Jump to content

Eenadu analysis

Recommended Posts

తెలుగుదేశం ఓటమి వెనక... 

పూర్వాపరాల విశ్లేషణ

[opinion1a_253]

ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించగలదో లేదో అని సంశయంతో ఉన్నవారిని సైతం తీవ్ర విస్మయానికి గురిచేసే రీతిలో ఆ పార్టీ పరాజయం పాలైంది. నిజానికి కొద్దినెలల ముందునుంచి జాతీయస్థాయిలో వివిధ మీడియా సంస్థలు వెలువరించిన సర్వేల్లో  ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హవా ఉండబోతోందనే అంచనాలే ఎక్కువగా వచ్చాయి. పోలింగ్‌ తరవాత ప్రజల్లో, దేశ రాజధానిలోని రాజకీయవర్గాల్లో తెలుగుదేశానికి ఓటమి తప్పదనే ప్రచారమే అధికంగా జరిగింది. చివరకు అదే నిజమైంది. అయితే ఇంత ఘోరమైన ఓటమిని చవిచూస్తుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. తెలుగుదేశాన్ని తీవ్రంగా నిరాశపరచిన అంశం ఏమిటంటే- ప్రజలకు భారీయెత్తున నగదు పంపిణీ చేసే పథకాలను అమలుచేసినా ఓటమి తప్పకపోవడం! ‘పసుపు కుంకుమ’ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు 2016లో ఒకసారి, పోలింగుకు కొద్దిరోజుల మందు మరోసారి పదేసి వేల రూపాయల వంతున  ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేసింది. ఇలా ప్రయోజనం పొందిన మహిళలు సుమారు 90 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరి ఓట్లపైనే తెలుగుదేశం బాగా ఆశలు పెట్టుకుంది. రైతులకోసం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని చేపట్టి 46 లక్షలమంది రైతులకు తొలివిడతగా ఒక్కొక్కరికి నాలుగువేల వంతున పోలింగుకు కొద్దిరోజుల ముందు పంపిణీ చేసింది. వీటికి తోడు పట్టిసీమ నిర్మాణం, పోలవరం పురోగతి, రాజధాని వంటి అంశాల్లో తాము చేసిన కృషి ఎన్నికల్లో విజయానికి పునాది వేస్తుందని తెలుగుదేశం గట్టిగా నమ్మింది. పోలవరం, రాజధాని పనులపై ప్రజలకు సానుకూల అభిప్రాయం ఏర్పడటం కోసం కొద్ది నెలలుగా నిత్యం బస్సుల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో సందర్శన యాత్రలు నిర్వహించింది. ప్రభుత్వ ఖర్చుతో ఇలా లక్షల మంది ఆ పనులను చూశారు. రాష్ట్రంలో కియా కార్ల కర్మాగారం ఏర్పాటయ్యేలా చూడటం, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ కంపెనీలను రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేసిన కృషి చాలా ఉంది. ఇంత కృషి సల్పిన తమకే ఓట్లు వేస్తారనే విశ్వాసంతో తెలుగుదేశం వ్యవహరించింది.

అసంతృప్తికి మూలం ఎక్కడ? 

