Jump to content

కూకట్‌పల్లి ఎన్నికల ఫలితమే అందుకు నిదర్శనం !


koushik_k

Recommended Posts

హైదరాబాద్: మీ మిత్రులు ఎవరో చెప్పండి. మీరెలాంటి వారో చెబుతాము అంటారు పెద్దలు. స్నేహంలో ఉండే మ్యాజికే అది. స్నేహం అద్భుతాలు చేసి చూపెడుతుంది. స్నేహితులు అంతకు మించి అద్భుతాలు చేసి చూపెడుతారు. సొంతంగా కాకుండా స్నేహితుడి కోసమే త్యాగాలు చేయడం స్నేహంలో గొప్ప లక్షణం. ఇలాంటి గొప్ప స్నేహాలు రాజకీయాల్లో కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి ట్రెండింగ్ స్నేహితులు ఎవరో ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది.
 
 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎంత బద్దశత్రువులైనా ఎప్పుడో తిరిగి ప్రాణ స్నేహితులవుతారు. దీన్ని నిరూపించడానికి రాజకీయాలు పుట్టినప్పటి నుంచి ఎంతో మంది నేతలు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సీఎం జగన్ ఇప్పుడు అలాంటి స్నేహానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఒకప్పుడు ఏ రాజకీయ కారణాలతో అయితే బద్ధ శత్రువులుగా ఒకరిని ఒకరు వాదించుకున్నారో, తీవ్ర విమర్శలు కూడా చేసుకున్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. అప్పట్లో వారి మధ్య వైరం చూస్తే ఎదురెదురుగా వస్తే మాట్లాడుకుంటారా అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు అది పటాపంచలైంది. ఆ శతృత్వం స్థానంలో మితృత్వం వచ్చింది. అది అలాంటి.. ఇలాంటి మితృత్వం కాదు.
 
ఒకరిని ఒకరు వేయినోళ్ల పొగిడేంత వరకు కేసీఆర్‌పై జగన్.. జగన్‌పై కేసీఆర్ సమయం సందర్భం అవవసరం లేకుండా పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు. స్నేహం అద్భుతాలు చేసి చూపిస్తుందనే దానికి కేసీఆర్, జగనే సాక్ష్యం. ముందుగా రాజకీయ పరంగా ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీఆర్‌ఎస్ సవాల్ ఎదురైనప్పుడు తాను ఉన్నానంటూ అండగా నిలిచారు జగన్. తనకు అండగా నిలిచే సీమాంధ్రులను టీఆర్‌ఎస్ వైపు మళ్లించడంలో వైసీపీ శక్తియుక్తులను జగన్ కేంద్రీకరించారు. ఫలితంగా కూకట్‌పల్లి లాంటి చోట కూడా సీమాంధ్రులు విడిపోయారు. వైసీపీ అధిష్టానానికి అనుగుణంగా ఆ పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌కు పనిచేశారు. ఆ ప్రభావం చాలా విస్తృతంగా కనిపించిందని ఎన్నికలు ఫలితాలతో అర్థమైంది. ఆ ఫలితాల తర్వాత స్నేహ బంధం మరింత దృఢంగా మారింది.
 
ఎంతగా అంటే.. వైసీపీకి తెలంగాణ నుంచి సంపూర్ణ సహకారం లభించేలా వైసీపీ ప్రత్యర్థి అయిన టీడీపీని కార్నర్ చేయడానికి టీఆర్‌ఎస్ సంపూర్ణంగా సహకరించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి డేటా చోరీ వరకూ చాలా వచ్చాయి. అవన్నీ వైసీపీకి ఎన్నికల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి వైసీపీకి రాజకీయ వ్యూహాలు కూడా కేసీఆర్ ఇచ్చి సాయం చేశారన్న ప్రచారమూ జరిగింది. తెర వెనుక ఏం జరిగినా రాజకీయంగా మాత్రం జగన్, కేసీఆర్ ఆప్త మిత్రులైపోయారని ఎన్నికల ఫలితాలు రాకముందే తేలిపోయింది. ఇద్దరి స్నేహం ఫలితాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ఈ స్నేహ బంధం మరింత దృఢత్వానికి దారి తీసింది.
 
రాజకీయ స్నేహం ప్రజా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడకపోతే సార్థకత ఉండదనుకున్నారు జగన్, కేసీఆర్. అందుకే మొదటి క్షణం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వం పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇంత కాలం ఉప్పూనిప్పులా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి.. ఇప్పుడు రెండూ వేరువేరు కాదనే పరిస్థితి వరకూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రమే అనే భావనను ఇద్దరు ముఖ్యమంత్రలూ తమ అవినాభావ స్నేహంతో తీసుకొచ్చారంటే అతిశయోక్తి కాదు. వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీఎంల మధ్య స్నేహమే వారధిగా కనిపిస్తోంది.
 
