Jump to content

జడివాన జాడేదీ?!!......Farmers Worried.


bob9

Recommended Posts

  • బంగాళాఖాతంలో బలహీనంగా ‘నైరుతి’
  • 18 తరువాత పుంజుకొనే అవకాశం
  • అల్పపీడనాల కోసం ఎదురుచూపులు
  • ఉత్తరాదిలో తిష్ఠ వేసిన ద్రోణి
  • రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు
  • అత్యధికంగా కడపలో 52 శాతం లోటు
విశాఖపట్నం, జూలై 14(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌ మొదలై నెల దాటుతున్నా ఇంకా వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికీ పలుచోట్ల 40డిగ్రీలకు పైబడి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సిన తరుణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. కనీస స్థాయిలో కూడా వాన కురవకపోవడంతో చాలాప్రాంతాల్లో ఇప్పటికీ వరి నారుమడులు పోయలేదు. గతనెలలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు అక్కడక్కడా వేసిన అపరాలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటలు, తరువాత వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెలకుపైగా అయినా అడపాదడపా తప్ప జడివాన జాడలేదు. సాధారణంగా నైరుతి ప్రవేశించిన తరువాత ముసురు వాతావరణం నెలకొనాలి.
అయితే ఈ ఏడాది ఎండకాలం మాదిరిగా ఉరుములతో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కోస్తాలో ఎండ తీవ్రతకు మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. రుతుపవనాల ప్రవేశం తరువాత బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడాలి. అప్పుడే తూర్పుభారతం మీదుగా మధ్యభారతం, అక్కడినుంచి వాయవ్య రాష్ట్రాల వరకు వర్షాలు కురవాలి. ఇదే సమయంలో కోస్తా, తెలంగాణలో భారీవర్షాలు నమోదవుతుంటాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఇప్పటివరకు ఆరేడు అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం బంగాళాఖాతంలో అందుకు అనువైన వాతావరణం కనిపించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనాలు ఏర్పడితేనే నైరుతి సీజన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
 
 
ఏపీలో 32శాతం లోటు వర్షపాతం
దేశంలోని వాయవ్య భాగంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. అయితే నైరుతిపై ప్రభావం చూపే తూర్పు, పడమర ద్రోణి ప్రస్తుతం ఉత్తరాదిలో కొనసాగుతోంది. వారం రోజులుగా మఽఽధ్యభారతం నుంచి ద్రోణి పైకి పయనించడంతో ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టి, అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆదివారం నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో 28శాతం వర్షపాతం లోటు నమోదవగా ఇది ఏపీలో 32శాతంగా ఉంది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కడపలో సాధారణం కంటే 52శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో గతేడాది కూడా తీవ్ర దుర్భిక్షం నెలకొంది. సాధారణం కంటే నెల్లూరులో 45, పశ్చిమగోదావరిలో 43, శ్రీకాకుళంలో 38, విజయనగరంలో 36, కర్నూలులో 35శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ పరిస్థితులు ఆందోళనకరంగానేఉన్నాయి.
 
 
కొనసాగుతున్న వేసవి
బంగాళాఖాతంలో ఈనెల 18 తరువాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారితే రుతుపవనాలు పుంజుకుంటాయని వాతావరణ నిపుణుడు ఆచార్య ఓఎ్‌సఆర్‌యూ భానుకుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో ద్రోణి కూడా కిందకొచ్చే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ప్రతికూల పరిస్థితులపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
 
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతోందని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తున్నందున ఎండలే ఉంటాయని చెప్పారు. బంగాళాఖాతంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా అరేబియా సముద్రంలో మాత్రం చురుగ్గా కదులుతున్నాయన్నారు. ఇవి దక్షిణ చైనా సముద్రం దిశగా పయనిస్తున్నందున అల్పపీడనాలు రావడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావం కొనసాగి నీటి ఎద్దడి నెలకొంటుందని పేర్కొన్నారు.
 
Link to comment
Share on other sites

god gives you opportunity to learn from others mistakes, so that you can see why others are facing issues due to their choices and you can do better later..

if you dont learn, he will put you in that.. and you have to sail through it and learn... enjoy the fun ride AP folks.. 

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

Godavari Delta, Krishna Delta paddy crop yield peruguthundhi. This is ideal climate for paddy. In general paddy yield more during rabi due to high temperature. Same thing repeat for this kharif season. Remaining places toughluck.

Water lekapothey Krishna lo jonnalu kuda pandavu. Na lands lo Inka naatlu kuda start seyyalaaa..... last year e time ki transplantings kuda ayipoyayi as water is released in June through Pattiseema.

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Water lekapothey Krishna lo jonnalu kuda pandavu. Na lands lo Inka naatlu kuda start seyyalaaa..... last year e time ki transplantings kuda ayipoyayi as water is released in June through Pattiseema.

pattiseema nunchi water release cheyyaledhaa?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...