Jump to content

AP Election Results : LIVE


chellam

Recommended Posts

  • Replies 822
  • Created
  • Last Reply
పోలైన పోస్టల్‌ బ్యాలెట్లు 5,03,199

 అసెంబ్లీకి: 2,62,535
 లోక్‌సభకు: 2,40,664

ఈనాడు డిజిటల్‌- అమరావతి: రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభ... ఇటు లోక్‌సభకు మొత్తం 5,03,199 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. సర్వీసు ఓటర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా బుధవారం నాటికి ఓటుహక్కు వినియోగించుకున్న వారి వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు విడుదల చేశారు. అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నుకునేందుకు 2,62,535 మంది, లోక్‌సభ అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు 2,40,664 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 30,879, అత్యల్పంగా విజయనగరం జిల్లా నుంచి 12,870 మంది ఓటు వేశారు.

* ఈటీపీబీ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్స్‌) విధానం ద్వారా 30,760 మంది సర్వీసు ఓటర్లు అసెంబ్లీ అభ్యర్థులకు, 29,655 మంది లోక్‌సభ అభ్యర్థులకు ఓటేశారు. శాసనసభ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధికంగా 8,121, నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా 371 మంది సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

22ap-main9a_3.jpg

Link to comment
Share on other sites

నేర చరితులను అనుమతించం

ఏజెంట్లుగా వారిని అంగీకరించం
లెక్కింపులో పారదర్శకతకు చర్యలు
వీవీ ప్యాట్లతో సంబంధం లేకుండా చివరి రౌండ్‌ ఫలితం
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

22ap-main7a_6.jpg

నేరచరిత్ర ఉన్న వారిని పార్టీల తరఫున లెక్కింపు (కౌంటింగ్‌) కేంద్రాల్లో ఏజెంట్లుగా అనుమతించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. దీనిపై పలు పార్టీల తరఫున ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. ఏజెంట్లకు నేర చరిత్ర ఉన్నట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు చివరి నిమిషంలో గుర్తించినా వారిని అనుమతించేది లేదని వెల్లడించారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. 36 లెక్కింపు కేంద్రాల్లో 350 లెక్కింపు గదులను ఏర్పాటుచేశాం. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున పరిశీలకులు ఉంటారు. రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షణలో లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయిలో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేసేందుకు ప్రతి కేంద్రానికి ఇద్దరు భెల్‌ ఇంజనీర్లను అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు
‘ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభిస్తాం. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తాం. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తాం. న్యూసువిధ యాప్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రతి రౌండ్‌కు ఫలితాలు అందుబాటులో ఉంచుతాం. మధ్యాహ్నం 12గంటలకు పార్టీల గెలుపోటముల సరళి తెలుస్తుంది. మధ్యాహ్నం రెండింటికల్లా చాలావరకు ఫలితాలు తెలుస్తాయి. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో సంబంధం లేకుండా చివరి రౌండ్‌ ఫలితాన్ని వెల్లడిస్తాం. చివర్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఐదేసి చొప్పున వేర్వేరుగా వీవీప్యాట్లను లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకే వీవీప్యాట్లు ఎంపికైనా లెక్కిస్తాం. వీవీప్యాట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో ఆర్వో, పరిశీలకులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అర్ధరాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది’ అని ద్వివేది స్పష్టం చేశారు.

గురువారం ఉదయంవరకు వచ్చే  బ్యాలెట్‌ పత్రాలు పరిగణనలోకి
‘మొత్తం 3,05,040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,62,535 నాన్‌సర్వీస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 30,760 సర్వీసు ఓట్లు, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2,40,644 నాన్‌సర్వీస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 29,655 సర్వీస్‌ ఓట్లు ఇప్పటివరకు చేరాయి. గురువారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభానికి ముందువరకు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటాం’ అని ఎన్నికల ప్రధానాధికారి ్లగోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

అదనంగా మరో 10 కంపెనీల బలగాలు
‘కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. ఇప్పటికే 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకోగా తాజాగా మరో పది కంపెనీల బలగాలు రానున్నాయి. మొత్తంగా 25 వేల మంది భద్రతను పర్యవేక్షిస్తారు. ఓట్ల లెక్కింపునకు 25 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. సీనియర్‌ గెజిటెడ్‌ అధికారులనే కౌంటింగ్‌ విధులకు నియమించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం. వదంతులు నమ్మవద్దు’ అని ప్రజలకు ద్వివేది సూచించారు.

ఓట్ల లెక్కింపు విధుల నుంచి ముస్లిం ఉద్యోగులకు మినహాయింపు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: రంజాన్‌ మాసం ఉపవాసాల దృష్ట్యా గురువారం జరిగే ఓట్ల లెక్కింపు విధుల నుంచి ముస్లిం మైనారిటీ ఉద్యోగులకు మినహాయింపునిస్తూ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నియమించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా వేరొకరిని నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

ఫలితాలకు ప్రత్యేక యాప్‌లు

ఎన్నికల ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. న్యూ సువిధ, ఓటర్స్‌ హెల్ప్‌లైన్‌ పేరిట రూపొందించిన యాప్‌లతో పాటు http://results.eci.gov.in వెబ్‌సైట్‌ను కూడా చూడొచ్చని పేర్కొంది. గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి రౌండ్‌ ఫలితాల సరళి సహా తుది ఫలితాల వివరాలనూ వీటిలో అప్‌లోడ్‌ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఫాం-17సీ అనుమతిస్తాం

రాజకీయ పార్టీల ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పెన్ను, పెన్సిల్‌, తెల్ల కాగితాలు, ఫాం-17సీ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు గోపాలకృష్ణద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లదగ్గవాటిని నిర్ధరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఉపయోగపడేలా ఫాం-17సీని తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

తొలి ఫలితం నర్సాపురం!

చిట్టచివరన రాజమహేంద్రవరం గ్రామీణం, రంపచోడవరం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్‌ కేంద్రాలుండటంతో.. కేవలం 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుంది. అదే రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36-37 రౌండ్లు పట్టనుంది. ఈ క్రమంలో ఫలితాలు అన్నింటికంటే చివర్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో 12-13 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గం ఒకే ఒక్కటి ఉండగా, 36-37 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. 30 రౌండ్లు దాటి లెక్కింపు జరగాల్సిన నియోజకవర్గాలు 12 ఉన్నాయి. లెక్కింపు ప్రక్రియలో అవాంతరాలు లేకుండా సజావుగా సాగితేనే తొలి ఫలితం తొందరగా తేలుతుంది.

త్వరగా తేలే అవకాశమున్న నియోజకవర్గాలు
* 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వెలువడే నియోజకవర్గం: నర్సాపురం
* 13-14 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: ఆచంట, కొవ్వూరు (ఎస్సీ)
* 14-15 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వచ్చే నియోజకవర్గాలు: పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ
* 15-16 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు
* 16-17 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: గుంటూరు తూర్పు, నెల్లూరు గ్రామీణ, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం పశ్చిమ

ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నవి
* 36-37 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం
* 35 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గం: జగ్గంపేట
* 33రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గం: అమలాపురం
* 32 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం సిటీ, తుని
* 30-31 రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గాలు: పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...