అధికారపార్టీ ఏ అంశాల ఆధారంగా అయితే జనం ఓటు వేయాలని ఆశిస్తుందో, దానికి అనుగుణంగానే ప్రజలూ స్పందిస్తారనే హామీ ఎప్పుడూ ఉండదు. తమ జీవితానుభావాలను బట్టి వారు ప్రాధాన్యాలను నిర్ణయించుకుంటారు. అధికారపార్టీ ఆలోచనలకు, ప్రజల ప్రాధాన్యాలకు మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు అది ఎన్నికల ఫలితాల్లో తప్పకుండా కనిపిస్తుంది. తెలుగుదేశం విషయంలో అది గతంలోనూ రెండుసార్లు రుజువైంది. 2003లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై తిరుపతి వద్ద నక్సలైట్లు హత్యాయత్నం చేసిన నేపథ్యంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభను రద్దు చేసింది. తీవ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగా తీర్పు ఇవ్వమంటూ ఎన్నికలకు వెళ్లింది. ఆనాటి ఎన్నికల్లో ప్రజలు వేరే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తెలుగుదేశాన్ని ఓడించారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన  కఠినమైన సంస్కరణలు, కరవుతో అలమటిస్తున్న ప్రాంతాలకు  ఉపశమనం కలిగించకపోవడం- నాడు ఓటర్లకు ప్రధాన అంశాలయ్యాయి. 1985-89 మధ్య ఎన్‌.టి.రామారావు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం దేశంలో మరెక్కడా అమలు కానిరీతిలో రెండురూపాయలకు కిలోబియ్యం, పేదలకు పక్కా ఇళ్ల వంటి పథకాలు చేపట్టింది. తెలుగుగంగ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికీ శ్రీకారం చుట్టింది. అయినా 1989 ఎన్నికల్లో ఇతర అంశాలే ఎక్కువ ప్రభావం చూపాయి. ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ప్రబలిన వ్యతిరేకత, అప్పటికి కొద్దికాలం ముందు వంగవీటి రంగా హత్య వంటివి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రభావం చూపాయి. ఆరోజు ఎన్టీఆర్‌ ఓటమిని రాజకీయ పండితులెవరూ ముందుగా ఊహించలేకపోయారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రభుత్వం కోరుకున్నట్లు కాకుండా ప్రజలు వేరే కోణాల్లో ఆలోచించడం తెలుగుదేశం ఓటమికి కారణమైంది. తెలుగుదేశం బాగా ఆశపెట్టుకున్న మహిళల స్పందనా వేరుగా ఉంది. 2014తో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగ్‌ శాతం అధికంగా పెరిగిన తొలి పది నియోజకవర్గాల్లోనూ వైకాపానే గెలిచింది. అందుకే  ప్రస్తుత ఎన్నికల ఫలితాలనుంచి  రాజకీయపార్టీలు నేర్వదగిన విలువైన పాఠాలు అనేకం ఉన్నాయి.

గత ఎన్నికల్లో వైకాపాపై తెలుగుదేశం స్వల్ప ఓట్ల ఆధిక్యంతో అయినా విజయం సాధించడానికి కారణాలు మూడు ఉన్నాయి. అవి కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరమని తటస్థులు ఎక్కువ మంది భావించడం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే  పాలన ఒక పద్ధతిగా ఉంటుందని, కిందిస్థాయి నాయకులు అడ్డగోలు అవినీతికి పాల్పడితే ఆయన సహించరని నమ్మడం అందులో మొదటిది. పవన్‌ కల్యాణ్‌ మద్దతు, దేశవ్యాప్తంగా మోదీ పట్ల సానుకూలత, భాజపాతో అవగాహన మిగిలిన రెండు కారణాలు. ఈ మూడు అంశాల్లో మొదటిదే కీలకం. అందుకే ఆ ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజల మొగ్గు తెలుగుదేశంవైపు కనిపించింది. అధికారం చేపట్టాక తన నుంచి తటస్థులు ఆశించిన కొన్ని అంశాలను చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. దాదాపు పదేళ్ల తరవాత అధికార యోగం పట్టడంతో అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నేతలు దారితప్పారు. ఇసుక, గనుల వంటి అంశాల్లో అక్రమాలు సాగించారు. ఇలాంటివారిపై చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకున్నారు. అది నెరవేరలేదు. అభియోగాలను ఎదుర్కొంటున్నవారికి మళ్ళీ టికెట్లు ఇవ్వడం క్షేత్రస్థాయిలో బాగా హానికరంగా మారిందని ప్రచారంలోకి వెళ్లాక చంద్రబాబుకూ అర్థమైంది. అందుకే 175 శాసనసభ స్థానాల్లో, 25 లోక్‌సభ స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఆ విజ్ఞప్తిని ప్రజలు పట్టించుకోలేదు.

