దక్కలేదు. పాక్‌కు ప్రధానంగా చైనా నుంచి మద్దతు రాకుండా భారత్‌ ప్రయత్నిస్తోంది. 2016 సర్జికల్‌ దాడి తర్వాతగానీ, బాలాకోట్‌ దాడుల తర్వాతగానీ, తాజాగా 370 నిర్వీర్యం తర్వాతగానీ చైనా నుంచి పాక్‌కు తగిన స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. చైనాతో భారత్‌కు సన్నిహిత మైత్రి లేకపోయినా ఎంతోకొంత సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ 11న తమిళనాడులోని మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సుదీర్ఘంగా సమావేశం కానుండడం విశేషం. ఆ సందర్భంగా చైనా వైఖరిపై మరింత స్పష్టత రావచ్చు.
 
కాగా, భద్రతా పరిస్థితి క్రమేణా మెరుగుపడుతుండడంతో కశ్మీర్లో ఆంక్షలను రాష్ట్ర పాలన యంత్రాంగం క్రమేణా ఎత్తేస్తోంది. పర్యాటకుల రాకపోకలను నిలిపేస్తూ రెండు నెలల కిందట ప్రకటించిన నిషేధాజ్ఞలను ఎత్తేయాలని తాజాగా నిర్ణయించింది. గురువారం నుంచి అంటే 10వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సోమవారం నాడు ఓ ఉన్నతస్థాయి సమావేశంలో భద్రతాస్థితిని సమీక్షించారు.
 
పీవోకేపై ప్రకటనలివీ...
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు
- కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ (సెప్టెంబరు 23)
పాక్‌తో ఇక చర్చలు జరిగితే అది పీవోకేపైనే
- రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ (సెప్టెంబరు 22)
పీవోకే సహా మొత్తం కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగం
- హోంమంత్రి అమిత్‌ షా (సెప్టెంబరు 29)
పీవోకే భారత్‌లో భాగం, ఏదో ఒకరోజు అది భారత్‌ పాలన కిందికి వస్తుంది
- విదేశాంగ మంత్రి జైశంకర్‌ (సెప్టెంబరు 18)
పీవోకే త్వరలో భారత్‌లో భాగమవుతుంది
- ఉమా భారతి (సెప్టెంబరు 27)
పీవోకేను వదులుకోవడానికి పాక్‌ సిద్ధం కావాలి
- గుజరాత్‌ సీఎం రూపానీ (సెప్టెంబరు 16)
పీవోకేను పాక్‌ ఖాళీ చేయాలి
- బ్రిటిష్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మాన్‌ (సెప్టెంబరు 15)
పీవోకే స్వాధీనానికి మేం సిద్ధం. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి
- ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ (సెప్టెంబరు 12)
పీవోకే స్వాధీనంలో అమెరికా భారత్‌కు సహకరించబోతోంది, నా వద్ద సమాచారం ఉంది
- బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి (ఆగస్టు 31)
పీవోకే విషయంలో ప్రభుత్వానికి ప్రత్యేకమైన వ్యూహం ఉంది. - కేంద్రమంత్రి వి.కె.సింగ్‌
 
శీతాకాలం అనుకూలం
శీతాకాలంలో చైనా నుంచి భారత్‌లోకి ప్రవేశించే దారులన్నీ మంచువల్ల మూసుకునిపోతాయి. పీవోకేపై దాడి చేయాలంటే భారత్‌కు అదే తగిన సమయమని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. పీవోకే స్వాధీనం కోసం భారత్‌ ముందుకు ఉరికితే దానిని అడ్డుకునే స్థితిలో పాక్‌ ఎంతమాత్రం లేనట్టు కనిపిస్తోంది. పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే అవకాశంగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా పావులు కదుపుతున్నారు. ఇటీవల పాక్‌కు చెందిన పారిశ్రామికవేత్తలతో బజ్వా సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే మార్గాలపై వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇది పౌర ప్రభుత్వ అధికారాలను సైన్యం తన చేతిలోకి తీసుకునే ప్రయత్నమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
ఆర్మీ చీఫ్‌ దూకుడును అడ్డుకునే స్థితిలో ఇమ్రాన్‌ ఖాన్‌ లేరు. భారత్‌పై అణు దాడి చేస్తామంటూ ఇటీవల ఆయన ఐరాసలో చేసిన వ్యాఖ్యలు పాక్‌ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేశాయి. భారత్‌పై మరోసారి పుల్వామా తరహా దుస్సాహసానికి దిగితే ఈసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇమ్రాన్‌కు స్పష్టంగా అర్థమైంది. 370 నిర్ణయానికి నిరసనగా పీవోకే నుంచి ఇటీవల వేలమంది జమ్ముకశ్మీర్‌కు బయలుదేరగా... వారిని పాక్‌ సర్కారే అడ్డుకుంది.
 
