Jump to content

ఏపీలో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు: బీజేపీ ప్రధాన కార్యదర్శి


Recommended Posts

ఏపీలో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు: బీజేపీ ప్రధాన కార్యదర్శి
08-05-2019 02:56:44
 
636929199621899814.jpg
 
  • కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే
  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షుడు
  • టీడీపీ గెలిచినా ఆశ్చర్యంలేదు.. మా లెక్కలో వైసీపీకి 110 సీట్లు
  • తెలుగు మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేపీ నేత మురళీధర్‌రావు
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ 6 ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్‌రావు అన్నారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌తోపాటు మరో రెండు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప ఎన్నికల కార్యదక్షుడు అని బీజేపీ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు వైసీపీకి 110 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉండవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గత నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ 280 నుంచి 310 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. యూపీలో గత ఎన్నికల్లో 72 స్థానాలు గెలుచుకున్న తాము.. ఈసారి 35 నుంచి 40 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని నెల రోజుల క్రితం భావించామని, కానీ ఇప్పుడు 70కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
 
దేశవ్యాప్తంగా తమ మిత్రపక్షాలకు 45 నుంచి 50 స్థానాలు లభిస్తాయని, నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తోందని, కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలకు 150కి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ గెలిచిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి 2014 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు వస్తాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మోదీ పట్ల అంతగా వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. పార్టీకి మించి మోదీ ఎదిగిపోయారని, దాని వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని, అందుకు మోదీని మించిన నాయకుడు దేశంలోనే లేరని చెప్పారు. బాలాకోట్‌పై వైమానిక దాడులతో మోదీ ధైర్య సాహసాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు.
Link to comment
Share on other sites

Veellaki votes thakkuva......noise ekkuva.

veedu cheppedhendhi.....ayithe TDP or YCP gelusthundhi.....marala statement lo kooda balance maintain cheyyatam edaitho vundho....andhuke veellani baffas antaaru.

Link to comment
Share on other sites

2014 lo gelichina 3 MP seats Andhra votes musti veellaku own geliche seen ledu KCR daya talichi light ga teesukunte thappa, 15 MPs nunchi MPs count 10 ki tagginchukovadaaniki KCR emanna pichhoda.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...