Jump to content

కత్తిపోట్లకు గురైనా పరుగెత్తుకుంటూ బస్సెక్కిన యువకుడు..


Recommended Posts

కత్తిపోట్లకు గురైనా పరుగెత్తుకుంటూ బస్సెక్కిన యువకుడు..

5/10/2019 1:36:05 PM

636930922359164116.jpg
 
 
యువకుడిపై హత్యాయత్నం.. కత్తులతో దాడి
ఆర్టీసీ బస్సెక్కి తప్పించుకున్న బాధితుడు
పాత కక్షలే కారణంగా భావిస్తున్న పోలీసులు
 
 
తిరుపతి: ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడిచేసి, హత్యాయత్నానికి పాల్ప డ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి తిరుపతి రూరల్‌ మండలంలో జరిగింది. ఎంఆర్‌పల్లె సీఐ మన్సూరుద్దీన్‌ కథనం మేరకు.. తిరుచా నూరు యోగిమల్లవరానికి చెందిన మదన్‌కుమార్‌ (27) ద్విచక్ర వాహనంపై తిరుపతి రూరల్‌ మండలం రామానుజపల్లె చెక్‌పోస్టు వద్దకొచ్చి ఆగాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టారు. కత్తులతో దాడిచేసి విచక్షణా రహితంగా పొడిచారు. కత్తిపోట్లకు గురైనా.. తమాయించుకున్న బాధితుడు అటుగా వస్తుండిన ఆర్టీసీ బస్సెక్కేశాడు.
 
అయినా దుండగులు బస్సును వెంబడించారు. గమనించిన బస్‌డ్రైవర్‌ వేగంగా వాహనాన్ని నడపడంతో మదన్‌ తప్పించుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంఆర్‌పల్లె రక్షక్‌ పోలీసులొచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. మదన్‌ శరీరంపై మొత్తం తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇదివరకు కార్వేటినగరంలో జరిగిన జంట హత్యలతో మదన్‌కు ప్రమేయం ఉన్నట్లు.. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు సమాచారం. సీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

4 hours ago, Jaitra said:

Never really understood what that phrase means

Oka chetha pani chesina vadu dani related impact ayina vallu inka manalni emi cheyaleru anentha varaku aagi, Assalu expect cheyani time lo Revenge teerchukodam.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...