Jump to content

ANDHRA PRADESH


Sinna.Sinna

Recommended Posts

*శివాజీస్ స్పెషల్ ఆర్టికల్.* గౌ॥ Y.S. జగన్ మోహన్ రెడ్డి గారూ.... మీకు అమెరికా స్పీచ్ ఎవరు రాసారో కానీ పెద్ద *రెడ్ డ్రై ఫ్రూట్* అన్నా.... ఎందుకు అన్నాను అంటే మీ స్పీచ్ విన్నాను. బహుశా చెత్త స్పీచ్ లలో మొదటి స్థానం ఆక్రమిస్తుంది. ఎవరైనా పెట్టుబడులు ఆకర్షించడానికి మన బలాలు (strenths) చెప్పుకుంటారు.. *మార్కెటింగ్ & కంపెనీ డెవలప్ మెంట్ ప్రొఫెషనల్ గా నా 22 ఏళ్ల అనుభవంలో నా కంపెనీ గురించి ఎప్పుడు బలాలే చెప్పాను.* *అలా చెప్పడం ద్వారా బలహీనత కూడా బలంగా మారి ఎదుటి వారిని ఆకర్షించి లాయల్ కస్టమర్ బేస్ ని సంపాదించుకోగలిగాను.* ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హైలైట్ చెయ్యడంలో అమెరికాలో ఘోరంగా విఫలమయ్యారు. మీకే మన రాష్ట్రం మీద చిన్న చూపు ఉంది అని నా డౌట్. నాది పేద రాష్ట్రం అని *వితంతు ఏడుపు* ఏడిస్తే ఎవరు పెట్టుబడులు పెడతారు? మొట్టమొదట మీకు మన రాష్ట్రం గురించి అవగాహన కల్పిస్తాను: 2015 -19 కాలం రాష్ట్రం లోటుతో ఆరంభించి నేడు 6వ అతి పెద్ద ఎకానమీ గా నిలిచింది దేశంలో . 👍 దేశ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన 100 పంచాయితీలలో 33 పంచాయితీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 👉 స్వచ్ఛ భారత్ పరిశుభ్రమైన మొదటి 10 నగరాల్లో 💪విజయవాడ 💪విశాఖపట్నం 💪 తిరుపతి ఆంధ్ర కి చెందినవి. విద్యుత్ సంస్కరణలలో సాంప్రదాయక ఇంధన వనరులలో 2 వ స్థానం మన ఆంధ్ర. ఆ రంగాలలో అవకాశాలు అపారం. 👍 సులభతర వాణిజ్యం లో వరుసగా 3ఏళ్ళు "ఆంధ్ర" మొదటి స్థానంలో ఉంది. ఆరోగ్య సూచిలో దేశం లోని 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ - అనుబంధ రంగాల్లో రెండు అంకెలు వృద్ధి సాధించిన మొట్ట మొదటి రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో రెండు అంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం మన ఆంధ్ర ప్రదేశ్. అత్యధిక gst పన్నులు వృద్ధి సాధించిన #మొట్ట మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 2014-19 చివరికి 2,50,000 లక్షల కోట్ల పన్నుల ఆదాయం మీకు ఇచ్చాము. ఆనంద నగరాల్లో #ఆంధ్ర 48 స్థానంలో ఉంటే దేశం 120వ స్థానంలో ఉంది. ప్రకృతి వ్యవసాయం #ZBNF #ప్రపంచంలో రెండో ప్రాంతం దేశం లో #మొదటి రాష్ట్రం. భారత దేశం అతి పెద్ద FDI / KIA అది నా రాష్ట్రం #ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. అది మా చంద్రబాబు నాయుడు గారి కష్టానికి తగిన ప్రతిఫలం. భారత దేశంలో తయారయ్యే 5 ఫోన్స్ లో 3ఫోన్ లు ఆంధ్రలో తయారు అవుతున్నాయి. విజయవాడ గ్లోబల్ సిటీ ఆఫ్ ది ఫ్యూచర్. 💪ఆంధ్రప్రదేశ్ - అపారమైన నైపుణ్య మానవ వనరులలో (skilled employees) మొదటి స్థానం. మీరు చెప్తున్న హైదరాబాద్, తెలంగాణ 8 వ స్థానం. ఇంకా చెప్తే మూర్ఛపోతారు సీఎం గారూ. మీరు పాలనలో ఉన్నారు. మీకు నాకన్నా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాంటిది ఇన్ని ఘనతలు సాధించిన రాష్ట్రాన్ని హైలెట్ చెయ్యడం లో ఘోరంగా విఫలం అయ్యారు. ఈరోజు రాష్ట్రానికి జరిగిన ఘోర పరాభవం జీర్ణించుకోలేక పోతున్నా. 😤😥😥😥😥 అధికారులు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా? మా పన్నులతో జీతాలు తీసుకుంటున్న విషయం మర్చి పోకండి. పని చేయడం చేత కాకపోతే తప్పుకోండి. నా రాష్ట్ర భవిష్యత్ తో ఆడుకోకండి. *శివాజి (శివ సుబ్రహ్మణ్య శర్మ),* *M.A (Sanskrit),* *M.A (Telugu),* *M.A (English).,* *Ph.D in Sanskrit*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...