Jump to content

Uthara Kumarudu


Recommended Posts

అటవీ అధికారులపై దాడి.. కేంద్రం సీరియస్‌

అటవీ అధికారులపై దాడి.. కేంద్రం సీరియస్‌

దిల్లీ: తెలంగాణలోని అసీఫాబాద్‌ జిల్లా సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టంచేశారు. అటవీ శాఖ అధికారిణిపై ప్రజలు దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. రాజ్యసభలో కర్ణాటకకు చెందిన భాజపా రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎంపీ లేవనెత్తిన అంశంపై జావడేకర్‌ స్పందిస్తూ..  ఇలాంటి ఘటనల్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. వాటిని నియంత్రించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాఖ దీనిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని జావడేకర్‌ హామీ ఇచ్చారు.

అంతకముందు తెలంగాణలో జరిగిన ఈ ఘటనను రాజీవ్‌ చంద్రశేఖర్‌ రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. రాష్ట్రాల్లో పర్యావరణ చట్టాలు అమలు జరగడంలేదన్నారు. బెంగళూరులో చెరువులు, నీటివనరులు ఆక్రమణకు గురవుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణలో చట్టాలు అమలు కావడంలేదన్నారు. తెలంగాణలో పర్యావరణ చట్టాలను అమలుచేసే క్రమంలో ఎఫ్‌ఆర్‌వో అనితపై దాడిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చట్టాల అమలులో ఇలాంటి పరిస్థితులు పెద్ద సమస్యగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అటవీ చట్టాల అమలు కోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుదని ఆయన ప్రశ్నించారు. 

సార్సాలలో ఆదివారం అటవీశాఖ అధికారులపై అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు అనుచరులతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అటవీశాఖ రేంజ్‌ అధికారిణి అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...