Jump to content

చంద్రయాన్-2 ప్రయోగాన్ని అమెరికా చేపట్టిందా?


Recommended Posts

636996798135103060.jpg
అమరావతి: చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది ముమ్మాటికీ ఇస్రోనే. నెల్లూరులోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ నెల 22న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాన్ని వీక్షించింది. నాసా కూడా ఈ ప్రయోగంపై స్పందించింది. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపింది. చంద్రుడి మీదికి వెళ్లిన ఉపగ్రహం అక్కడి నుంచి అందించే విశేషాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.
 
అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ ఫ్లెక్సీ మాత్రం ఈ మొత్తం ఘనతను అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఆపాదించింది. అంతేకాదు, నాసాకు శుభకాంక్షలు కూడా తెలిపింది. ఇంతకీ ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే.. వై.చిన్నియాదవ్ అనే వైసీపీ అభిమాని. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఏపీ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి, తుడా చెవిరెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఏర్పాటు చేశారు.
 
అంతవరకు బాగానే ఉన్నా.. అందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బదులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు అభినందనలు తెలిపారు. ఇది చూసిన నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అయితే, ఫ్లెక్సీలో కనిపిస్తున్న ‘నాసా’ను గుడ్డిగా రాయించారా? లేక, ఎవరైనా కావాలని మార్ఫింగ్ చేసి నెట్‌లో పెట్టారా? అన్నది తెలియరాలేదు. దీనిని చూసినవారు మాత్రం అవగాహన లేకుండా ఇలాంటి రాతలేంటని మండిపడుతున్నారు
Link to comment
Share on other sites

నాసా  ప్రయోగించిన చంద్రయాన్ - 2 కి రాజన్న గాడు Driver, జగన్  గాడు  Conductor and చెవి  రెడ్డి  గాడు  Cleaner అంట.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...