Jump to content

chandrababu naidu expecting minimum 110 mla seats and 18 mp seats


Recommended Posts

‘నా సర్వేలో టీడీపీకి 110 సీట్లు..’

5/11/2019 12:37:23 AM

636931856485331095.jpg
  • ప్రతిక్షణం.. అప్రమత్తం.. ప్రతి ఓటూ కీలకమే
  • ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు, నేతలకు ఏమరుపాటు వద్దు
  • జిల్లాలో అన్ని సీట్లలో ఆధిక్యం మనదే
  • విజయం కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదు
  • టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి
  • పార్టీ ఎమ్మెల్యేలతో అమరావతిలో సమీక్ష
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,శ్రీకాకుళం): ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ చాలా కీలకం. అందుకే ఓట్ల లెక్కింపు సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా ఏమరపాటు వద్దు. టీడీపీ పోటీ దుర్మార్గపు పార్టీతో. అందుకే పార్టీ ఏజెంట్లు కౌంటింగ్‌ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో ఆయన శుక్రవారం జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన విధానం, ఓటింగ్‌ శాతంపై నేతలతో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, కష్టపడి పనిచేసిన వారందరికి గుర్తింపు ఇస్తామని వెల్లడించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ఇతర ముఖ్యనేతలందరితో విడివిడిగా మాట్లాడారు. జిల్లాలో పది స్థానాల్లో టీడీపీకి బాగా ఓట్లు పడ్డాయన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆదిక్యత రాబోతుందన్నారు. ఎన్నికలకు ముందు పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ బలంలో కొంత వెనుకబడినా ఆ తర్వాత చాలా బాగా పనిచేసి మంచి స్థానానికి తీసుకువచ్చారన్నారు. అనంతరం బూత్‌ల వారీగా పోలింగ్‌శాతంపై సమీక్షించారు. ఏయే బూత్‌లు పార్టీకి అండగా నిలబడ్డాయి? ఎక్కడ వ్యతిరేక ఓట్లు పడ్డాయి? ఇందుకు కారణాలు వంటి పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యర్థికి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయి? టీడీపీ ఆధిక్యత ఎంత? అనే దానిపై చర్చించారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తయింది. శ్రీకాకుళం నియోజకవర్గ సమీక్ష జరగలేదు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవీ తండ్రి మృతిచెందడంతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేతోపాటు ఇతర నేతలెవరూ రాలేదు. అటు విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో రాజాం, ఎచ్చెర్ల సమీక్ష కూడా శుక్రవారం రాత్రి జరిగింది. పాలకొండ నియోజకవర్గం అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్నందున ఆ సమీక్ష తర్వాత జరగనుంది.
 
కష్టపడిన వారందరికీ గుర్తింపునిస్తా..
ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికి గుర్తింపునిస్తా. పదవుల విషయంలో పైరవీలకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్నానని, ఎన్నికల్లో ఓట్లు తెచ్చిన వారి సమాచారం తన వద్ద ఉందని... వారందరిని గౌరవిస్తానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు గెలుస్తామని నేతలు చెబుతున్నారని... బూత్‌ల వారీగా ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయనే దానికి కాగితాలపై లెక్కలు ఉండాలని, అప్పుడే పక్కాగా ఉంటుందన్నారు. ఏరియా కో ఆర్డినేటర్లంతా ఈ సమాచారం తయారుచేయాలని ఆదేశించారు. పార్టీలో ఎవరైనా ఎదగాలంటే కష్టపడి నిరూపించుకోవాలన్నారు. కష్టపడిన వారికి ఈసారి పదవులు కట్టబెడతామని స్పష్టం చేశారు. తమ సర్వేలో పార్టీ అధికారంలోకి తిరిగి వస్తుందని.. 110 సీట్లు ఖాయమని చంద్రబాబు విశ్లేషించారు. జిల్లాలో అన్ని స్థానాల్లో మంచి ఆధిక్యత వస్తోందని, అంతా బాగా పనిచేశారని కొనియాడారు. పాతపట్నం స్థానంలో మంచి పనితీరు కనబర్చారని, ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు రోజు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు వస్తాయన్నారు. టీడీపీ పోటీ ఓ దుర్మార్గ పార్టీతో అనే విషయం ఏజెంట్లు, నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యత, మరికొన్నిచోట్ల స్వల్ప ఆధిక్యతలు ఉండబోతున్నాయని సమీక్షలో నేతలకు సీఎం చంద్రబాబు వివరించారు.
 
