Jump to content

కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్ ...


Recommended Posts

కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్ 
07-05-2019 13:20:44
 
636928321740411324.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో 23కుటుంబాలు ఏడుస్తున్నాయని.. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తానేం మందా కృష్ణమాదిగను కానని..2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని పాల్ చెప్పుకొచ్చారు. మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
 
కేటీఆర్, కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు!
" కేటీఆర్‌కు పచ్చి పట్టింది. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కేటీఆర్‌కు డబ్బు, అహంకారం ఎక్కువైంది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్‌ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే నాశనం‌ అయిపోతారు.. గొడవలొద్దు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో నాతో కలసిరావాలి. అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్‌ను హైదరాబాద్ తీసుకొస్తాను. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్‌లో చేరుతున్నారు" అని కేఏపాల్ చెప్పుకొచ్చారు. అయితే పాల్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

3 hours ago, KING007 said:
కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్ 
07-05-2019 13:20:4
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. 

:super:

Link to comment
Share on other sites

You are only free when you can speak your mind.

KA PAUL is 10x better than all these So-Called Politicians

KA PAUL is 100x better than all the So-Called Tollywood Stars from Andhra
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...