Jump to content

బిగ్ డిసీషన్: నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పిన చంద్రబాబు..!


NTK_FANS

Recommended Posts

పీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో పెద్దగా చెప్పనవసరంలేదు. ఏదైనా అభిప్రాయాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ ప్రజలకు తెలియ చేయాలంటే మీడియా కన్నా ముందు ఎక్కువ మందికి చేరవేస్తుంది సోషల్ మీడియా. అయితే వైసీపీ ఎన్నికలకు ముందు సోషల్ మీడియాను బాగా వినియోగించుకుందనే చెప్పాలి. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా టీం పనిచేసిన తీరు టీడీపీనీ బాగా దెబ్బకొట్టింది. అయితే సోషల్ మీడియా వినియోగంలో వైసీపీ కన్నా టీడీపీ కాస్త వెనకబడిందనే చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా నారా లోకేశ్ తన ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వ చేస్తున్న తప్పులను, అబద్దపు మాటలను సాక్ష్యాలతో సహా ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నారా లోకేశ్‌కు పూర్తిగా టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలను అప్పచెబితే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నాడు. సామాజిక మాద్యమాన్ని వినియోగించుకుని వీలైనంత త్వరగా ప్రజలకు పార్టీ బలోపేతానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధమవుతుంది. అయితే టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలను ఇప్పటి వరకు బ్రహ్మయ్య అనే వ్యక్తి చూసుకోగా ఇక నుంచి సోషల్ మీడియా టీం తో నారా లోకేశ్ సమన్వయం చేసుకోనున్నారు.

facebook.svg18
twitter.svg
whatsapp.svg
email.svg
Link to comment
Share on other sites

అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.🤣🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...