Jump to content

Minister PusphaSri does not belong to ST community


Recommended Posts

పుష్పశ్రీవాణి ఎస్టీ కాదు..!

గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపణ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కులానికి సంబంధించి వివాదం కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీ కోటా పేరుతో మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ప్రశ్నించారు. విశాఖ జిల్లా అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. పుష్పశ్రీవాణి సోదరి రామతులసి గిరిజనురాలు కాదని అధికారులు ధ్రువీకరిస్తూ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. రామతులసి ఎస్టీ కానప్పుడు ఆమె సోదరి పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతారన్నారు. కురుపాం నుంచి మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఆమె ఎస్టీ కాదని కోర్టుకు వెళ్లగా.. కేసు విచారణలో ఉందన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా రెండోసారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం, గెలిచిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుని గిరిజన సంక్షేమ శాఖతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...