Jump to content

Counting Time?


niceguy

Recommended Posts

EVMs start at 8:30

అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేసినట్టు  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోతాయన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు.

Link to comment
Share on other sites

8 ki service votes and postal ballets counting.....8:30 ki EVM counting starts....before 8:30 postal ballets complete avvaka poyinaa 8:30 ki evm counting start avtundi..bemmi.mandu.gif

Link to comment
Share on other sites

గురువారం ఉదయంవరకు వచ్చే  బ్యాలెట్‌ పత్రాలు పరిగణనలోకి
‘మొత్తం 3,05,040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,62,535 నాన్‌సర్వీస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 30,760 సర్వీసు ఓట్లు, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2,40,644 నాన్‌సర్వీస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 29,655 సర్వీస్‌ ఓట్లు ఇప్పటివరకు చేరాయి. గురువారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభానికి ముందువరకు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటాం’ అని ఎన్నికల ప్రధానాధికారి ్లగోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

Link to comment
Share on other sites

ఆడపడుచుల అండ ఎవరికో?

ఈ ఎన్నికల్లో మహిళలే గెలుపు నిర్ణేతలు
70 నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగం
6 స్థానాల్లో 6-17 వేల కంటే అధికం
26 చోట్ల వారి ఓట్ల ఆధిక్యం 4-6 వేలు
చంద్రన్నకు జైకొట్టారా
జగన్‌ను ఆశీర్వదించారా
సర్వత్రా ఉత్కంఠ
తేలేది నేడే

22ap-main8a_4.jpg

‘‘పసుపు కుంకుమ పథకం బాగా పనిచేసింది. ఈవీఎంలు పనిచేయకపోయినా ఆడవాళ్లు రెండోసారి వచ్చి మరీ ఓటేశారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు వేచి ఉండి మరీ ఓటేశారు.ఆ ఓట్లన్నీ తెదేపావే. మళ్లీ గెలుపు మాదే.

- ఎన్నికల అనంతరం సీఎం చంద్రబాబు వ్యాఖ్య

చంద్రబాబు అదృష్టవంతుడు. సరైన సమయంలో పసుపు కుంకుమ పథకం అమలు చేశారు. ఈ సారి అమ్మవార్లే (మహిళలు) చంద్రబాబును గట్టెక్కించబోతున్నారు.

- ఎన్నికల అనంతరం విలేకర్లతో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చలేదు. ఫలితంగా వాళ్లంతా లక్షల్లో వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించి నష్టపోయారు. పసుపు కుంకుమ కింద ఇచ్చింది అందులో సగం కూడా లేదు. అందుకే అక్కచెల్లెళ్లు బాబును ఓడించాలన్న కసితో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. ఆ ఓట్లన్నీ వైకాపా విజయానికి బాటలు వేస్తాయి.

- పోలింగ్‌ తర్వాత విలేకర్లతో జగన్మోహన్‌రెడ్డి
అనుకున్నట్లుగానే చంద్రబాబు ఊహలు..అంచనాలు నిజమవుతాయా? పసుపు కుంకుమ పథకం కింద సొమ్ములు అందుకున్న పొదుపు మహిళలు తెదేపాను గెలుపు వాకిట నిలబెడతారా? పువ్వుల్లో..కాదు..కాదు..పసుపు కుంకుమలో పెట్టి మరీ విజయాన్ని దోసిటపోస్తారన్న తెదేపా అధినేత ఆశలు నెరవేరుతాయా? జగన్‌ ఊహించినట్టు ఆ ఓట్లు వైకాపాను అందలమెక్కిస్తాయా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇది. మరికొన్ని గంటల్లో ఆడపడుచులు ఎవర్ని విజేతలను చేస్తారో? ఎవర్ని ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేస్తారో తేలిపోనుంది.

