Jump to content

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్‌?

Recommended Posts

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాన్‌పిక్‌ వ్యవహారంలో రస్‌అల్‌ఖైమా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం రస్‌అల్‌ ఖైమా సుమారు రూ.750కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని కొన్ని సంస్థలు ఆ రెండు జిల్లాల్లో దాదాపు 11వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. పోర్టు నిర్మాణంతో పాటు ఆయా భూముల్లో పరిశ్రమలు నెలకొల్పాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో కేసులు, అరెస్టులతో ఆ ప్రాజెక్టులు వివాదాల్లో  చిక్కుకున్నాయి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ భూముల వ్యవహారంపైనా గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టయ్యారు. దీంతో ఈడీ ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో రస్‌అల్‌ఖైమా పెట్టిన పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఈ ప్రాజెక్టులపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకరించడం వల్లే జగన్‌ సంస్థల్లో నిమ్మగడ్డ కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. దీనివల్ల మొత్తం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. వ్యాపార విస్తరణలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ ఇటీవల సెర్బియా వెళ్లినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికే రస్‌అల్‌ఖైమా సంస్థ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
 
Link to comment
Share on other sites

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ
30-07-2019 12:15:49
 
637000858678135981.jpg
సెర్బియా : తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రస్‌ అల్‌ ఖైమా నూతన సీఈవో ఫిర్యాదుతో ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగు చూసింది.
 
సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. కాగా.. నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే
Link to comment
Share on other sites

34 minutes ago, KING007 said:
 
Friend in need is friend indeed. This is the way to built loyalty. 

Leader should assess character of person. If you help right person he will show the loyalty. If you help wrong person he will leave you in tough times. CBN unlucky in this aspect.

Link to comment
Share on other sites

వాన్‌పిక్‌ కేసులో భారీ ఊరట

  • ప్రాజెక్టును కొనసాగించవచ్చు
  • నిమ్మగడ్డ ఆస్తుల జప్తు చెల్లదు
  • జగన్‌ దంపతుల ఆస్తులూ ‘విడుదల’
  • ఈడీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు
  • అక్రమాస్తుల కేసులో ఉత్తర్వులు
  • సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ
  • ‘రాకియా’ ఫిర్యాదుతో నిర్బంధం
న్యూఢిల్లీ/అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ‘వాన్‌పిక్‌’ కేసులో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసిన ఆయన ఆస్తులను విడుదల చేయాలంటూ ఢిల్లీలోని ఈడీ ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది. భారతీ సిమెంట్స్‌ కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణికి చెందిన రూ.746 కోట్ల విలువైన ఆస్తుల జప్తును కూడా ట్రైబ్యునల్‌ తప్పుపట్టింది. ఈ ఆస్తులను కూడా విడుదల చేయాలని శుక్రవారం తీర్పు చెప్పింది. వైఎస్‌ హయాంలో రస్‌ అల్‌ఖైమా సంయుక్త భాగస్వామ్యంతో వాడరేవు నిజాంపట్నం రేవు, పారిశ్రామిక కారిడార్‌ (వాన్‌పిక్‌) ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. వాన్‌పిక్‌లో రస్‌ అల్‌ఖైమాకు 51 శాతం, నిమ్మగడ్డ ప్రసాద్‌కు 49 శాతం వాటాలున్నాయి. దీనికోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్‌ ప్రభుత్వం 11వేల ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం రస్‌ అల్‌ఖైమా సుమారు రూ.750 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. మరోవైపు... నిమ్మగడ్డ ప్రసాద్‌ ‘క్విడ్‌ ప్రో’లో భాగంగా జగన్‌ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని, వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల మేరకు విరాళాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ‘వాన్‌పిక్‌’ కూడా ఒకటి. ఇందులో ‘క్విడ్‌ ప్రో’కో జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి... ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చర్యలు తీసుకుంది.
 
వాన్‌పిక్‌ భూములతోపాటు నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఈ జప్తు చెల్లదంటూ శుక్రవారం ఈడీ ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టును కొనసాగించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే... నాలుగు వారాల్లోపు రూ.274 కోట్లకు నిమ్మగడ్డ ఇన్‌డెమినిటీ బాండ్‌ సమర్పించాలని షరతు విధించింది. జగన్‌ కంపెనీల్లో నిమ్మగడ్డ సంస్థల పెట్టుబడులనూ సమర్థించింది. వెరసి... జగన్‌, ఆయన సతీమణి భారతికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసిన రూ.746 కోట్ల విలువైన ఆస్తులను విడుదల చేయాలని ఈడీ ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు తీరును కూడా తప్పుపట్టింది. ‘ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా, అంతా హడావుడిగా కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తు ప్రక్రియలో చాలా లోపాలున్నాయి’ అని ట్రైబ్యునల్‌ పేర్కొంది. అయితే... ఈ కేసులో ఆస్తుల విడుదలకూ, సీబీఐ దర్యాప్తునకూ సంబంధంలేదని స్పష్టం చేసింది. కాగా.. నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విహార యాత్రకు వెళ్లిన ఆయనను సోమవారం బెల్‌గ్రేడ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. ఎమిరేట్స్‌ దేశమైన రస్‌ అల్‌ఖైమా ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (రాకియా) సీఈవో ఫిర్యాదుపై స్పందించిన ఇంటర్‌పోల్‌ నిమ్మగడ్డపై లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసి బెల్‌గ్రేడ్‌లో అరెస్ట్‌ చేశారు.
 
విడుదలకు వైసీపీ ఎంపీల విన్నపం!
నిమ్మగడ్డ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయానికి సెర్బియా ప్రభుత్వం సమాచారం అందించింది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనను విడుదల చేసి భారత్‌కు రప్పించేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌, హోంమంత్రి అమిత్‌ షాలకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌పై భారత్‌లో ఎలాంటి కేసులు లేవని, ఆయనను వెనక్కి రప్పించి భారత్‌లోని న్యాయస్థానాల ద్వారా విచారించవచ్చునని ఈ వినతి పత్రంలో పేర్కొన్నట్లు వైసీపీ ఎంపీ ఒకరు చెప్పారు. ఈ వినతిపత్రంపై వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సంతకం చేసినట్లు తెలిసింది. మరోవైపు... బుధవారమే న్యాయవాదుల ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం
Link to comment
Share on other sites

11 hours ago, Raaz@NBK said:

A1 and A2 laki  kuda Interpol pedithe bavundu :D

Ah roju vastundi..... eppudu Jagan monagaadu ani DB lo collar egaresey batch..... “Nenu mundey Cheppaaa kaavali antey na old threads lepandi “ and coverings tho vastaaru 

Link to comment
Share on other sites

8 hours ago, sskmaestro said:

Ah roju vastundi..... eppudu Jagan monagaadu ani DB lo collar egaresey batch..... “Nenu mundey Cheppaaa kaavali antey na old threads lepandi “ and coverings tho vastaaru 

😆

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...