Jump to content

Polavaram Reverse Tendering


JVC

Recommended Posts

అస్మదీయులకు  అప్పగించేందుకేనా?

  పోలవరంలో రివర్స్‌ టెండర్ల వెనక మర్మం!
  గుత్తేదారు సాంకేతిక, ఆర్థిక సత్తాను ముందు తేల్చరా?
  ఎల్‌1గా నిర్ధారించాక పరిశీలనా?
  కేంద్ర విజిలెన్సు కమిషన్‌ ప్రమాణాలకు విరుద్ధం
  అనుభవం, ఆర్థిక అంశాల్లో నీరుగార్చేలా ప్రమాణాలు
  కొత్త ప్రక్రియపై నిపుణుల విమర్శలు
ఈనాడు - అమరావతి

అస్మదీయులకు  అప్పగించేందుకేనా?

పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనులకూ, జలవిద్యుత్తు కేంద్రం పనులకూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండర్ల ప్రక్రియ లోపాల పుట్టగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర విజిలెన్సు కమిషన్‌ ప్రమాణాలకు భిన్నంగా ఉందని ఉదాహరణలతో ప్రస్తావిస్తున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే కావాల్సిన సంస్థకు కట్టబెట్టేందుకు వీలుగా నిబంధనలు పొందుపరిచినట్లు ఉందని పేర్కొంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండర్ల ప్రక్రియపై నిపుణులు ఎన్నో సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని విశ్లేషిస్తున్నారు. చాలా అంశాల్లో ప్రమాణాలు నీరుగార్చేలా ఉన్నా ముందుకెళుతుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771.44 కోట్ల విలువతో పార్టు ఏ గా, పోలవరం జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణానికి (12×80 మెగావాట్ల) రూ.3216.11 కోట్ల అంచనా విలువతో పార్టు బిగా జలవనరులశాఖ సంయుక్తంగా టెండర్లు పిలిచింది. ఆగస్టు 17న టెండరు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 5న ఈ-పోర్టల్‌లో టెండర్‌ డాక్యుమెంట్‌ను ఉంచారు. సెప్టెంబర్‌ 20 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువిచ్చారు.

అస్మదీయులకు  అప్పగించేందుకేనా?

వేర్వేరు శాఖలు, వేర్వేరు పనులకు.. ఒకే టెండరా?
కొత్త గుత్తేదారులకు పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు రెండు పనులకూ కలిపి టెండర్లు ఆహ్వానించారు. గతంలో వీటికి ఏపీ జెన్‌కో, జలవనరులశాఖలు వేర్వేరుగా టెండర్లు పిలిచి గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులు ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రధాన డ్యామ్‌ పనులు జలవనరులశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ రెండూ వేర్వేరు సంస్థలు. ఈ రెండు పనులూ వేర్వేరుగా చేపట్టాల్సినవి. అలాంటిది ఒకే టెండర్‌గా ఆహ్వానించి ఖరారు చేయనున్నారు. తర్వాత ఆయా ప్రభుత్వ సంస్థలు గుత్తేదారులతో విడివిడిగా ఒప్పందాలు కుదుర్చుకుని వేర్వేరుగా పనులు చేపడతాయి. వేర్వేరు సంస్థలు వేర్వేరుగా చేపట్టిన పనులకు కలిపి టెండర్లు పిలవడం ఏమిటి? తిరిగి ఆయా సంస్థలు వేర్వేరుగా పనులు చేయించేందుకు గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇందులో పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిధులు అందిస్తోంది. జలవిద్యుత్తు కేంద్రం పనులకు ఏపీ జెన్‌కో డబ్బులిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టుపై భారాన్ని మరో ప్రాజెక్టుపైకి బదిలీ చేసే అవకాశాన్ని కొట్టివేయలేమని, అది ఇతర సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్యామ్‌ పనులకు ఎల్‌ఎస్‌ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించగా, జలవిద్యుత్తు ప్రాజెక్టు (పార్టు బి)కి ఈపీసీ విధానంలో టెండర్లు  పిలవడం గమనార్హం.

