Jump to content

పల్లె యువతకు తీపికబురు


koushik_k

Recommended Posts

గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌
రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఆగస్టు 15న విధుల్లోకి
జిల్లాలో 16400 మందికి అవకాశం
ఉద్యోగాల్లో సగం మంది మహిళలకు చాన్స్‌
ఎంపీడీవో చైర్మన్‌గా మండల స్థాయి ఎంపిక కమిటీ
 
కర్నూలు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు ప్రతి పేదవాడికి చెందాలి.. ప్రతి ఇంటికి అందాలి.. విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. అది జరగాలంటే ఆగస్టు 15 నుంచి గ్రామ వలంటీర్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. వారికి గౌరవ వేతనం రూ. 5 వేలు ఇస్తాం. ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ చేస్తారు.
- మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పిన మాటలు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి నెల గడవలేదు. ఇచ్చిన మాట అమలుకు శ్రీకారం చుట్టారు. సీఎంగా తొలి మూడు సంతకాలలో ఒకటైన గ్రామ వాలంటీర్ల నియామకానికి పచ్చజెండా ఊపారు. శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 16400 మంది గ్రామీణ నిరుపేద యువతకు గ్రామ వలంటీర్లుగా ఉద్యోగం లభించనుంది. ఈ ఉగ్యోగాల్లో సగం మహిళలకు కేటాయించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం మొదలు అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
 
 
జిల్లాలో 909 గ్రామ పంచాయతీలు, 1572 హ్యాబిటేషన్స్‌ ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో 33 లక్షల మంది జనాభా ఉన్నారు. 8.20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తారు. ఈ మేరకు జిల్లాలో 16400 మంది వాలంటీర్లు అవసరమవుతారని జిల్లా పంచాయతీ అధికారులు లెక్కలు వేశారు. శనివారం రాత్రి కలెక్టర్‌ వీరపాండ్యన్‌ జిల్లాలో గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు.
 
నిబంధనలు ఇవి:
  • గ్రామ వలంటీరుగా దరఖాస్తు చేసుకునే యువత అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి.
  • ఇంటర్‌, లేదా సమాన విద్యార్హత ఉండాలి.
  • నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ ఉంటుంది. అందులో 50 శాతం మహిళలు ఉండాలి.
  • 2019 జూన్‌ 30వ తేదీ నాటికి 18సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
  • దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
  •  ఎంపీడీవో చైర్మన్‌గా ఎంపీడీవో, తహసీల్దార్‌, ఈవో(పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ) కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి వలంటీర్లను ఎంపిక చేస్తుంది.
  • ఎంపికైన వలంటీర్లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తారు.
  • ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండు రోజులు మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15న ఎంపిక ఉత్తర్వులు అందజేస్తారు. ఆ రోజు నుంచే వారు విధులకు హాజరవుతారు.
  • గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో పనులు చేయాలి.
  • వలంటీర్‌ పనిచేసే 50 ఇళ్ల యూనిట్‌ను ఎంపీడీవో కమిటీ ఎంపిక చేస్తుంది.
 
దరఖాస్తు నమోదు నుంచి నియామకం వరకు
నోటిఫికేషన్‌: జూన్‌ 23, 24
అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో నమోదు: 24 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు
దరఖాస్తుల పరిశీలన: జూలై 10వ తేదీ వరకు
ఇంటర్వ్యూలు: జూలై 11 నుంచి 20వ తేదీ వరకు
ఎంపికైన లంటీర్లకు సమాచారం: ఆగస్టు 1న
శిక్షణ: ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు
నియామక ఉత్తర్వులు: ఆగస్టు 15న
Link to comment
Share on other sites

Emo sir...aa lekkalu Valle esukovali

Swiggy boys laa monthly oka 5k plus black lo 2k is sufficient maybe for them...and in 5-10 years they turn 45 and get pension....so they must be a happy lot enjoying freebies. As usual life long ycp jenda mostaru 😂

 

Bayataki vachi baagupadadaam anukune vadu elagu volunteer avvadu

Link to comment
Share on other sites

4 hours ago, Vishal_Ntr said:

Emo sir...aa lekkalu Valle esukovali

Swiggy boys laa monthly oka 5k plus black lo 2k is sufficient maybe for them...and in 5-10 years they turn 45 and get pension....so they must be a happy lot enjoying freebies. As usual life long ycp jenda mostaru 😂

 

Bayataki vachi baagupadadaam anukune vadu elagu volunteer avvadu

Baga chepparu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...