క్షేత్రస్థాయిలో అవినీతిపై ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందనడానికి ఒక ఉదాహరణ చాలు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు సున్నపురాయి గనులను లూటీ చేశారు. గనుల శాఖ నివేదిక ప్రకారమే దాదాపు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారు. దీనిపై అందిన ఫిర్యాదుపై హైకోర్టు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దీనికి సంబంధించి ముగ్గురు కూలీలపై కేసులుపెట్టి అధికారపార్టీ నేతల జోలికి వెళ్లలేదు. దీనిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూలీల వెనక ఉన్నవారిపై కేసులు పెట్టరా అని వ్యాఖ్యానించింది. ఇక పింఛన్లు, రేషన్‌కార్డులు, స్వయంఉపాధి రుణాలు, ఇళ్లు వంటివి మంజూరు చేయడానికి ఊరూరా పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల అరాచకం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ కమిటీ సభ్యుల ఆధిపత్య ధోరణి, అవినీతి చర్యలతో జనం విసుగెత్తిపోయారు. ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణం పొందాలంటే వీరికి ఎంతో కొంత సమర్పించుకోవలసిందే. తెలుగుదేశం ఓటమిలో వీరిది పెద్ద పాత్రనే చెప్పాలి. ఇలా ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే ఒక భయం, అదుపు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గత ఎన్నికల్లో జగన్‌ను కాదని చంద్రబాబువైపు మొగ్గుచూపిన వారిలోనూ క్రమంగా ‘ఈసారి జగన్‌కు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు’ అనే చర్చ మొదలైంది. ప్రత్యేకించి పేద, బడుగు వర్గాల యువతలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. తల్లిదండ్రులు తెలుగుదేశానికి సంప్రదాయ ఓటర్లయిన కుటుంబాలవారు అయినప్పటికీ తాము మాత్రం ఈ ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేస్తామని కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువతీయువకులు అనేకమంది చెప్పడం గత ఎన్నికల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా రాని పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కనిపించింది. ‘పదేళ్లుగా ఆయన జనంలో తిరుగుతూనే ఉన్నారుగా, ఒకసారి అవకాశం ఇస్తే కదా ఏం చేస్తారో తెలిసేది’ అనే వాదనను వీరు వినిపించారు.

2017నాటికే వ్యతిరేకత బట్టబయలు 

అధికార తెలుగుదేశం పట్ల 2017 నాటికే వ్యతిరేకత  బట్టబయలు కావడం ప్రారంభమైంది. ఆ ఏడాది మార్చిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని అయిదు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోయారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనే తెలుగుదేశం మద్దతు ఉన్న భాజపా అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషిచేసినా ఫలితం దక్కలేదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వివిధ వర్గాల్లో అసంతృప్తి ఏర్పడి ఉండటాన్ని నాటి ఎన్నికల ప్రచారంలో క్రియాశీలక పాత్ర పోషించినవారంతా గమనించారు. ఈ తరుణంలోనే 2017 ఆగస్టులో నంద్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వైకాపా తరఫున గెలిచి తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. దాని నోటిఫికేషన్‌నాటికి పరిస్థితి తెలుగుదేశానికి అంత అనుకూలంగా ఏమీలేదు. తనకున్న అధికార బలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి ఎన్నికను 27వేల మెజారిటీతో తెలుగుదేశం గెలుచుకోగలిగింది. మంత్రులందరినీ నియోజకవర్గంలో మోహరించింది. దాదాపు 1,500కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను నంద్యాలకు ప్రకటించింది. కొన్నింటిని ఆగమేఘాలమీద ప్రారంభించింది. ఏకంగా 13వేల కుటుంబాలకు పక్కా ఇళ్లను మంజూరు చేసింది. వీటన్నింటి ప్రభావంతో ఫలితాన్ని శాసించగలిగింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పార్టీని నాయకత్వం ఏదోఒకటి చేసి గెలిపించగలదనే గట్టి విశ్వాసం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. తప్పులను చక్కదిద్దుకోవాలన్న స్పృహ పార్టీలో పైనుంచి కిందివరకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు అదే నంద్యాలను 30 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో వైకాపా గెలుచుకుంది. ఒక స్థానంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు చేయగలిగిన ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’ను సాధారణ ఎన్నికల్లో అన్నిచోట్లా చేయడం ఎవరికైనా అసాధ్యం. రెండేళ్లనాటి నంద్యాల ఉప ఎన్నికనుంచి వైకాపా పాఠాలు నేర్చుకుంది. చంద్రబాబు వ్యూహాలను ఢీ కొనాలంటే ఆషామాషీగా ఉంటే సాధ్యం కాదని అన్ని రకాలుగా అప్పటినుంచే  సన్నద్ధమైంది. 2017 నవంబరు నుంచే వైకాపా నేత జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. అది ఈ ఏడాది జనవరి వరకు కొనసాగింది. 134 నియోజకవర్గాల ద్వారా మొత్తం 3,648 కిలోమీటర్లు నడిచి ప్రజలను విస్తృతంగా కలిశారు. పింఛన్లను నెలకు వెయ్యినుంచి రెండువేలకు పెంచడం వంటి హామీలను నవరత్నాల పేరుతో అనేకం ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలోనూ వైకాపా పకడ్బందీ కసరత్తులు చేసింది. పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాల్లోనూ తెలుగుదేశానికి దీటుగా నిలిచింది. మరోవైపు 2014నాటికి మిత్రపక్షాలుగా ఉన్న భాజపా, తెలుగుదేశం 2019నాటికి శత్రుపక్షాలుగా మారడమూ వైకాపాకు బాగా కలిసివచ్చింది.

