Jump to content

దాడులు భరించలేక .. ఊరు ఖాళీచేసిన 100టీడీపీ కుటుంబాలు!

Eswar09

Recommended Posts

  • - బిక్కుబిక్కుమంటున్న టీడీపీ శ్రేణులు
  • - వైసీపీ దాడులతో ఊరు ఖాళీచేసిన వైనం
  • - గ్రామంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులు
  • - ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
  • - రూరల్‌ ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
గుంటూరు, జూన్‌ 15: పల్నాడులో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక గ్రామాల్లో టీడీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో వైసీపీ వర్గీయుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ వర్గీయుల దాడులతో సుమారు 100టీడీపీ కుటుంబాలు ఊరు విడిచి పారిపోయాయి. తిరిగి వారు గ్రామంలోకి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఊళ్ళోకి అడుగుపెడితే చంపేస్తామంటూ వైసీపీ వర్గీయులు హెచ్చరిస్తున్నాయి.
 
ఎవరైనా అవసరం ఉండి గ్రామంలోకి వెళితే వారిని చితక్కొడుతున్నారు. ఎన్నికల ఫలితాల రోజు నుంచి ఇప్పటి వరకు గ్రామంలోకి అడుగు పెట్టిన 20 మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు.. ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఊరు విడిచిన టీడీపీ వర్గీయులు వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో కౌలుకు ఇద్దామని ప్రయత్నిస్తుంటే ఎవరైనా టీడీపీ వారి పొలాలు కౌలుకు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామంలో దండోరా వేయించారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సూచనలతోనే తాము గ్రామం వదిలి వచ్చామని, తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదని, తాము ఎలా బతకాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం ఆ గ్రామానికి చెందిన సుమారు వంద మందికి పైగా టీడీపీ కార్యకర్తలు గుంటూరు రూరల్‌ ఎస్పీ ఆర్‌. జయలక్ష్మిని ఆశ్రయించారు.
 
బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. గత నెల 23న ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ అనుకూల ఫలితాలు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం నుంచే గ్రామంలో అలజడి వాతావరణం నెలకొందని గ్రామ తాజా మాజీ సర్పంచ్‌ చింతపల్లి జానీబాషా తెలిపారు. వైసీపీ వర్గీయులు ఆ రోజే మద్యం తాగి విజయోత్సవ ర్యాలీ చేస్తూ టీడీపీ వర్గీయులపై దాడులకు దిగారన్నా రు. దీంతో పోలీసులు గ్రామంలో ఉద్రిక్తతలు చల్లారాలం టే నాలుగు రోజులు టీడీపీ నేతలు వేరే గ్రామంలో తలదాచుకోవాలని సూచించారన్నారు. తాము గ్రామం విడిచి వెళ్ళేది లేదని, ఇళ్ళ నుంచి బయటకు రాబోమని చెప్పారు.
 
అయినప్పటికీ పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో టీడీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలకు చెందిన వారు గ్రామం విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం గ్రామంలో ఆయా కుటుంబాల్లో మహిళలు మాత్రమే ఉంటున్నారని టీడీపీ గ్రామ నాయకుడు షేక్‌ గుంటూరు అల్లాభక్షు తెలిపారు. అవసరాల నిమిత్తం ఎవరైనా గ్రామంలోకి వెళితే వారిని చితక్కొడుతున్నారన్నారు. గ్రామంలో వైసీపీ వర్గీయులు కాపలా కాస్తూ ఎవరైనా ఊళ్ళోకి వస్తున్నారా అనేది గమనించి దాడులు చేస్తున్నారన్నారు.
 
వారికి కళ్ళు కప్పి ఎవరైనా వచ్చినట్లు తెలిసినా ఇంటిపై దాడి చేసి తీవ్రంగా కొడుతున్నారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు ఫిర్యాదు కూడా తీసుకోకపోగా వాహనంపై నుంచి జారిపడ్డారని చెబుతున్నారన్నారు. ఇదిలావుంటే రెండు రోజుల క్రితం గ్రామానికి వెళ్ళిన గంగిరెడ్డిపాటి మహబూబ్‌ సుబానీ, పొన్నం శ్రీనివాసరావులపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఈ ఘటనపై కూడా తొలుత పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ వారికి తగిలిన గాయాలు చూసిన తరువాత కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం మాబూ సుభాని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో, శ్రీనివాసరావు పిడుగురాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తాజా మాజీ సర్పంచ్‌ చింతపల్లి జానీబాషా గ్రామంలోకి అడుగుపె డితే చంపేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
 
