goldenstar Posted July 30, 2019 Share Posted July 30, 2019 మూడు లక్షల ఉద్యోగులపై వేటు ! న్యూఢిల్లీ, జూలై 29: పనితీరు సరిగా లేని లేదా క్రమ శిక్షణా చర్యలకు గురైన సీనియర్ రైల్వే ఉద్యోగుల కొలువులకు ముప్పు పొంచి ఉంది. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి నాటికి 30 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయసు పూర్తయ్యే ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వే కార్యాలయాలను కోరింది. ఆగస్టు 9కల్లా ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో సహా పంపాలని ఈ నెల 27న లేఖ రాసింది. ఈ ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా లేదా వారిపై క్రమ శిక్షణా చర్యలు ఉన్నా వారిని బలవంతంగా పదవీ విరమణ చేయించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఉద్యోగుల మానసిక పరిస్థితి, శారీరక పటుత్వం, హాజరు, సమయ పాలన, క్రమశిక్షణ, ఖర్చులు తగ్గించడంపై వారికి ఉన్న ఆసక్తి వంటి వివరాలు కూడా ఈ ఫార్మాట్లో పేర్కొనాలని రైల్వేబోర్డు కోరింది. భారతీయ రైల్వేలో ప్రస్తుతం 13లక్షల మంది ఉద్యోగులున్నారు. జీతాల ఖర్చులు తగ్గించుకునేందుకు వచ్చే ఏడాదికల్లా వీరి సంఖ్యను 10 లక్షలకు తగ్గించాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted July 30, 2019 Share Posted July 30, 2019 Privatise chestunnaruga Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted July 30, 2019 Share Posted July 30, 2019 Thats a good start. They should evaluate performance for all employees irrespective of age and service period. Inefficient personnel should be removed from the job same as in private sector. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.