Jump to content

ప్రజల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది: వైకాపా ఎమ్మెల్యేలు


kurnool NTR

Recommended Posts

● ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది

●మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైకాపా ఎమ్మెల్యేల ఆందోళన

● రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ పనితీరుపై పెదవి విరుపు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇసుక సరఫరా, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఇతర అంశాల్లో బాగా వెనుకబడిపోతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రజల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉంది. రహదారులు ఛిద్రమైనా పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసు శాఖల పనితీరు ఆందోళనకరంగా ఉంది. తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. దీని వల్ల ప్రజల్లో పార్టీ చులకనవుతోంది. పరిస్థితులను సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దికపోతే పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉంది.. - శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుల ఆందోళన ఇది..

న్యూస్ టుడే - వన్ టౌన్ : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లో సమీక్షించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, బి.మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్ , అదీప్ రాజ్ , తిప్పలనాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, శెట్టి ఫల్గుణ, కలెక్టర్ వి.వినయ్ చంద్ , సీపీ ఆర్ కె మీనా తదితరులు పాల్గొన్నారు.

*విశాఖ నగరం సహా జిల్లాలోని పరిస్థితులపై ప్రజాప్రతినిధులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారని, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఇంకా ఏమన్నారంటే...

ఎమ్మెల్యేల వాణి ఇలా..

*భూ సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ అధికారుల తీరు బాగోలేదు. పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి తేవాలి. పరవాడ మండల పరిధిలో రెండు గ్రామాలను జోన్ 5లో విలీనం చేయాలి. వీటిని అనకాపల్లి జోన్ లో ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్

*చోడవరం నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎడ్ల బళ్లపై ఇసుక తరలిస్తున్నవారిపై కేసులు పెడుతున్నారు. ఎస్పీకి చెప్పినా స్పందన లేదు. - చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

●●●*●వర్షాలకు గాజువాకలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం. వాలంటీర్ల పనితీరు బాలేదు. - గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

*22ఎ జాబితాల్లో పెట్టిన భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆన్ లైన్ తప్పిదాలను సరిదిద్దడం లేదు. పోలీసులు వినాయక చవితి ఉత్సవాల్లో అతిగా వ్యవహరించారు. పిల్లలు డీజేలు పెట్టుకుంటే అరెస్టులు చేయడం సరికాదు. - అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

●●●*పోలీసు శాఖ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది. తేలికపాటి అంశాలకే గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో పోలీసులు అతిగా వ్యవహరించారు. దీనివల్ల ప్రజల్లో పార్టీ చులకనవుతోంది. రాజకీయంగా ఇబ్బందులొచ్చే పరిస్థితి నెలకొంది.

Eenadu

Link to comment
Share on other sites

3 minutes ago, Uravakonda said:

TRS ki situation inka darunam ga undedhi before elections. Results choosaruga... inka endhuku ilanti threads manaku?

Ilanti posts thone YCP gelichindi bro.

You can’t compare this with TRS news. This is genuine. If you have time just spread the news.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...