సాంకేతిక, ఆర్థిక అర్హతలు తేల్చకుండానే రివర్స్‌కు అవకాశమా?
ఇప్పటివరకు టెండర్లలో ఎల్‌1 ఖరారు ప్రక్రియ ప్రమాణాలతో ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. తొలుత గుత్తేదారుల సాంకేతిక, ఆర్థిక అర్హతలు పరిశీలించి ఎవరు అర్హులో తేల్చేవారు. అర్హులైన వారి ఆర్థిక బిడ్‌ మాత్రమే తెరిచి ఎల్‌1 సంస్థను ఖరారు చేసేవారు. పోలవరం రివర్స్‌ టెండర్ల ప్రక్రియలో ఈ విధానం మార్చేశారు. కేవలం ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీ లేదా డిమాండు డ్రాఫ్ట్‌ అసలు ప్రతులు పరిశీలించుకుని బిడ్డింగ్‌కు అనుమతిస్తున్నారు. రివర్స్‌ ప్రక్రియలోనూ ఎల్‌1గా నిలిచిన తర్వాత అప్పుడు వారి సాంకేతిక, ఆర్థిక అర్హతలపై దృష్టి పెడతారు. ఇదేం పద్ధతి అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2004 డిసెంబర్‌ 10న కేంద్ర విజిలెన్సు కమిషన్‌ (సీవీసీ) టెండర్ల ప్రక్రియపై మార్గదర్శకాలు ఇచ్చింది. తొలుత గుత్తేదారు ఆర్థిక, సాంకేతిక అర్హతల ఆధారంగా అర్హులను కుదించి (షార్టు లిస్టు) ఆ తర్వాతే వారి నుంచి రివర్స్‌ బిడ్‌ ఆహ్వానించాలని అందులో స్పష్టంగా చెప్పింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే టెండర్ల ప్రక్రియలోనూ ఇదే విధానం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలవరం పనులకు సీవీసీ ప్రమాణాలు ఉల్లంఘించడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జెన్‌కో నిబంధనలకూ విరుద్ధమే
ఏపీ జెన్‌కో కూడా ఇప్పటివరకు తన టెండర్ల ప్రక్రియలో తొలుత ఎవరైతే సాంకేతిక, ఆర్థిక అర్హతలు కలిగి ఉంటారో ఎంపిక చేస్తుంది. ఆ తర్వాతే వారి ఆర్థిక బిడ్‌ తెరిచి ఎల్‌1 సంస్థను నిర్ణయిస్తోంది. ప్రస్తుతం పోలవరం జలవిద్యుత్తు కేంద్రం టెండర్లలో ఆ విధానం పాటించకపోవడం ఏపీ జెన్‌కో నిబంధనలను సైతం ఉల్లంఘించినట్లేనని పేర్కొంటున్నారు.

అనుభవమూ, ఆర్థిక సత్తాను నీరు గార్చారు
గుత్తేదారు అనుభవం, వారి ఆర్థిక సత్తా విషయంలో నిబంధనలను పాత టెండర్లతో పోలిస్తే నీరుగార్చారని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు ఆయా సంస్థలు గత పదేళ్లలో ఇలాంటి పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొనగా ప్రస్తుతం ఆ గడువును 15 ఏళ్లకు పెంచడమూ చర్చనీయాంశమవుతోంది. మరోవైపు గుత్తేదారు నెట్‌ వర్తు లెక్కించే నిబంధనలు మార్చారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏమైనా మూడు సంవత్సరాల్లో ఈ నిబంధన సంతృప్తిపరిస్తే  చాలన్నట్లుగా మార్పులు చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే అస్మదీయులకు అప్పజెప్పేందుకే ఇలా చేస్తున్నారనే  విమర్శ ఉంది. ఇలా లోపాలతో ఉన్న టెండర్ల ప్రక్రియను న్యాయపరంగా సవాల్‌ చేసే అవకాశం కల్పిస్తుండటంతో దీని వల్ల ప్రాజెక్టు నిర్మాణమూ ఆలస్యమయ్యే అవకాశం ఉందనీ చెబుతున్నారు.

కొసమెరుపు: ప్రస్తుత టెండర్ల విధానం ప్రకారం తొలుత ఎల్‌1 సంస్థను తేలుస్తారు. తర్వాత ఆ గుత్తేదారు సాంకేతికంగా, ఆర్థికంగా అర్హుడో కాదో పరిశీలిస్తారు. అప్పుడు అతనికి అర్హత లేదని తేలితే మొత్తం వ్యవహారం మొదటికి వస్తుంది కదా? మళ్లీ అప్పుడు కొత్తగా టెండర్లు పిలిస్తే మరింత ఆలస్యం కాదా? ఇవేం నిబంధనలు, ఇవేం విధానాలని నిపుణులు విస్తుపోతున్నారు.

 

Link to comment
Share on other sites

polavaram project panulu fast gaa cheyyaadaniki  retendering vesi , contract meil ki iddhaamani cbn try chesaadu . jaffa batch  gadkari daggariki velli addupulla vesaaru. cbn old rates ki navayuga ni oppinchaadu. ippudu jagan meil ki isthe navayuga rates tho same quality panulu chesthaaraa?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...