తప్పిన అంచనాలు 

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం భాజపాకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్రవైఖరి అవలంబించింది. ప్రత్యేక హాదా ఇవ్వని మోదీపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్ల ఈ వైఖరి రాజకీయంగా ప్రయోజనకరం కాగలదని అంచనా వేసింది. అందుకే చంద్రబాబు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరై ఆ పార్టీ కేంద్రంగా భాజపా వ్యతిరేక శక్తుల సమీకరణకు చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్రంలో అత్యంత నామమాత్రంగా మారిన కాంగ్రెస్‌తో స్నేహంచేస్తూ, మరోవైపు ఇక్కడ ఏమాత్రం బలంలేని భాజపాకు ఒక ముఖ్య శత్రువుగా చంద్రబాబు నిలిచారు. ఒక రకంగా ఇది విచిత్రమైన రాజకీయ విన్యాసమనే చెప్పాలి. మోదీతో జగన్‌ స్నేహంగా ఉంటున్నారనే అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లగలిగితే మోదీపట్ల వారిలో ఉన్న ద్వేషంతో జగన్‌నూ వ్యతిరేకిస్తారని తెలుగుదేశం అంచనా వేసింది. అయితే ఈ లెక్క తప్పింది. రాష్ట్రంలో  అధికారాన్ని చంద్రబాబుకు ఇవ్వాలా, జగన్‌కు ఇవ్వాలా అనే అంశంపైనే ప్రజలు ఈసారి ఓటు వేశారు. శత్రువుగా మారిన చంద్రబాబు ఓటమికి భాజపా తాను చేయగలిగినదంతా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఎన్నికల సభలకు హాజరైన ప్రధాని, ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేయడమూ ఇక్కడి ప్రతిపక్షానికి మేలుచేసింది. కొద్దినెలల ముందు జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఓటమికి తెరాస అధినేత కేసీఆర్‌ చేయగలిగినదంతా చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా- కేసీఆర్‌ అసాధారణమైన సంయమనం పాటించారు. నిత్యం చంద్రబాబు తనపై అనేక విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నా తాను స్పందిస్తే అది రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడుతుందని వ్యూహాత్మక మౌనం పాటించారు. పోలింగ్‌ కొద్దిరోజులు ఉందనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తానూ సమర్థిస్తానని ప్రకటించడం ద్వారా తమ ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ సుహృద్భావం వల్ల ఎన్నికల్లో జగన్‌కు నష్టం కలగకూడదన్న ఎత్తుగడను అనుసరించారు. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం పూర్తి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈసారి సొంతంగా రంగంలోకి దిగారు. ఆ మిత్రుడు దూరం కావడమూ ఈసారి తెలుగుదేశాన్ని నష్టపరచింది. మరోవైపు సామాజిక సమీకరణాల్లో వచ్చిన మార్పులూ తెలుగుదేశాన్ని నష్టపరచాయి. అనేక వర్గాల్లో తెలుగుదేశం పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్‌  తొలిసారిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి దిగి పరాజయం చెందడం పార్టీకి తీవ్ర విఘాతమే అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి పార్టీని బయటపడవేసి ముందుకు సాగేందుకు నాయకత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో, ఎలాంటి మార్పులు చేసుకుంటుందో వేచిచూడాలి.

