Jump to content

ఏదీ భృతి?..


Recommended Posts

  • నిరుద్యోగ భృతిపై నీలినీడలు
  • లబ్ధిదారుల ఖాతాల్లో జమకాని నగదు
  • ఎన్నికల ముందు రూ.2 వేలకు పెంచిన టీడీపీ ప్రభుత్వం
  • ఎన్నికల కోడ్‌తో ఏడు జిల్లాల్లో అమలుకు నోచుకోని వైనం
  • పథకం ఊసే ఎత్తని కొత్త ప్రభుత్వం
  • నిరుద్యోగ యువతలో ఆందోళన
(కలెక్టరేట్‌)
నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రారంభించిన నిరుద్యోగ భృతి పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులపై పునః సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అసలు నిరుద్యోగ భృతిని కొనసాగిస్తారా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగ భృతిని ప్రారంభించారు. డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్న 22 నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారిని ఈ పథకానికి ఎంపిక చేశారు. రూ.1000 అందించడానికి నిర్ణయించారు. ఇప్పటివరకూ ఏడు నెలల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు భృతి మొత్తాన్ని రూ.2000కు పెంచనున్నట్టు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అక్కడకు కొద్దిరోజుల్లో ఎమ్మెల్సీ కోడ్‌ అడ్డురావడంతో మన జిల్లాతో పాటు రాష్ట్రంలో మరో ఆరు జిల్లాల్లో అమలుకాలేదు. మిగతా ఆరు జిల్లాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యింది.
 
తప్పులతడకగా నమోదు
జిల్లాలో ప్రజాసాధికార సర్వే నమోదు ద్వారా 52 వేల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 33 వేల 197 మందికి మాత్రమే నిరుద్యోగ భృతి మంజూరయ్యింది. సుమారు 19 వేలకు పైబడిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ముందుగా ఎమ్మెల్సీ, తరువాత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అడ్డంకిగా మారడంతో దరఖాస్తు పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రజాసాధికార సర్వేలో తప్పుడు సమాచారం పొందుపరచడంతో కొంత మంది నిరుద్యోగుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కొన్ని దరఖాస్తులకు సంబంధించి బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌ నంబర్‌ తప్పులు దొర్లడం వల్ల వేలాది మంది భృతికి దూరంగా ఉన్నారు.
 
ఊసే లేదు..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నిరుద్యోగ భృతికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. దీంతో పథకం కొనసాగుతుందా లేదా అన్న అనుమానం నిరుద్యోగ యువతలో వెంటాడుతోంది. వాస్తవానికి పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీ లోగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. కానీ ఈ నెల 5వ తేదీ వచ్చినా ఖాతాల్లో నగదు జమ కాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సీఎం జగన్‌ మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనం రూ.1000 నుంచి రూ.3000కు పెంచారు. ఆశ వర్కర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచారు. ఎన్నికల హామీలో భాగంగా ఒక్కొక్కటీ పెంచుతూ వస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Link to comment
Share on other sites

5 hours ago, chaitu_ntr said:

E scheme ae tuppasi scheme.... udhyogam lekapotae dabbulu evaru istaru??

brother koncham bayata prapancham telusu kuni posts veyyandi..

its a very good scheme from government. appreciatable scheme.

Major countries lo istaaru ilaga till they get a job.. meanwhile they will train the people for skill development...

Link to comment
Share on other sites

6 hours ago, chaitu_ntr said:

E scheme ae tuppasi scheme.... udhyogam lekapotae dabbulu evaru istaru??

intlo thini kurchondi ani money ivvatledu.. they're providing industrial skill training to students and giving money as a stipend.. 

Link to comment
Share on other sites

On 6/4/2019 at 7:50 PM, SREE_123 said:

There are many countries..supporting when you are not in Job roles...

Show me a country who is supporting when they don’t have money.. right now ap ki money levu... ilanti tuppasi schemes valla no use

Link to comment
Share on other sites

58 minutes ago, chaitu_ntr said:

Show me a country who is supporting when they don’t have money.. right now ap ki money levu... ilanti tuppasi schemes valla no use

Addameyena panulaku dabuulu vuntayaa.....who asked 4lacks valanterress.....with 5K each....this amount is equal to 12 lacks people..who get 2K ...

Link to comment
Share on other sites

3 hours ago, chaitu_ntr said:

Show me a country who is supporting when they don’t have money.. right now ap ki money levu... ilanti tuppasi schemes valla no use

constructive ga money tayaaru cheyyayam lo CBN ni minchina vaaru AP lo leru...

vallaki em voorike ivvaledu malli vaallaki skill develop chesi valla chetha pani cheyyinchukuntaaru..

Link to comment
Share on other sites

On 6/5/2019 at 1:22 PM, ChiefMinister said:

brother koncham bayata prapancham telusu kuni posts veyyandi..

its a very good scheme from government. appreciatable scheme.

Major countries lo istaaru ilaga till they get a job.. meanwhile they will train the people for skill development...

Skill development chesukodaniki ade dabbutho edaina coaching centers pettochu, free ga trainings ivvochu, kaani dabbulu enduku anna. Gunde meeda cheyyi veskoni cheppandi 95% youth danni correct ga vadataro leka, duralavatlaku karchu pedataru?. To say 1cr allocate cheste daantlo fake names tho min 40% leaders tintaru, inko 40% cadar ki istaru, inko 20% real applicants ki potadi. Ee money schemes in india is tuppas, they are just for votes.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...