Jump to content

Who is this IAS?


Vulavacharu

Recommended Posts

https://www.andhrudu.com/telugu/22722-2-jagan-govt-gets-a-wrong-advice/

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తోన్న ఓ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిపై కేంద్రం గురి పెట్టిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితునిగా పేరున్న ఈ అధికారి వ్యవహారశైలిపై కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సిఎం జగన్‌ ను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన సలహాలతో అనేక సమస్యలు వస్తున్నాయని వారు భావిస్తున్నారట. గత టిడిపి ప్రభుత్వంలో కీలకమైన శాఖలో పనిచేసిన ఈ ఐఎఎస్‌ అధికారి అప్పట్లో సరిగా పనిచేయలేదని, కోవర్ట్‌గా పనిచేశారనే విమర్శలు వినిపించాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ల కాలంలో ఈయనకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శాఖ ఇచ్చినా సరిగా పనిచేయకుండా ధీర్ఘకాలిక సెలవులపై వెళ్లారని, కొన్నాళ్లు పాటు తాను తెలంగాణకు వెళ్లిపోతానని, మరి కొన్నాళ్లు కేంద్ర సర్వీసులకు వెళతానని ప్రచారం చేయించుకున్నారు. ఒక వైపు కీలకమైన శాఖకు కార్యదర్శిగా ఉంటూనే ఆశాఖను గాలికి వదిలేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంతో కీలకమైన ఈశాఖలో అవినీతి విలయతాండవం చేయడానికి

 

4060_AP-State-Government.jpg
ఆయన ఒక కారణమని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు తన సహజధోరణితో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అధికారి వైకాపా నాయకులకు కోవర్ట్‌గా పనిచేశారని విమర్శలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కీలకమైనశాఖకు బాస్‌గా పనిచేసిన సదరు ఐఎఎస్‌ అధికారి తన కింద అధికారులతో ఇష్టారాజ్యంగా అవినీతి చేయించారని, వారి అవినీతిలో ఈయనకు వాటా ఉందేట. అయితే అప్పట్లో అవినీతి సొమ్మును వాటాలు వేసుకున్న పంచుకున్న సదరు అధికారి ఇప్పుడు నూతన ప్రభుత్వంలో తన కింద పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటుంటే వారిని రక్షించే స్థాయిలో ఉండి కూడా తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారట. మీరు చెబితేనే కదా అప్పట్లో నింబంధనలకు విరుద్దంగా చేశాం ఇప్పుడు మీరే ఆదుకోవాలని కోరితే తానేమీ చేయలేని చేతులెత్తేస్తున్నారట. ఈయన వ్యవహారశైలిని చూసిన సదరు అధికారులు అవాక్కు అవుతున్నారట. కాగా ప్రస్తుతం జగన్‌ కు అత్యంత దగ్గరిగా వ్యవహరిస్తున్న ఈ అధికారి ఇప్పుడు అన్నిశాఖల్లోనూ తానే వ్యవహరిస్తున్నారని, జగన్‌ కు తప్పుడు సలహాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెడుతున్నారనే మాట ఢిల్లీ వర్గాల నుంచి వస్తోంది. దీనితో ఇతని వ్యవహారాలపై దృష్టిపెట్టిన కేంద్రం ఆయనకు ఉచ్చు బిగించడానికి అంతా రెడీ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం పదవీ విరమణ చేసిన తరువాత తానే సిఎస్‌ను అవుతానని చెప్పుకుంటున్న సదరు ఐఎఎస్‌ అధికారికి తొందరలోనే కేంద్ర భారీ షాక్‌ ఇస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద అప్పచెప్పిన పనిచేయకుండా దురుద్దేశ్యాలతో, వ్యక్తిగత కక్షలతో వ్యవహరిస్తున్న సదరు ఐఎఎస్‌ అధికారికి ఉచ్చు రెడీగా ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...