Jump to content

క్లీన్‌చిట్ ఇచ్చిన త్రిసభ్య కమిటీ


Recommended Posts

 

  •  
రంజన్ గోగోయ్‌కి క్లీన్‌చిట్ ఇచ్చిన త్రిసభ్య కమిటీ
06-05-2019 19:51:47
 
636927691139508696.jpg
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్‌పై సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైగింక వేధింపుల ఆరోపణల విషయంలో ఆయనకు క్లీన్‌చిట్ లభించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయాన్ని సోమవారం వెలువరించింది. రంజన్ గోగోయ్‌పై మహిళ చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ ఎస్ఏ బోబ్డె తెలిపారు. గతేడాది అక్టోబర్ 10,11 తేదీల్లో జస్టిస్ రంజన్ గోగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టులో పని చేస్తున్న 22 మంది న్యాయమూర్తులకు ఓ మహిళ ఏప్రిల్‌లో లేఖ రాశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. కాగా.. ఈ ఆరోపణల విషయంలో విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ రంజన్ గోగోయ్‌పై మహిళ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే త్రిసభ్య కమిటీ వెలువరించిన ఈ నిర్ణయంపై సదరు ఫిర్యాదుదారు స్పందించారు. ఈ తీర్పు తనను వేదనకు గురిచేసిందని, తనకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు.
 
తన ఆశలన్నీ శిథిలమైపోయాయని, తీర్పు విషయంలో తన భయాలన్నీ నిజమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సగటు భారతీయ పౌరురాలుగా తనకు అన్యాయం జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం అనంతరం తనకు భయంగా, ఆందోళనగా ఉందని, ఆధారాలను సమర్పించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...