Jump to content

నేను ముఖ్యమంత్రి ని చెబుతున్నా జరగదా??


Cyclist

Recommended Posts

నేను ముఖ్యమంత్రి ని చెబుతున్నా జరగదా??

సీఎం జగన్ మోహన్ రెడ్డి విచిత్రవాదన..అవాక్కైన అధికారులు, మంత్రులు


చట్టానికి ,నిబందనలకు విరుద్ధంగా వెళ్లే  చంద్ర బాబు మాజీ సీఎం అయ్యారని వైసీపి ముక్త కంఠం తో అపోజిషన్ పై నిప్పులు చెరుగుతోంది..

అయితే గురువింద చందంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మంత్రులకు,అటు అధికారులకు మింగుడుపడక ఏం చెబితే ఎలా రియాక్టవుతారనే భయం తో వణికిపోతున్నారట మంత్రులు ,

ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు పక్కనపెట్టీ, మరీ జరిపిన  క్యాబినెట్ సమావేశంలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు బయటకు రాకపోయిన ..ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి విపరీత పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తోందో అని గుటకలు మింగుతున్నారు.

గురువారం ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశం లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత‌ క్యాబినెట్ అజెండా గా ఎనిమిది అంశాలు అనుకోగా తర్వాత వాటి ని 22 అంశాలకు మారుస్తు నిర్ణయంతీసుకొన్నారు. అంతా బాగుంది. తన మానిఫెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ ఆచరణలో పెట్టాలనే ఆతృత,ఆరాటం సీఎం కు వున్నా కానీ ఆర్థికంగా పరిపుష్టిత లేని ఖజానా ను చూసుకోకుండా వాటినిబమలు చేయడం ఎలా అన్న దానిపై అధికారులు,మంత్రులు సందేహాలు వ్యక్తం చేయడం తో   వారిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేశం తో ముఖ్యమంత్రి నేను చెబుతున్నా కానీ చేయరా అంటూ ఊగిపోవడం తో బిక్కమొహాలు వేయడం అందరి వంతుగా మారింది.
ఇక క్యాబినెట్ అజెండా లో పరిశ్రమ లో శాఖలో ఉద్యోగ కల్పన అంశం లో ఏకంగా ఆ శాఖ మహిళా అధికారి పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు తో కాబినెట్ సమావేశం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యిందని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. తన పాదయాత్ర లో హామీల్లో భాగంగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారు జగన్..అదే అంశం తాజా కాబినెట్ సమావేశం లో అటు అధికారులకు మంత్రుల పాలిట శాపంగ మారింది. గత మూడేళ్లుగా నియమించిన ఉద్యోగాల్లో స్థానికులు కాని వారెవరో చూసి ,వారి స్థానం లోఅర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఓ చట్టాన్ని తయారు చేసి త్వరగా అమలు చేయాలని కాబినెట్ సమావేశం లో సీఎం ఆదేశించారు.అయితే ఆ శాక కార్యదర్శి ఉదయ లక్ష్మి ఇది ఆచరణకు సాధ్యం కాదని,అలా చేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని  అమె చెప్పబోయారు..ఇంతలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం తో ఊగిపోతూ అంటే నేను బయటకు ఇలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదూ..మా ఉదయ లక్ష్మి చెప్పే చట్టాలు,నిబంధనలు వల్ల మీకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాలా అనడం తో ఒక్కసారిగా సమావేశం లో అందరు ముఖాలు తెల్లబోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే సీఎం హామీ అమలు చేయడానికి ఇతర మార్గాలున్నాయని చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించేలోగా తన చేతిలో వున్న పేపర్లు ను  టేబుల్ పై విసురుగా పడేసి  అందరికి  చేతులెత్తి నమస్కారం పెడుతూ కాబినెట్ సమావేశం లో నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయటకు వెళ్లిపోవడం తో  అధికారులు ,మంత్రులు షాక్ కి గురయ్యామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కాబినెట్ జరపటం లో తప్పులేదు కానీ ఆ విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ కు ,ప్రతిపక్షాలకు తెలపకుండా సమావేశం జరిపారు.దీంతో యథా ప్రకారం స్పీకర్ సమావేశాలను అనుకున్న సమయానికే ప్రారంభించేసారు..దీంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అసెంబ్లీ నడిపే తీరుపై మండిపడటం  తో ప్రభుత్వ పనితీరు ,సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లోను.ఇటు మంత్రులు ఎమ్మెల్యే లోను మమొదలైందని మంత్రులు కక్కలేక మింగలేక పోతున్నారని అసెంబ్లీ లాబీల్లో చర్చించుకుంటున్నారు.

Link to comment
Share on other sites

6 minutes ago, Bolineni Tiger said:

aa article lo negitive lo +ve undi .... chusi thippandi. Papam Jagan cheppindi cheyadaniki baga ry chesthunnadu kani adhikaluru oppukovatledu ane image pothundi... kompa theesi kalavane ilanti news vadluthunnara 

Absolute mazority undi kuda govt officials support cheyyadam ledu ante pulakesi gadi Mohan mida oostharu janam

Link to comment
Share on other sites

13 minutes ago, krish2015 said:

Absolute mazority undi kuda govt officials support cheyyadam ledu ante pulakesi gadi Mohan mida oostharu janam

Strict ga vuntene oo madhiriga work chestharu.. meru istham vachinapudu Randi isthamochinapudu work cheyandi ante evadu serious ga teesukunedhi bro..

Link to comment
Share on other sites

1 hour ago, Bolineni Tiger said:

aa article lo negitive lo +ve undi .... chusi thippandi. Papam Jagan cheppindi cheyadaniki baga ry chesthunnadu kani adhikaluru oppukovatledu ane image pothundi... kompa theesi kalavane ilanti news vadluthunnara 

Adhikarulu oppukovataniki akkada rules permit cheyyali and dabbulu undali ivanni choosukokunda chesina valla gathi chenchalguda jail ani oka precident chesadu kada mana jaffa velu padaduanicheppaka yemi chestharu tha pattina kundeluki moode kaallani pattubadithe mana moorkha sikhamani

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...