Jump to content

ఓ నెలకే...కరిగింది కల!!


RamaSiddhu J

Recommended Posts

ఓ నెలకే...కరిగింది కల!!

30 రోజులకే వెనక్కి

మూడొందల మందికి పైగా రాజీనామాలు

జిల్లాలో 548కి చేరిన వాలంటీర్ల ఖాళీలు

సత్వర భర్తీపై అధికారుల మథనం

ఈనాడు - శ్రీకాకుళం

ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లే కీలకం! ఇది...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు...ఎమ్మెల్యేలు...నేతలు చెబుతున్న మాట!! అలాగే ఉత్సాహంగా రంగంలోకి దిగిన వారిలో కొందరు ఒక్క నెలలోనే వెనుకడుగేసేస్తున్నారు!! అలా రాజీనామాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది! ఆ ఖాళీలు సత్వరం భర్తీ చేయాలని ప్రభుత్వం చెబుతున్నా...ఆ ప్రక్రియ అంత వేగంగా సాగటం లేదు!!

skl-top1c_6.jpgజిల్లాలో వాలంటీర్ల పోస్టుల్లో నియమితులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో మానేస్తున్నారు. ఒక్క నెలలోనే దాదాపు మూడొందల మందికి పైగా తమ ఉద్యోగాలకు రాజీనామా పత్రాలు సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 18 శాతానికిపైగా విధులను విడిచిపెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 15,243 మంది వాలంటీర్లు అవసరం. ప్రస్తుతం 14,695 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 548 క్లస్టర్లలో వాలంటీర్లు లేని పరిస్థితి. ఇది అక్టోబరులో ఇంటింటికి ‘నాణ్యమైన బియ్యం’ పంపిణీకి ఓ అవరోధంగా మారుతోంది. శ్రీకాకుళం నగర పాలక సంస్థతో సహా పట్టణ ప్రాంతాల్లో 1,824 పోస్టులకు గాను 334 ఖాళీలు ఉండటం గమనార్హం. రోస్టర్‌ మేరకు కేటాయించిన రిజర్వేషన్ల కేటగిరీలకు సంబంధించి అభ్యర్థులు రాకపోవటంతో కొన్ని చోట్ల నియామకాలే నిలిచిపోయాయి. ఇవికాకుండా వాలంటీర్‌ పోస్టుకు ఎంపికై.. తరవాత డుమ్మా కొట్టిన వారు మూడొందలకుపైనే ఉన్నట్లు అధికారిక వర్గాల అంచనా.

బాధ్యతల బరువు..: శ్రీకాకుళం నగర పాలక సంస్థలోని 50 డివిజన్ల పరిధిలో 735 మంది వాలంటీర్లను నియమించాల్సి ఉంది. అందులో 41 ఉద్యోగాలను ఎస్టీవర్గాలకు కేటాయించారు. ఆ కేటగిరీ నుంచి దరఖాస్తులే రాకపోవడంతో భర్తీ చేయకుండా అలా వదిలేశారు. మిగిలిన పోస్టుల్లో 694 మందిని నియమించారు. వీరిలో ఏకంగా 127 మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేశారు. కొందరు ప్రయివేటు ఉద్యోగాలకు వెళ్లిపోగా.. మరికొందరు సచివాలయ పోస్టులకు ఎంపికయ్యారు. ఇంకొందరు భారంగా ఉందని బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. బాధ్యతలు చేపట్టగానే ఇంటింటా సర్వే బాధ్యతలు అప్పగించడం కొందరు భారంగా భావించారు. మరికొందరు తమ భార్యకు వాలంటీర్‌ ఉద్యోగం వచ్చిందన్న ఆనందాన్ని పంచుకునే లోపే.. తొలిమాసం ఇంటింటా బియ్యం పంపిణీలో భార్య తరఫున తామే విధులు నిర్వర్తించాల్సి రావడాన్ని కష్టంగా భావించి అర్ధాంగి చేత రాజీనామాలు చేయించిన వారు కొందరు. ఉన్నత చదువులకు ఆటంకంగా ఉంటుందని ఇంకొందరు దూరమయ్యారు. డిగ్రీ, ఇంటర్మీడియేట్‌ చదువుకుంటున్న విద్యార్థులు కూడా కొన్ని చోట్ల ఎంపికయ్యారు. అలాంటివారు తమ చదువులకు ఆటంకం ఏర్పడుతుందని వాలంటీర్ల ఉద్యోగాలను వదులుకున్నారు. కొన్ని మండలాల్లో నియామక ఉత్తర్వులు తీసుకోవడానికే అభ్యర్థులు వెనకంజ వేయడం విశేషం.

skl-top1d_1.jpg

సత్వర భర్తీకి ఆదేశాలు..

ఎస్టీ, ఎస్సీ కేటగిరీలతో పాటు విశ్రాంత సైనికులకు కేటాయించిన పోస్టులు కొన్ని భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్‌ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉండకూడదని అధికారులను ప్రభుత్వం ఆదేశిస్తోంది. ‘మా మండలంలో ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. మళ్లీ వారినే పిలవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ పోస్టులను జనరల్‌ కేటగిరీలో భర్తీ చేసుకోడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాం. అక్కడి నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. వచ్చిన వెంటనే ఆ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని ఒక మండల అభివృద్ధి అధికారి స్పష్టం చేశారు. ‘చాలా మంది ఉన్నత విద్యార్హతలు ఉన్నవారూ తొలుత దరఖాస్తు చేసుకున్నారు. చదువుకుంటున్నవారూ వారిలో ఉన్నారు. అప్పట్లో రాజకీయ వత్తిళ్లు కూడా కొందరిపై పని చేశాయి. క్రమంగా విధుల్లో నిలవగలిగేవారితోనే ఖాళీలు భర్తీ అవుతాయి’ అని జిల్లా స్థాయి అధికారి ఒకరు స్పష్టం చేశారు.

బియ్యం పంపిణీలోనూ ఇబ్బందే..

జిల్లా వ్యాప్తంగా అయిదొందలకు పైగా వాలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో వారి స్థానే ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించలేదు. అక్టోబరులో పంపిణీ చేసే నాణ్యమైన బియ్యానికి అవరోధం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉందని ఒక తహసీల్దార్‌ అభిప్రాయపడ్డారు. ‘సంచులు మోయాల్సి వస్తుందని కొందరు.. ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలకు అర్హుల ఎంపికలో భాగస్వాములను చేయడం.. వంటి విధుల నేపథ్యంలో కొందరు రాజీనామా చేశారు. వీటన్నింటినీ బియ్యం పంపిణీ మొదలయ్యే లోపే భర్తీ చేస్తే మాకు కొంత వెసులుబాటు ఉంటుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందిగా ఉంద’ని మరో తహసీల్దారు అభిప్రాయపడ్డారు. ఒకపక్క ఖాళీలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెబుతూ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వకపోవడం జాప్యానికి కారణమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని మండలాల్లో ఎంపిక సమయంలో రెండోస్థానంలో నిలిచిపోయిన వారితో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

skl-top1e.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...