Jump to content

Todays Pulihora


Recommended Posts

Is it true NTR sought Jagan's appointment?

 

ఓ వైపు టీడీపీ శ్రేణులు ఆలోచిస్తుంటే.. మరొకవైపు ఆ పార్టీ వేళ్లన్నీ ఇప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్ వైపు చూపిస్తున్నాయి. లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బెటరని పలువురు టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయ పడుతున్నారట. అందుకనే తారక్‌ను తెరపైకి తీసుకువచ్చి టీడీపీ పగ్గాలు ఆయనకు అప్పగించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఇందుకు ససేమిరా.. అంటారని కూడా మరొక వర్గం భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ భవిష్యత్తు ఏమిటా అని నేతలంతా ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

అయితే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌ను వైసీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తుందని తెలిసింది. అందుకనే తారక్ నేడో, రేపో సీఎం వైఎస్ జగన్‌ను కూడా కలవనున్నాడట. ప్రస్తుతం ఏపీలో ఇదే వార్త బాగా ప్రచారమవుతోంది. అయితే తారక్‌ను ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. మరి ఆయన జగన్‌ను కలుస్తారా.. లేదా..? ఏపీలో ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

 

https://manalokam.com/editorial/junior-ntr-might-meet-cm-ys-jagan.html

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...