ఆధిక్యతల్లో ఈ విధంగా హెచ్చుతగ్గులు ఉండరాదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యం స్థిరంగా ఉండాలని... అప్పుడే పార్టీ తరఫున మంచి పనితీరు కనబర్చినట్లవుతుందన్నారు. తక్కువ ఆధిక్యత ఉన్న నేతలు దాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. పార్టీలో ఏ స్ధాయి నాయకుడైనా వ్యవస్థకు బద్ధుడై ఉండాలని.. తనతో సహా ఎవరూ పార్టీకి అతీతం కాదని గుర్తుచేశారు. ప్రతి నాయకుడూ పార్టీలో సేవామిత్రగానే భావించాలని పేర్కొన్నారు. పార్టీ కోసం, రాష్ట్రం కోసం తాను రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం రాష్ట్రాన్ని, పార్టీని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాను పార్టీలో పనిచేసే వాళ్లపట్ల సరళంగా ఉంటానని, పనిచేయని వాళ్లపై కఠినంగా ఉంటానని హెచ్చరించారు. జిల్లాలో చాలాచోట్ల మహిళల ఓట్లు ఎక్కువ పోలవడం శుభ పరిణామమని... పురుషుల ఓట్లు కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో వలసల వల్ల ఓట్ల శాతం ఎంత తగ్గిందనేది విశ్లేషించాలని ఆదేశించారు. బూత్‌ స్థాయిలో పార్టీకి పడిన ఓట్లు కాగితాలపై నేతలంతా పెట్టాలని సూచించారు. సమావేశానికి ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు మంత్రులు కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు, విప్‌ కూన రవికుమార్‌, ఎమ్మెల్యేలు బగ్గు, కలమట, శివాజీ, అశోక్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
 
మెజార్టీ ఎందుకు తగ్గింది?
పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిందెవరు? వెన్నుపోటు పొడించిందెవరో చెప్పాలని సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే కలమటను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో 315 బూత్‌లకు సంబంధించి ఏరియా కోఆర్డినేటర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఏ బూత్‌లో ఎంత మెజారిటీ వస్తుంది? ఎక్కడ తక్కువ వస్తుందో లెక్క చెప్పారు. కొన్ని బూత్‌లలో టీడీపీకి ఎందుకు తక్కువ ఓట్లు పడ్డాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో ధన ప్రభావంతో పాటు వైసీపీ ఎక్కడైనా రౌడీయిజానికి పాల్పడిందా? అని అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా పాతపట్నంలో టీడీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.
 
పలాస గెలుపుపై ముఖ్యమంత్రి ధీమా
పలాస నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఓటింగ్‌ ఏ విధంగా జరిగింది? ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గెలిచే నియోజకవర్గాలలో పలాస ఉందని సీఎం ప్రకటించడంతో కార్యకర్తలంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏరియా కోఆర్డినేటర్లు సక్రమంగా పని చేయాలని, ప్రజల కోసం పాటుపడితే వారి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని సీఎం ఉద్బోధించారు. అనంతరం కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలు తీయించుకున్నారు.
Link to comment
Share on other sites

8 వేల మెజార్టీతో గెలుస్తానని ఆయన అనగానే.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్

5/11/2019 4:52:38 PM

636931904243420405.jpg
సమర్థులు, నమ్మకస్తులనే ఏజెంట్లుగా నియమించండి
ఏ మాత్రం ఏమరుపాటు వద్దు
కౌంటింగ్‌లో ప్రతి క్షణం అప్రమత్తం
టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతిలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు.. నాయకులు హాజరు
 