 
హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తమకు అప్పగించాలని, కొత్త భవనాలు కట్టుకుంటామని ఏపీని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. కానీ.. అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కరించుకుందామని చెప్పి ఏపీలో ఉన్న గత ప్రభుత్వం తేలికగా తీసుకుంది. కానీ జగన్ మాత్రం స్నేహ ధర్మంతో కాస్తంత ఔదార్యం చూపారు. రంజాన్ విందుకు రాజ్‌భవన్‌కు వెళ్లి స్నేహితుడు కేసీఆర్‌కు రంజాన్ కానుక ఇచ్చారు. ‘దోస్తో.. ముబారక్ హో’ అనుకున్నారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ జల వివాదాలే. వీటిని పరిష్కరించుకోవడానికి కూడా జగన్ స్నేహమనే వారధిని ఎంచుకున్నారు.
 
ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్‌ను హిట్లర్‌గా అభివర్ణించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకించిన ఆయన.. సీఎం కాగానే నేరుగా అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిపోయారు. స్నేహం అద్భుతాలు చేస్తుందని నిరూపించారు. అంతేకాదు, తాను వ్యతిరేకించిన ప్రాజెక్టును, అక్రమంగా కడుతున్నారని ఏపీ వాదిస్తున్న ప్రాజెక్టుని ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీలో ప్రశంసించారు. స్నేహం ఎలాంటి అభ్యంతరాలనైనా తోసి పుచ్చుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. ఈ స్నేహాల్లో సరికొత్త శిఖరం ఉమ్మడి ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం.
 
 
ఇరు రాష్ట్రాలూ ఉమ్మడిగా తెలంగాణ భూభాగంలో గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు ఎత్తిపోసే ప్రాజెక్టుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ రూపకల్పన చేశారు. త్వరలో అది పట్టాలెక్కబోతోంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. స్నేహం కడుతున్న ప్రాజెక్టు. ఇప్పటివరకూ రాష్ట్రాల మధ్య జల వివాదాలే ఉన్నాయి. ఎవరి రాష్ట్రంలో వారు కట్టుకునే ప్రాజెక్టులకే దిగువ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాయి. కానీ.. కేసీఆర్, జగన్ తమ మిత్రుత్వంతో అలాంటి వివాదాలను దూదిపింజలా తొలగించొచ్చని నిరూపించారు.
 
తెలంగాణలో ఉమ్మడిగా ప్రాజెక్ట్ కడుతున్నారు. దేశం మొత్తం జల వివాదాల పరిష్కారానికి ఓ గొప్ప స్టాచ్యూలాగా ఈ ప్రాజెక్టు ఉండిపోవడం ఖాయం. దీనికి ఫ్రెండ్‌షిపే పునాది. నిజానికి కేసీఆర్, జగన్ ఇద్దరివీ పరస్పర విరుద్ధ రాజకీయ భావాలు. జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. జగన్ తండ్రి వైఎస్‌తో కేసీఆర్ హోరాహోరీ తలపడ్డారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై కేసీఆర్ కనీస పశ్చాతాపం కూడా వ్యక్తం చేయలేదని చెప్పేవారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన కుమారుడితో మాత్రం కుటుంబ బాగోగులు వాకబు చేసేంత స్నేహాన్ని పెంచుకోగలిగారు. విధాన నిర్ణయాలపై పరస్పర అభిప్రాయాలు తెలుసుకునేంత చనువు సంపాదించుకున్నారు.
 
 
దేశంలో ఏ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇలాంటి స్నేహ బంధం లేదు. ఉంటే రెండు తెలుగు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న అద్భుతాలే జరిగి ఉండేవనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే కాదు.. అంతకు ముందు ఉద్యమ కాలం నుంచి ఆంధ్రోళ్లూ, తెలంగాణ వాళ్లూ అనే విభజన రేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. అది గత రెండుమూడు నెలలుగా అదృశ్యమవుతోంది. ప్రభుత్వాలతో సహా అధికారులు, నేతలు అందరూ మనమంతా ఒక్కటే అనే పరిస్థితికి వస్తున్నారంటే అది ఫ్రెండ్‌షిప్ పుణ్యమే. రెండూ వేరువేరు రాష్ట్రాలు కాదని, ఒక్కటేనని కేసీఆర్, జగన్ సమక్షంలో ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఈ స్నేహానికి ఎంత బలమైన పునాది వేశాయో అర్థం చేసుకోవచ్చు.
 
కేసీఆర్, జగన్ స్నేహం రాజకీయ అవసరాల కోసమే ఏర్పడి ఉండొచ్చు కానీ అదిప్పుడు వ్యక్తిగతంగా మారింది. ఇరువురి కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నాయి. ముందుగా చెప్పుకుంటున్నట్లుగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగే శాశ్వత మిత్రులూ ఉండరు. రేపటి రాజకీయంలో తేడాలొచ్చినా వీరి స్నేహం మాత్రం ఇలానే ఉంటుందని ఇప్పటి అనుబంధాలతో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈసారి ఫ్రెండ్‌షిప్ డే బ్యాండ్ ఎవరికైనా దక్కాలంటే అది కచ్చితంగా జగన్, కేసీఆర్‌లకు మాత్రమే. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే చీఫ్ మినిస్టర్ సర్స్.
Link to comment
Share on other sites

KCR pette rod modatlo alane sammaga vuntundi... taruvaata vuntundi asalu noppi... adi telisesariki antha aypotundi..... appudu uff uff ani voodukoadam tappa ointment kooda raasukoleni paristiti... E jaffa ki daaniki sakshalu aduruga kanipistunna ardam kaavatledu...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...