Link to comment
Share on other sites

Good analysis after everything is over. One point is sure, TDP couldnot reach peoples expectations instead we kept our energies/focus on things that really doesnot matter to state or people. More important thing is cannot make enemies all the time without knowing our own strength.  our strength is not like JAgan/KCR/MODI who can control masses even with little work. peoples perception on CBN is best administrator which he try to change by following strategies of KCR/YSR instead of stciking to his own.

last point is CBN could not control the MLA's as he thought of following YSR way of letting his tem earn money which backfired.  "goda meda pilli" is not going to work all the time. we felt Jagan as self goal specialist but didnot realise he is bang on target with his goals which people liked. for e.g kapu reservation etc he is franks and stick but our guys want to manage all castes end up with noone.

Atleast now our teams should stop saying Jagan as selfgoal specilaist as per my view. 

Link to comment
Share on other sites

2 hours ago, ntr_king said:

అధికారపార్టీ ఏ అంశాల ఆధారంగా అయితే జనం ఓటు వేయాలని ఆశిస్తుందో, దానికి అనుగుణంగానే ప్రజలూ స్పందిస్తారనే హామీ ఎప్పుడూ ఉండదు. తమ జీవితానుభావాలను బట్టి వారు ప్రాధాన్యాలను నిర్ణయించుకుంటారు. అధికారపార్టీ ఆలోచనలకు, ప్రజల ప్రాధాన్యాలకు మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు అది ఎన్నికల ఫలితాల్లో తప్పకుండా కనిపిస్తుంది.

2017 lo "Intintiki Telugu Desam" jarigindi. (Around august maybe)

Lower classes, evari intinki vellina house loans ippinchandi ani adigevaaru. Feedback went to the CM.

"Dabbullevu" was the answer :wacko:

Link to comment
Share on other sites

Mana government vachhindi ani lots of BC's chinna chinna houses kattukunnaru. They are still having debts. 

House loans ki enni restrictions pettarante, it was impossible to get a loan. 

Foundation deggara nundi, geo located photographs kavali anta. Orey asala entiraa unmaadam

Link to comment
Share on other sites

9 minutes ago, AbbaiG said:

YSR Ni chusi emi nerchukolaaa Bob..

Existing customers service is important than new customers...

YSR gaadu    aadiki votes vesevallaki bagaa ichhadu

Emanna antee rules regulations... Kaliddhi cader ki

Link to comment
Share on other sites

2 hours ago, Rear Window said:

good analysis

kaani tatha kudaa ground reality telusukolekapoyaadu gaa

leka telisi kudaa light teesukunnaadaa?

Cbn ki em thliyakana.. Andhuke last 6 months lo anni schemes petti cover cheddamu anukonnadu. 

Ysr entha dochukonna.. Schemes valla laba paddadu kada manam kuda alge bayatapaduchu anukonnadu. 

Eppudu aythe cbn thana own style ni kadhunukoni pakka vallani follow avvdam start chesado akkade downfall start ayindhi. 