మీరు వెళితే భారత్‌ మీపై ఏదో ఒక ముద్ర వేస్తుందని, అందువల్ల వెళ్లవద్దని ఇమ్రాన్‌ఖాన్‌ పీవోకే వాసులకు పిలుపునిచ్చారు. భారత్‌పై మునుపటిలా ఉగ్రవాద దాడులకు దిగే విషయంలో పాక్‌ భయపడిపోతోందని దీనిని బట్టి స్పష్టమవుతోంది. పాక్‌ ప్రతిపక్ష నేత బిలావల్‌ భుట్టో మాటల్లో చెప్పాలంటే ‘‘శ్రీనగర్‌ను ఎలా స్వాధీనం చేసుకోవాలనేది గతంలో కశ్మీరుపై పాక్‌ విధానం. ఇప్పుడు ముజఫరాబాద్‌ను కాపాడుకోవడం ఎలా అనేది పాక్‌ విధానమైపోయింది’’.
Link to comment
Share on other sites

8 minutes ago, JAYAM_NANI said:

ittanti chetha news rase party ni munchadu. veedi standards ento ardham kavatam ledu.

Chetta news emundhi bro.. Central minister and MPs isthunna statememts ee ga avi anni.. 

Paiga RK ni pilipinchaaru Delhi ki (May be he took appointment or maybe he complained about TV channel ban).. Amit shah tho 1.5 hrs meet jarigindhi.. 

Link to comment
Share on other sites

19 minutes ago, Raaz@NBK said:

2 months back nunchi news vasthundhi POK war ki velthaadu modi ani.. 

Election ki 1 year mundu occupy chestademo :dream:

War jarigithe Gumpulo Govinda aa valley extremists no kooda lepesi Pak lo padesthe dardram potadi 

Link to comment
Share on other sites

46 minutes ago, Raaz@NBK said:

Yes.. Occupy chesi Zamili elections ki pothadu anukuntunna.. Appudu ee Recession, economic slow down, GST, Demo lu em gurthuku raavu janalaki.. 

ante ippudu war ki vellagane gelichesthama...ala velthe 25% country undadu...inth risk theesukunna china vallu urukune vuntara...chala investment chesaru...vallu involve avvochu

Link to comment
Share on other sites

5 hours ago, krishna_Bidda said:

Pok is crucial for India to cut Chinese intervention in sub continent....

War antee just ala avvadu brother motham country economic situation marchesthundi

Incase adi nuclear war ga turn aitheee damage unpredictable 

Eppudoo poyina pok kosam ippudu endhuku godava remaining part of country ni protect chesthu people livig standards penchithee chalu

Link to comment
Share on other sites

2 hours ago, krish2015 said:

War antee just ala avvadu brother motham country economic situation marchesthundi

Incase adi nuclear war ga turn aitheee damage unpredictable 

Eppudoo poyina pok kosam ippudu endhuku godava remaining part of country ni protect chesthu people livig standards penchithee chalu

Prethi daniki Ila undabatte emi pikalekapoyam...the way China is today because of its aggressive stand in all aspects .....not by defensive approach.....i stand by war what ever it takes for the sovereignty of the country....

Link to comment
Share on other sites

1 hour ago, krishna_Bidda said:

Prethi daniki Ila undabatte emi pikalekapoyam...the way China is today because of its aggressive stand in all aspects .....not by defensive approach.....i stand by war what ever it takes for the sovereignty of the country....

Yes China is aggressive in all aspects like mass production, diffence etc In last 2 decades. But they never waged a war on any country.they r just using their  defense streanth to controle their rivals

But Indian rulars are quite different financial aggressiveness ledu. China nunchi pedda companies bayataki vasthunnai(because of US n China rift) vatini manam attract cheyyadam fail avuthunnam most of them going to viatnam. Anni sectors growth padi poyindi ivanni vadilesi

Oka bankrupt nation tho war ani eguruthunnaru. Pak elagu bankruptcy ki ready ga undi vallathoo war anteee vadiki poyedi emi ledu manakeee bokka

War antu vasthee manaki US n Pak ki China backend nunchi support chestharu and both of them will get benefitted because manaki US paina dependency peruguthundi n China ki Asia lo future competitor kuda evaru undaru

Incase if war turns as neucliar war rusults will be beyond to expectations. US lanti country neee North Korea n Iran ni emi pikaleka Anni musukuni kurchundi because they are neucliar armed alantidi manaki war avasaramaa with a neucliar armed country

 

Link to comment
Share on other sites

1 hour ago, krishna_Bidda said:

Prethi daniki Ila undabatte emi pikalekapoyam...the way China is today because of its aggressive stand in all aspects .....not by defensive approach.....i stand by war what ever it takes for the sovereignty of the country....

Ettetttaaaaaa! Ettettaaaaaa!!!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...