అక్కాచెల్లెళ్లపైనే చంద్రబాబు ఆశలు

చంద్రబాబు తొలినుంచి మహిళా పక్షపాతిగా పేరొందారు. తాను తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలను రూపకల్పన చేశారు. తద్వారా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు కృషి చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి అమలు చేశారు. సాధారణంగా సంస్కరణవాదిగా పేరొందిన చంద్రబాబు ఈ దఫా సంక్షేమంపై దృష్టిపెట్టారు. మొత్తంగా 107 పథకాలను అమలు చేశారు. ముఖ్యంగా ఆడవాళ్ల ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా ‘కోటిమంది మహిళలు-రూ.లక్ష కోట్ల ఆర్థికసాయం’ నినాదాన్ని అమలు చేశారు. పసుపు-కుంకుమ, వడ్డీలేని రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఉన్నతి రుణాలు, బ్యాంక్‌లతో అనుసంధానించడం వంటి మార్గాల్లో రూ.98 వేల కోట్ల ఆర్థికసాయం అందజేశారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 86 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పసుపు-కుంకుమ కింద మూడు విడతల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ ఎన్నికల ముందు ఈ పథకాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈసారి 97.80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున రూ.9,800 కోట్లు అందజేశారు. పండుగ వాతావరణంలో పసుపు-కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా పసుపు-కుంకుమ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2014కి ముందు నెలకు రూ.200 ఉన్న సామాజిక పింఛను మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచిన తెదేపా ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా దాన్ని రూ.2 వేలకు పెంచింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛను మొత్తాన్ని నెలకు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తద్వారా అటు మహిళలు, ఇటు వృద్ధుల అండ తనకే ఉంటుందన్న ధీమాతో చంద్రబాబు ఉన్నారు.

ముంచేదెవర్ని.. తేల్చేదెవర్ని

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో మహిళలు నిజంగానే ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితాల్లో నిర్ణయాత్మక శక్తిగా అవతరించారు. రాష్ట్రంలోని సింహభాగం నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం దానికి ఒక ఉదాహరణే. ఇచ్ఛాపురంలో పురుషుల కన్నా మహిళల ఓట్లు 17,893 అధికంగా పోలయ్యాయి. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీలు 2 వేల కంటే అధికంగా ఓటు వేశారు. పలాస, రంపచోడవరం, గన్నవరం, రాజంపేట, కడప నియోజకవర్గాల్లో మగవాళ్లతో పోలిస్తే మహిళా ఓట్ల ఆధిక్యం ఆరు వేల నుంచి దాదాపు 11 వేల వరకు ఉంది. 26 నియోజకవర్గాల్లో 4 నుంచి 6 వేలు, 19 నియోజకవర్గాల్లో 3-4 వేలు, మరో 19 నియోజకవర్గాల్లో 2 నుంచి 3 వేల వరకు వాళ్లే ఎక్కువగా ఓట్లేశారు. ఆ ఓట్లు మావేనంటే..మావేనంటూ ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. మరి అంతిమంగా ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ఆశలు ఫలిస్తాయి? న్యాయ నిర్ణేతలైన మహిళలు ఎవరికి అధికారం కట్టబెట్టబోతున్నారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

జగన్‌ ధీమా జగన్‌ది

ఇవే హామీలను నవరత్నాల పేరుతో జగన్‌ కూడా ఇచ్చారు. ‘వైఎస్సార్‌ చేయూత’ పేరుతో 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళకు దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని, ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ పేరుతో ఎన్నికల రోజు వరకు డ్వాక్రా సంఘాల పేరుతో ఉన్న రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామని, సున్నా శాతం వడ్డీకే రుణాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తామనీ మేనిఫెస్టోలో ప్రకటించారు. అయినా గత ఐదేళ్లలో ఎన్నికల సమయంలో చెప్పిన, చెప్పని హామీలు కూడా అమలు చేసిన తనకే వారి అండ ఉంటుందనే విశ్వాసంతో తెదేపా అధినేత ఉండగా..తమ హామీలనే మహిళలు నమ్మారనే ధీమాలో వైకాపా అధినేత ఉన్నారు.


22ap-main8b_1.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...