83 nunchi tdp ki brand name undhi.. Schemes pettina pettaka poyina avineeti undadhu babu chala strict ani.. Eppudu aythe ee term lo mla lu tinadatam start chesaro janalu oho veellu kuda enthe inka vallaki vellaki diff ledhu.. Vallu aythe vellu ichina danikante ekkuva money istharu.. Manam sampadinchu kovachu anukonnaru, at the same main ga bada padi matter youth mentality totally changed. Worest generation eppudu unde youth. 

Cbn thana style lone undi unte kanisam neutral votes anna padave.. E sari vallu veyyakapovdaniki adhe main reason. 

Link to comment
Share on other sites

2 minutes ago, r_sk said:

Otami ki andaru sathruvule.... Gelupuki andaru mithrule avathaaru.... ante ee thread ni chusthe ardamavuthundi....

Politicas lo permanent mithrulu undavaru.. Permanent saturavulu undaru.. 

Link to comment
Share on other sites

29 minutes ago, ChiefMinister said:

ivanni vodina taravatha vesthaaru ...

gelavaka mundu okka survey lo kuda chepparu.. enduku..

vodina vaadiki anni negatives ee .. politics lo avi kaastha ekkuva anipisthaayi....

Endhuku le bro..cheppe vallu cheputhune untaru.. party meda prema tho maname vinpinchukomu.. leader ki kuda lage undavchu.

ikkada cheppe vallu antha CBN meda kopam emi undhu..kakapothe odipoyam kada alaga chesi unte bagundhi..elga chesi unte bagundhi...nenu mundhi nunchi chebuthune vinnala..naku mundhe telusu ela jaruguthundhi ani.... odi poyyaka elantivi anni ravatam comman adhi evariki ayina....Avarsam aythe GOD ne velu etti chupinche manushulam manam..CBN yentha inka evaru ayina yentha.

Manishi unnapudu vadi gurnchi okkadu manchi mata cheppadu..poyyaka chala goppodu..machi manshi okka mata ane vadu kadhu...evi anni comman ga vachi matalu..denilo evarini tappu pattalasina edhi emi ledhu....

Game adi vadiki telusthundi aa noppi..TV mundhu kurchuni..match ayyaka aa boll atta kottalisndhi..catch anavsaram ga miss chesadu dani valle match poyindhi.. andhariki telusu feild lo aadithe telusthundhi ani kani edho oka discussion ..timepass kavali ga.

elanti vanni prathi match ayyaka mamule.Politics also same like game. evadu okade CM avuthadu...kakapothe aa game lo mana involvement emi undhu bayata nunchi chudatam tappa..kani ee game "VOTE" ane daniotho parthi vadu link ayi untadu.

Link to comment
Share on other sites

4 minutes ago, Eswar09 said:

Endhuku le bro..cheppe vallu cheputhune untaru.. party meda prema tho maname vinpinchukomu.. leader ki kuda lage undavchu.

ikkada cheppe vallu antha CBN meda kopam emi undhu..kakapothe odipoyam kada alaga chesi unte bagundhi..elga chesi unte bagundhi...nenu mundhi nunchi chebuthune vinnala..naku mundhe telusu ela jaruguthundhi ani.... odi poyyaka elantivi anni ravatam comman adhi evariki ayina....Avarsam aythe GOD ne velu etti chupinche manushulam manam..CBN yentha inka evaru ayina yentha.

Manishi unnapudu vadi gurnchi okkadu manchi mata cheppadu..poyyaka chala goppodu..machi manshi okka mata ane vadu kadhu...evi anni comman ga vachi matalu..denilo evarini tappu pattalasina edhi emi ledhu....

