Jump to content

బాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేశారు


Recommended Posts

  •  ఏపీ ఫలితాలను ముందే చెప్పిన టీఆర్‌ఎస్‌
  •  వైసీపీదే విజయమన్న కేసీఆర్‌
  •  చంద్రబాబుకు ఓటమి తప్పదన్న కేటీఆర్‌
  •  ఎన్నికల వ్యూహరచన సహా జగన్‌కు అన్నిరకాల సాయం
హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను టీఆర్‌ఎస్‌ ముందు నుంచే ఊహిస్తూ వచ్చింది. అక్కడ టీడీపీ అధికారాన్ని కోల్పోతుందని, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. వాస్తవానికి 2014 సాధారణ ఎన్నికల సమయంలోనే ‘అక్కడ (ఏపీలో) జగన్‌, ఇక్కడ (తెలంగాణలో) టీఆర్‌ఎ్‌సది అధికారం’ అని ‘గులాబీ’ పార్టీ నేతలు చెప్పారు. కానీ, అక్కడ టీడీపీ గెలిచింది. నవ్యాంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలిచి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గడిచిన ఐదేళ్లలో కొన్ని సందర్భాల్లో మినహా టీఆర్‌ఎస్‌, టీడీపీ ఉప్పు నిప్పుగా ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు తెర తీసిన తర్వాత ఇరు పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒక దశలో తెలంగాణలో ‘కారు’తో పొత్తుకు ‘సైకిల్‌’ ముందుకొచ్చినప్పటికీ టీఆర్‌ఎస్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎ్‌సతో కలిపి ప్రజాఫ్రంట్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నచ్చలేదు. మరోవైపు చంద్రబాబు ప్రజాఫ్రంట్‌ తరఫున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి తెలంగాణలో పర్యటించారు. ఆ సమయంలోనే కేసీఆర్‌ టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్‌ఎ్‌సకి పట్టంకట్టారు. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరుతామని ప్రకటించారు. జాతీయ స్థాయిలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైసీపీని కలుపుకొని వెళ్తామని చెప్పారు. ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, జగన్‌ సీఎం అవుతారని సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివిధ సందర్భాల్లో చెప్పారు. ఈ ఎన్నికల ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేటీఆర్‌ స్వయంగా జగన్‌ వద్దకు వెళ్లి మంతనాలు సాగించారు.
 
అంతేకాక ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహ రచనలోనే కాకుండా, ఇతరత్రా అండదండలను టీఆర్‌ఎస్‌ అందించింది. ఏపీకి వెళ్లి వైసీపీ తరఫున గులాబీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ, తెర వెనుక చంద్రబాబు ఓటమికి, వైసీపీ గెలుపునకు చేయాల్సిన సాయం అంతా జగన్‌కు చేశారనే ప్రచారం టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే ఉంది. ‘గులాబీ’ నేతలు చెప్పినట్లుగానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మెజార్టీ లోక్‌సభ స్థానాలనూ ఆ పార్టీ గెల్చుకుంది. ఇదే చంద్రబాబుకు సీఎం కేసీఆర్‌ ఇస్తానన్న రిటర్న్‌ గిఫ్ట్‌ అని టీఆర్‌ఎ్‌సలోని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రె్‌సతో కలిసి ఎన్నో ఎత్తులు వేశారని, ఇప్పుడు ఆయనే ఓడిపోయారని వారు పేర్కొంటున్నారు.
Link to comment
Share on other sites

Idi enduk post chesa ante inka ayna bhajana batch "apara chanakya" cbn kanna ekkuva telsa"  ilanti panikimalina dialogues vadatam aputharani..   eppudaina mana paina okadu untadu mana kinda okadu untadu adi evvaraina kavochu

 

Accept the present.. retrospect . improve 

Link to comment
Share on other sites

18 minutes ago, koushik_k said:

modi unnadu kinda cbn unnadu. digest.

how can u say CBN is below KCR brother..based on some election result..? that's not retrospection..that's stupidity..retrospection is not about accepting that we are low and some one is high..no one is above u or below u..its just about assessing urself properly and give it a try..Dont compare TG with Ap politics and degrade CBN..KCR and Modi both have regional/religious connect in their holds and no leader to challenge them..AP is different where there is another strong leader and lot of equations to back him..what would have been the fate of KCR if Jagan was there in TG as opposition leader in last elections..?

Link to comment
Share on other sites

59 minutes ago, koushik_k said:

Idi enduk post chesa ante inka ayna bhajana batch "apara chanakya" cbn kanna ekkuva telsa"  ilanti panikimalina dialogues vadatam aputharani..   eppudaina mana paina okadu untadu mana kinda okadu untadu adi evvaraina kavochu

 

Accept the present.. retrospect . improve 

Modi ec help lekunda mana mukkayana peekindemiledu next pushpams target mukkode mundu adi choosikondi pitta poru pitta pour pilli teerchesthadi

Link to comment
Share on other sites

52 minutes ago, TDP_2019 said:

CBN ki return gift ichhe hadavudi lo Koothuru poindhi

Good elections for TRS ..

prajallo slight ga vyathirekatha vundi ..migatha party lu chelichinaa majority takkuva. Moreover they wont more than 50% votes..

KCR kanuka assembly elections ee time lo pettu te sure ga bjp wpuld have win 15+ congress would have been got 35+ seats..and there chances for loss...he predicted it much earlier thats the reason for gping early polls...

1month before parliament elections he expected this..thats the reason he was not that effective in promoting federal front...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...