GOLI SODA Posted September 28, 2019 Share Posted September 28, 2019 అన్నా నువ్వు చాలా విషయాలలో హిందూ మతాన్ని తప్పు పట్టడం భావ్యం కాదు.. నువ్వు అంటే గౌరవం ఇష్టం ఉన్న మేము నిన్ను డిఫెండ్ చెయ్యటం కష్టం గా ఉంది. మీరు ఇకపై ఇటువంటి పోస్టులు ఆపేయ్యండి అన్నా..కొంచెం లౌక్యం గా బ్రతకండి. ఇలా చేస్తే మీరు చాలా మంది సపోర్ట్ ని కోల్పోతారు..మతాలని వదిలి సమాజం గురించి..అందులో జరుగుతున్న అన్యాయాల గురించి రాయండి అన్నా..ఆవు ఏది పీలిస్తే మీకెందుకు..ఏసు రక్తం లో క్రోమోజోములు ఎన్ని ఉంటే..మీ కెందుకు..మీరు ఇలా మతాల మీద రాసి చాలా మంది మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మాకు అర్ధం కావటం లేదు. సమాధానం: అన్ని తెలిసే చేస్తున్నాను. మతాలని మత భావనలను రాజకీయ్యం ఎలా వాడుకుటుందో మీకు తెలియాలి అనే రాస్తున్నాను. మనిషిలో మతం అనే స్పృహ ఉండటం సహజం కానీ అదే స్పృహ మొత్తం మనిషి అయోపోకూడదు ..నీ మతాన్ని ఒక ఓటు గా మలచుకొనే ముడి సరకు నువ్వు అవ్వకూడదు. నిన్ను అంటే నీ మతాన్ని అన్నట్టు కాదు ..నీ మతాన్ని అంటే నిన్ను అన్నట్టు కాదు. నీ బ్రతుకులో మతం కొంత వరకే ఉంటుంది. నువ్వు మానవత్వం ఉన్న మనిషివి..నీ మతం నీలో ఉన్న మానవత్వాన్ని పెంచాలి కానీ చంపకూడదు. నిన్ను నువ్వు మనిషిగా ఆవిష్కరించుకొన్న రోజున నా రాతల్లో తప్పులు ఉంటె చెప్పు,నేను నా తప్పుని తప్పు అని ఒప్పుకోటానికి వెనకాడను. Copied from FB Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.