గ్రామంలో ఐదుగురు పోలీసులతో పికెట్‌ ఉన్నప్పటికీ వైసీపీ వర్గీయులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని వారు వాపోయారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఫోన్‌ చేస్తుంటే ఆయన అందుబాటులో లేరని వారు వాపోయారు. ఈ పరిస్థితుల్లో పోలీసు ఉన్నతాధికారులు తమకు పూర్తి రక్షణ కల్పించాలని, గ్రామంలోకి వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరిస్తూ గ్రామంలో దాడులకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని లేకుంటే తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి వద్ద మొరపెట్టుకున్నారు.
 
రక్షణ కల్పిస్తాం: రూరల్‌ ఎస్పీ
పిన్నెల్లి టీడీపీ శ్రేణులు భయపడాల్సిన పనిలేదని, పూర్తి రక్షణ కల్పిస్తామని రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి హామీ ఇచ్చారు. తాను స్వయంగా రెండు రోజుల్లో గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను తెలుసుకుంటానన్నారు. వైసీపీ శ్రేణులతో మాట్లాడి పరిస్థితిని అదుపుచేస్తామని చెప్పారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటానని అప్పటివరకు మీరు గ్రామంలోకి రావద్దని వారికి సూచించారు. పల్నాడులో రాజకీయ ఘర్షణలకు అవకాశం లేకుండా శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

10 minutes ago, Raaz@NBK said:

Neeti nijaayithi dharmam anukuntu kurchuntaadu..  Power vunna em peekaledu.. 

constitution, democracy antadu... democracy ante vote vesevadide power..

vote undali ante bathiki undali ga... ee logic cbn ki pattadu!

Link to comment
Share on other sites

2 minutes ago, vgchowdary said:

Ayya time ivvalsindi governance ki law and order matter lo taggakudadu...make some noise and protect our cadre..party jwnda mosina cadre ni kaapadakapote inka enni matladina waste

ippudu karyakarthala pennidhi, bayataki vasthada, twitter lo ne matladathada? guess!

Link to comment
Share on other sites

41 minutes ago, vgchowdary said:

Ayya time ivvalsindi governance ki law and order matter lo taggakudadu...make some noise and protect our cadre..party jwnda mosina cadre ni kaapadakapote inka enni matladina waste

Well said if CBN directly visit the village and have to give confidence to karyakarthas that he will be there for them and once CBN involve itey it will be big matter and vallu taggutharu as its going to  give them -ve image 

a paniki malina jaiTDP Twitter handle nunchie iyna illa mana karyakarthala medha jarugutuna attack’s gurinchie post cheyavachu kadha and meet dgp regarding it and make some noice atleast giving 5lks won’t bring the lost life. Atleast direct gha CBN or lokesh families ne visit chesie matladie vuntey inka Bagundhe illa edho meeting lo help chestham Anie general announcement kakunda

Link to comment
Share on other sites

1 hour ago, Jaitra said:

Em peekuthunnadu CBN

Velli aa graamam lo undochu ga,vallaki dhairyam ivvataaniki

Ysr 1time CM ayinapudu entha mandhi TDP leaders chanipoyaru...6 yrs narakam chusaru..ayina kevalam party ante prema meda alage fight chesaru..

2014 govt vachaka okkadini bayapetta lekapoyadu ...news chadave manke elaga unte already prblm face chesi..mana govt vachaka kuda nastaprichina vadini em cheyyaleka pothe vallaki elaga untundhi..ee CBN entha sepatiki  chetha gani matalu tappa em undhu..govt lenipadu cadre kurthuku vasthundhi.. govt vachaka devlopement antu cadre ni galiki vadlisthadu ...

Manam okadiki joliki pothe vadi time vasthe manalani kodatharu ane bayam undali...govt evadi ayina tdp cadre meda dadulu...thuu 

Link to comment
Share on other sites

Ravi IG ni marchu swamy antene aa alagaela suri jail pothe govt bad name vasthundi annadu...dani result ravi lanti dynamic leader lost..

