Jump to content

Budget


NTR ANNA

Recommended Posts

ఆట్లో డ్రేవర్లకి 10వేలకి లేదు

RTC వీలనం పై ప్రకటన ,నష్టలపై కేటాయింపులు గురించి ప్రస్తావన లేదు

CPS రద్దు గురించి ఉసే లేదు

పారిశ్రమిక రాయితి అనుమతులు గురించిలేవు

పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారనికి కేటాయింపులు లేవు

40 వేల కోట్లు పెరిగిన ఆంధ్రా అప్పు

Link to comment
Share on other sites

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లన్నిటినీ రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం…!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద గత ప్రభుత్వం మంజూరు చేసిన 4,36,907 ఇళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు ఇంకా కేటాయించని, లబ్ధిదారులకు మంజూరు చేసినా ప్రారంభంకాని, ప్రారంభమైనా నిధులు వెచ్చించని, బిలో బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్న ఇళ్ళను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాదికి పురోగతిలో ఉన్న ఇళ్లను పూర్తిచేసి, వచ్చే ఏడాది నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ మేరకు మంజూరైన ఇళ్లన్నిటినీ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

వైకాపా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ సాయ౦ ద్వారా ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్న వారంతా వచ్చే ఏడాది వరకు ఆగక తప్పేలా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం తరహాలో పలు పథకాలతో ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పేరునే ఇప్పుడు వైఎస్ఆర్ గృహ నిర్మాణంగా మార్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో గత ప్రభుత్వం 10,00,086 ఇళ్లు మంజూరు చేసింది. ఏటా 2లక్షల ఇళ్లు కేటాయిస్తూ.. చివరి ఏడాది ఒకేసారి 4లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 4,60,358 ఇళ్లు పూర్తి కాగా, 1,02,821 ఇళ్ల పనులు జరుగుతున్నాయి. మిగిలిన 4,36,907 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. అంటే ఆ ఇళ్లు ఇప్పటికే ఎవరికైనా మంజూరు చేసినా వాటికి బిల్లులు రావు. వచ్చే ఏడాది నుంచి కొత్తగా చేపట్టబోయే పథకంలో వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.

ఇక పాత ఇళ్ల మరమ్మతుల కోసం గత ప్రభుత్వం ‘అప్‌గ్రెడేషన్‌’ అనే పథకాన్ని ద్వారా గతంలో కట్టుకున్న ఇంటికి ఏవైనా మరమ్మతులు చేసుకోవాలంటే ఇంటికి రూ.10వేలు రాయితీ ఇస్తారు. ఈ పథకంలో 3,932 ఇళ్లకు రాయితీ ఇచ్చారు. ఇకపై ఈ పథకం అవసరం లేదనుకుని దాన్ని కూడా రద్దు చేసిన ప్రభుత్వం, తితలీ తుఫాను సమయంలో దెబ్బతిన్న 18,152 మంది ఇళ్లను పునఃపరిశీలించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తుఫాన్‌ సమయంలోనే అధికారులు వీటిని గుర్తించారు. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్‌ పథకం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యేల హామీలతో కొందరు సొంతంగా ఇళ్లు కట్టుకున్నావాటిల్లో 1,20,897 ఇళ్లకు రాయితీ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించగా.. కొత్త ప్రభుత్వం రద్దు చేసింది.

Ap Budget 2019 - 2020

Link to comment
Share on other sites

2 minutes ago, Vihari said:

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లన్నిటినీ రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం…!!

...

manchidi ... manchidi 

anni peeki thenkara jagan ... super le asala

nuvvante ento, nee babu ante ento, nee thatha ante ento thelisi ravali kodukulaki ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...