Jump to content

టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా


koushik_k

Recommended Posts

తిరుపతి: టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా పుట్టా తన పదవికి రాజీనామా చేయలేదు. తొలగించే వరకు కొనసాగుతానని మొదట చెప్పారు. అయితే ఆర్డినెన్స్‌తో టీటీడీ పాలక వర్గాన్ని తొలగిస్తామని బుధవారం ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్‌కు పంపారు.
 
గత ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ పాలమండలి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్ల కాలపరిమితితో అప్పటి టీడీపీ ప్రభుత్వం పుట్టాతోపాటు 16 మంది సభ్యులను పాలకమండలి సభ్యులుగా నియమించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో టీటీడీ పాలకమండలి రాజీనామా చేసే అనవాయితీ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వమే తనను తొలగిస్తే రాజీనామా చేస్తామని పుట్టా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. బుధవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఆర్డినెన్స్‌తో టీటీడీ పాలక వర్గాన్ని తొలగిస్తామని ప్రకటించడంతో పుట్టా సుధాకర్ యాదవ్ ఈ మేరకు రాజీనామా చేశారు.
Link to comment
Share on other sites

3 hours ago, TDP_2019 said:

Siggu lekunda ippati daaka resign cheyyakunda enduku unnadooo. Mari chillara fellow laa unnadu

 TTD chairman post ante general ga adhi swami vari sevaki dorikina avakasam ani feel avutharu chala mandhi. So avakasam vunnanthavaraku vuntaru aa post lo. Madhyalo vellakoodadhu voluntary ga ani. May be ala theesukovachhu manam.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...