YSR gadu CM avvagane jail ki velli venkatreddy ni kalisadu..adigithe na frnd kalisa em tappa annadu

Link to comment
Share on other sites

8 minutes ago, Eswar09 said:

Ravi IG ni marchu swamy antene aa alagaela suri jail pothe govt bad name vasthundi annadu...dani result ravi lanti dynamic leader lost..

 YSR gadu CM avvagane jail ki velli venkatreddy ni kalisadu..adigithe na frnd kalisa em tappa annadu

CBN is selfish moron anipisthadi.. oko sari ilantivi chusthe... everybody and everything (party, cadre, people, supporters) is there to elevate him annattu untadi...

dont know if it is true, but that is how I feel, when I get this info from credible source..

Link to comment
Share on other sites

40 minutes ago, abhi said:

Well said if CBN directly visit the village and have to give confidence to karyakarthas that he will be there for them and once CBN involve itey it will be big matter and vallu taggutharu as its going to  give them -ve image 

a paniki malina jaiTDP Twitter handle nunchie iyna illa mana karyakarthala medha jarugutuna attack’s gurinchie post cheyavachu kadha and meet dgp regarding it and make some noice atleast giving 5lks won’t bring the lost life. Atleast direct gha CBN or lokesh families ne visit chesie matladie vuntey inka Bagundhe illa edho meeting lo help chestham Anie general announcement kakunda

Twitter social media lite....TV channels lo press meet petti instructions different ga ivvali... democracy ni kuda hype thevali deeksha cheyyali cadre meedha atatcks ani. Lost ayina batch Kuda bojjalu penchakunda fight cheyali

Link to comment
Share on other sites

7 hours ago, NTR_Keka said:

In other way, tarak needs time and after 10 years etc....If tarak really wants to become CM right time to step in without any ones call...no one permission is required...

Brother ..manam andharam tarak vasthe bagundu anukone mundhu...as of now tarak oka party ni handle chesi postion lo unnada leda anedhi kuda chudali...

eppudu ayina unna situation same tdp party  unna situation lage undhi .. andharam monna SM lo party weak annam..ayina kuda anthe ayina cnma lani sariga promote chesukoleka unnadu ani feel avuthunam.. coll vachina clarity undadhu ..cnma bagunna ratings undav ..okka website support ga rayadhu etc etc ani manam still discussion chesukontanam.. cenma ke alage unte ...repu politics lo kuda cnma lage edho tickets ichama..poti chesama na duty ayipondhi anukonte kastam.. ..

Too be frank peddayna aggressiveness...dare steps evariki levu tdp party sambandichi..including family members .

migatha family members ki lendhi tarak ki  unna adv baga matladuthadu ..lacs ppl lo unna meetings chala dare ga tadapadukonda matladuthadu ..politics lo edhi okkati fetching party ki  ..wht abt other qualities avi  manam inka chudala tarak daggara.

ayinaki ravali anukonte party lo join avvanavasram ledhu...eppatini nunchi politics ni gurnchi depth ga follow aythe.. sudden ga alanti situation vasthe thada padakonda untadu.. ala kakunda edho sudden ga vache hand oopithe votes pade days Peddayantho ne last.

Link to comment
Share on other sites

4 minutes ago, ramntr said:

Ehe ivanni lite, 2004 lone Intha కన్నా ghoram చూశారు, ఇప్పుడు thakkuve le.. 

adhe mana position chuse daggra agipoyam..vallu eppudu chupinche daggra unnaru.

Link to comment
Share on other sites

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై వైకాపా రౌడీలుదాడులకు పాల్పడుతున్నారంటూ  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ  కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని హితవు పలికారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేయడమేనా .. వైకాపా చెప్పిన రాజన్న రాజ్యమని లోకేశ్‌ నిలదీశారు. పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు

Link to comment
Share on other sites

Just now, Eswar09 said:

Twitter lo vesthe no use... aa 100 mandi ni ventapettukuni vooru velthene vallaki dairyam ga vuntundi

Link to comment
Share on other sites

Just now, Eswar09 said:

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై వైకాపా రౌడీలుదాడులకు పాల్పడుతున్నారంటూ  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ  కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని హితవు పలికారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేయడమేనా .. వైకాపా చెప్పిన రాజన్న రాజ్యమని లోకేశ్‌ నిలదీశారు. పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు

Twitter dwara hecharinchadu anta :) . inka cadre ne aa devude kapadali ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...