Game adi vadiki telusthundi aa noppi..TV mundhu kurchuni..match ayyaka aa boll atta kottalisndhi..catch anavsaram ga miss chesadu dani valle match poyindhi..

elanti vanni prathi match ayyaka mamule..Politics also same like game. evadu okade CM avuthadu...kakapothe aa game lo mana involvement emi undhu bayata nunchi chudatam tappa..kani ee game "VOTE" ane daniotho parthi vadu link ayi untadu.

meeru cheppindhi correcte . game ade vaadiki telusthundhi aa noppi.  vaallaku lakshallo suggestions/proposals vasthaayi. kaakapothe vaatilo genuine concern emiti , misleading concern emiti ani choodataaniki loyal & capable persons kaavaali. aa persons ni choose/hire chesukuni work delegate cheyyadam lo leader capacity vuntundhi. 2014 taruvaatha feedback system asalu vundho ledho teliyadhu. 

cricket match chaalaa takkuva time vuntundhi . chalaa fast gaa game maripothundhi.

ikkada 5 years match lo sariggaa requirements telusukovadam, feedback teesukoni correct chesukovadaaniki chance vuntundhi. ika worst case lo emi cheyyalem. okkkosaari feedback vachinaa ignore cheyyadam problem avuthundhi. 

Link to comment
Share on other sites

We cant reverse what has happened. Now we got time to introspect ,take real feedback and take strong decisions on many issues instead of goda media pilli type.  Also we need to reduce our enmity with at least some of them. Either make them neutral or friends. In 2014 we have only one powerful opposition now we are alone. All coz of our own decisions pushed us to this level.

Link to comment
Share on other sites

45 minutes ago, ChiefMinister said:

ivanni vodina taravatha vesthaaru ...

gelavaka mundu okka survey lo kuda chepparu.. enduku..

vodina vaadiki anni negatives ee .. politics lo avi kaastha ekkuva anipisthaayi....

Naa point idhe.. 

Link to comment
Share on other sites

4 minutes ago, ravindras said:

meeru cheppindhi correcte . game ade vaadiki telusthundhi aa noppi.  vaallaku lakshallo suggestions/proposals vasthaayi. kaakapothe vaatilo genuine concern emiti , misleading concern emiti ani choodataaniki loyal & capable persons kaavaali. aa persons ni choose/hire chesukuni work delegate cheyyadam lo leader capacity vuntundhi. 2014 taruvaatha feedback system asalu vundho ledho teliyadhu. 

cricket match chaalaa takkuva time vuntundhi . chalaa fast gaa game maripothundhi.

ikkada 5 years match lo sariggaa requirements telusukovadam, feedback teesukoni correct chesukovadaaniki chance vuntundhi. ika worst case lo emi cheyyalem. okkkosaari feedback vachinaa ignore cheyyadam problem avuthundhi. 

Borther mistakes cheyyani manshi untada ...? bad time vachinapudu entha thlivayina vadu anna wrong steps vesthadu..

CBN prathi sari fail ana candidate kadhu ga..3 times success chusina vade kadha..  ayinaki kuda telusu tappulu jaruguthunay ani kani correct step thisukoledhu ante ayina alochanalu elga unnayoo aynaki telusu...manaki correct ga teliyadhu.

kani entha bad results iche antha tappulu CBN emi chesadu...

Link to comment
Share on other sites

4 minutes ago, Eswar09 said:

Rape lu jaragaya,murder lu vichala vidiga jaragya, emergency vathavaram emi anna undha..ee 5 yrs enni darnalu jarigay..

unnatho andharu happy gane unnaru ga..intha gorimina results isthara

It is all time. Jagan gadiki anni khalisi vacchay.  CBN ki bad time. I don't believe in astrology etc. But last month someone posted on internet that Due to some Saturn etc CBN will face humiliation and lose his credibility till October 19. I thought it as a joke but what surprised me is the result which is equal to an insult to CBN. I never thought I will see such days in my life with CBN as he is my inspiration for hardwork,  persistence and vision.

Link to comment
Share on other sites

4 minutes ago, Eswar09 said:

Borther mistakes cheyyani manshi untada ...? bad time vachinapudu entha thlivayina vadu anna wrong steps vesthadu..