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటివరకూ ఒక ఎత్తు...కౌంటింగ్‌ మరో ఎత్తు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం అమరావతిలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షను నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజుతో పాటు విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు అతిది గజపతి, పతివాడ నారాయణస్వామినాయుడు, డాక్టర్‌ కేఏ నాయుడు, కిమిడి నాగార్జున, కోండ్రు మురళీమోహన్‌, కిమిడి కళా వెంకటరావు హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందుతామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. బూత్‌ల వారీగా మెజార్టీ, గెలుపునకు ఉన్న అవకాశాలు, వైసీపీ మైండ్‌గేమ్‌ను అభ్యర్థులు ప్రస్తావించారు. ఐదు వేల పైబడి మెజార్టీతో విజయం సాధిస్తామని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
 
 
మూడు దశల్లో...
నియోజకవర్గాల వారీగా మూడు దశల్లో సమీక్షలు నిర్వహించారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో నేతలతో సమీక్షించారు. తరువాత దశలో మహిళా నేత పంచుమర్తి అనురాధ అభ్యర్థులు, నేతలతో మాట్లాడి వివరాలు సేకరించారు. చివరిగా ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు. దాదాపు ఇలా సమీక్షలన్నీ అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది ఎవరు? పార్టీలోనే ఉంటూ దొంగదెబ్బ తీసింది ఎవరు? అన్నదానిపై చంద్రబాబు ఆరాతీశారు. దీనిపై సమగ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈవీఎంల మొరాయింపుతో ఎదురైన ఇబ్బందులను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి కిమిడి నాగార్జున మాట్లాడుతూ తాను గెలుపొందుతానని సీఎం చంద్రబాబుతో చెప్పారు. తన వద్ద ఉన్న సర్వేలో కూడా నాగార్జున గెలుపొందుతారని తేలిందని చంద్రబాబు బదులిచ్చినట్టు సమాచారం.
 
 
అప్రమత్తంగా ఉండండి
ఈ సందర్భంగా ఈ నెల 23న కౌంటింగ్‌ నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ రోజున సమర్ధులైన, నమ్మకస్తులను ఏజెంట్లుగా నియమించాలని అభ్యర్థులకు ఆదేశించారు. లేకుంటే ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. గతంలో జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియకు..ఈసారి కౌంటింగ్‌కు చాలా వ్యత్యాసం ఉందని..ఏమాత్రం ఏమరపాటు వద్దన్నారు. ఈవీఎం కౌంటింగ్‌కు...వీవీప్యాట్‌ల కౌంటింగ్‌కు ఏమైనా తేడాలున్నట్లయితే అభ్యంతరం చెప్పి రీ కౌంటింగ్‌కు డిమాండ్‌ చేయాలని సూచించారు. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ విషయంలో అనేక సందేహాలున్న తరుణంలో... వీవీప్యాట్‌లలోని ప్రింటింగ్‌ బ్యాలెట్ల లెక్కింపు కీలకమని చంద్రబాబు అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.
 
గెలుపుపై అభ్యర్థుల ధీమా
గజపతినగరం నియోజకవర్గంలో ఏరియా కో ఆర్డినేటర్లు ఇచ్చిన ఓటింగ్‌ సరళిపై చర్చ సాగింది. 8 వేల ఓట్లు పైబడి మెజార్టీతో గెలుపొందుతానని ఎమ్మెల్యే కేఏ నాయుడు నమ్మకంగా చెప్పారు. దీని పై ముఖ్యమంత్రి స్పందిస్తూ 2014 ఎన్నికల్లో 18,500 ఓట్లు మెజార్టీతో గెలుపొంది... ఇప్పుడు తగ్గడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా పెరగాలి కదా అని వ్యా ఖ్యానించినట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల నియోజవర్గంపై సమీక్ష జరుగగా...తప్పకుండా గెలుపొందుతానని ఎమ్మెల్యే పతివాడ నారాయ ణస్వామినాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్య మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. 110 నుంచి 120 సీట్లు మనకు రాబోతున్నాయన్నారు.. బొబ్బిలి నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు ధీమా వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

If CBN ask to our DB members about results ..........

