Jump to content

మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం


goldenstar

Recommended Posts

chidambaram_14.jpg

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు.  మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్నారు. చిదంబరం అక్కడ లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు కొందరు అధికారులు తెలిపారు. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి బుధవారం ఉదయాన్నే చిదంబరం ఇంటికి వెళ్లారు. దక్షిణ దిల్లీలోని జోర్‌బాఘ్‌ వద్ద ఉన్న చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. మరోవైపు ఆయన ఏ సమయంలోనైనా రావచ్చని భావించిన ఈడీ బృందం చిదంబరం నివాసం వద్దే కాచుకొని ఉన్నారు. కానీ, ఆయన రాకపోవడంతో వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

9 minutes ago, King Of Masses said:

Musiyalli e musali INC batch ni eni chesaro power lo vunappudu anubavinchandi..

em anubhavisthadu..oka 4 rojulu media hadavidi...tharuvatha bail...govt kutra ani oka statement...investigation oka 50 yrs..appataki vaadu undadu..case closed. idi mana daggara jarigedi..podichedi emi undadu

Link to comment
Share on other sites

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈనెల 26 వరకు నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజుల్లో కుటుంబసభ్యులు, న్యాయవాదులు చిదంబరంను కలవొచ్చని కోర్టు స్పష్టం చేసింది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...