CBN prathi sari fail ana candidate kadhu ga..3 times success chusina vade kadha..  ayinaki kuda telusu tappulu jaruguthunay ani kani correct step thisukoledhu ante ayina alochanalu elga unnayoo aynaki telusu...manaki correct ga teliyadhu.

kani entha bad results iche antha tappulu CBN emi chesadu...

naa opinion prakaaram welfare+development super. inthakuminchi evaru cheyyaleru.

capital meedha hype create cheyydam valla UA+SEEMA lo resentment perigindhi. ika K meedha hatred & jealous koodaa problem ayyindhi. poll/money management lo fail ayyaam . janmabhoomi committee,mla,mla kin valla problem ayyindhi . veellani control cheyyalekapoyaadu.  ee issues lack ayyaadu. veetilo cbn feedback vachi vunte corrective action teesukovaali. atleast people ni  proper gaa communicate chesi , convince cheyyaali. cadre,mlas iche feedback ni serious gaa teesukovaali. vaallu cheppina vaatini ignore chesi motham governance meedha dhrushti pedithe problem avuthundhi. cadre ichina feedback serious gaa teesukokundaa  cbn ventane cadre ki counter vesthe next time evvadu feedback ivvadu.

Link to comment
Share on other sites

3 minutes ago, VAMSI tALASILA said:

It is all time. Jagan gadiki anni khalisi vacchay.  CBN ki bad time. I don't believe in astrology etc. But last month someone posted on internet that Due to some Saturn etc CBN will face humiliation and lose his credibility till October 19. I thought it as a joke but what surprised me is the result which is equal to an insult to CBN. I never thought I will see such days in my life with CBN as he is my inspiration for hardwork,  persistence and vision.

anthe anukovali..

daridram ventaadithe mosquito bite ki koodaa chanipothaam.

Link to comment
Share on other sites

4 hours ago, Rear Window said:

good analysis

kaani tatha kudaa ground reality telusukolekapoyaadu gaa

leka telisi kudaa light teesukunnaadaa?

Andariki telisi lite tesukunaru anukutuna. Manam edho 1st phase lo patasaru ani anukunam but valu prepared ga vundi mana negative mlas ni maruchukovataniki chance ivale even i think CBN know the situation.. ledhu ante ala antha welfare schemes and a promises ivadu.. asalu mana manifesto anedhi okatti vundhi 60% ppl ki telavadhu..

Link to comment
Share on other sites

8 minutes ago, ravindras said:

naa opinion prakaaram welfare+development super. inthakuminchi evaru cheyyaleru.

capital meedha hype create cheyydam valla UA+SEEMA lo resentment perigindhi. ika K meedha hatred & jealous koodaa problem ayyindhi. poll/money management lo fail ayyaam . janmabhoomi committee,mla,mla kin valla problem ayyindhi . veellani control cheyyalekapoyaadu.  ee issues lack ayyaadu. veetilo cbn feedback vachi vunte corrective action teesukovaali. atleast people ni  proper gaa communicate chesi , convince cheyyaali. cadre,mlas iche feedback ni serious gaa teesukovaali. vaallu cheppina vaatini ignore chesi motham governance meedha dhrushti pedithe problem avuthundhi. cadre ichina feedback serious gaa teesukokundaa  cbn ventane cadre ki counter vesthe next time evvadu feedback ivvadu.

Feedback rakunda emi undhu bro..100% CBN ki anni telusu..CM stayi person thliyadhu anukovadam brama that to CBN lanti eppudu politics meda interest une person ki..

Kani ayina dani meda consternation endhuku cheyyaledhu ante ayina evindanga thisukoni untado andhi main..may be ayina anukonna plan success kaledhu anthe..chustha chustha CM post vadulukodu kadha that to aa age lo kastapadi padayatra chesadu..

Link to comment
Share on other sites

6 minutes ago, King Of Masses said:

Andariki telisi lite tesukunaru anukutuna. Manam edho 1st phase lo patasaru ani anukunam but valu prepared ga vundi mana negative mlas ni maruchukovataniki chance ivale even i think CBN know the situation.. ledhu ante ala antha welfare schemes and a promises ivadu.. asalu mana manifesto anedhi okatti vundhi 60% ppl ki telavadhu..

Annay me DR :)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...