Jump to content

జగన్ సర్కార్‌కు మరో ఝలక్


Recommended Posts

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్‌కు మరో ఝలక్ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. అయితే ఈ సమీక్షకు హాజరుకాకూడదని కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలను గౌరవించి, పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిస్కంలకు ఎస్‌ఈసీఐ లేఖ రాసింది.
 
టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించిన విషయం తెలిసిందే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని హితబోధచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని గుర్తుచేసింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇందన శాఖ గుర్తు చేసింది. 
 
 
ఇటీవల అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచబ్యాంక్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. భారీ రుణాన్ని వరల్డ్ బ్యాంక్ నిలిపివేసింది. 
 
 
 
Link to comment
Share on other sites

Vadi babu laga adhikaram lo unte prajalaki pappu bellalu panchi maha neta anipinchukutam anukunnademo. Nindu kunda lanti budget isthe yavadaina welfare chestadu. Lotu budget unnappudu adhikaram chetikosthe peekedem ledu ani eepatike ardam ayyi undali. 

Entha mandi PK's ni petti Goebbels pracharam chesina no use.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...