@Raaz@NBK --130 taggav sir.. lock chesukondi...

@NatuGadu - 120 fix..

@Gunner - 110 antha kanna tagge samsye ledhu ..

@RKumar -Ante Sir TDP vallatho matladithe maname Win anipisthundhi...ysrcp vallatho matladithe valle win anipisthundhi so..na count win aythe above 88 . pothe below 88 .

finally @rama123 --Kastam sir .....Naku unna survey lo meeru kuda gelavatam kastam .. talk alaga undhi sir bayata . ground reality meeku me party supporters thliyatam ledhu .

Just for fun guys..dont mind :) .

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

Rkumar oka roju Full wave seats kummesthai antaaru.. inko roju abbee Ila ayithe kastam power Loki ravadam ani antaru..

Ram123 ayithe TDP below 80 figure ee cheptharu..

yes.. after elections DB post lu batte naku anipincdhi ...ee Rkumar bro CBN kanna ekkuva confuse chesthunnadu :) .

Link to comment
Share on other sites

58 minutes ago, Raaz@NBK said:

Ayana confuse ayyi pakkana vundevalani kuda confuse chesthunnadu..

CBN Count 150+ (Before Apr-11th) ..............  110+ (After Apr-13th) ............ ??? (After May-19th) ............... ??/??? (May-23rd)

Telugu GIF - Telugu GIFs

 

Telugu GIF - Telugu GIFs

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Eswar09 said:

If CBN ask to our DB members about results ..........

@Raaz@NBK --130 taggav sir.. lock chesukondi...

@NatuGadu - 120 fix..

@Gunner - 110 antha kanna tagge samsye ledhu ..

@RKumar -Ante Sir TDP vallatho matladithe maname Win anipisthundhi...ysrcp vallatho matladithe valle win anipisthundhi so..na count win aythe above 88 . pothe below 88 .

finally @rama123 --Kastam sir .....Naku unna survey lo meeru kuda gelavatam kastam .. talk alaga undhi sir bayata . ground reality meeku me party supporters thliyatam ledhu .

Just for fun guys..dont mind :) .

Brahmi GIF - Brahmi GIFs

Link to comment
Share on other sites

9 minutes ago, RKumar said:

CBN Count 150+ (Before Apr-11th) ..............  110+ (After Apr-13th) ............ ??? (After May-19th) ............... ??/??? (May-23rd)

Telugu GIF - Telugu GIFs

 

Telugu GIF - Telugu GIFs

 

 

Target 150

Party Survey 130+ (Not SV Univ survey)

Another nuetral survey 110+ 

So numbers between 110-135

Link to comment
Share on other sites

9 minutes ago, RKumar said:

CBN Count 150+ (Before Apr-11th) ..............  110+ (After Apr-13th) ............ ??? (After May-19th) ............... ??/??? (May-23rd)

Telugu GIF - Telugu GIFs

 

Telugu GIF - Telugu GIFs

 

 

Annay frankly CBN eppudu direct ga oka figure cheppala...win pakka ani tappa...... paper lo ne raka rakalu ga vesthunnaru 

Link to comment
Share on other sites

Chee xxxxx jivitham. Leader 110 anna kuda satisfaction ledu manollaki. 150 annadu, ante 150 vacheyala ? Prati daniki oka target anedi pettukunte andulo 80% aina reach avtamu. CBN kuda ade chesadu. Actual ga manam chesina works ki 140 ki taggakundane ravali. But mana candidtaes g.balupu valla 110+ ki vachamu ani CBN cheptunnaru. 110 ante matalu kadu kada. Without Pk anedi gurtunchukovali. 

Link to comment
Share on other sites

28 minutes ago, rama123 said:

Below 80 ani nenub eppudu cheppedi

My stand is clear 20 minus from ua to Krishna and stand by that

Any one has different opinion post here for record

 

Ua, godavari, krishna districts 2014 - 60/84.

2019 - 52/84.

Lock chesko brother 🤙

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...