Jump to content

Donakonda - YCP


RKumar

Recommended Posts

దొనకొండ వైపు వైసీపీ నేతల చూపు 

5/6/2019 4:08:16 AM

636927384489610646.jpg
  • ధిక సంఖ్యలో రాకపోకలు
  • భూముల కొనుగోలుకు బేరసారాలు
  • స్వల్పంగా పెరిగిన ధరలు
 
ఒంగోలు, మే 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని వైసీపీ నాయకులు జిల్లాలో దొనకొండ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ భూముల కొనుగోళ్లుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇటీవల వైసీపీ నాయకులు, వారి తరఫున రియల్‌ ఎస్టేట్‌ దళారుల తాకిడి పెరిగింది. ఇప్పటికే బేరసారాలు ప్రారంభయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా భూములను పరిశీలించి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలలోనూ స్పల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం కలిగిన వారే ఆవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 
2014 సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికారాన్ని చేపడితే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి వైసీపీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో రాజధాని ఏర్పాటు పక్రియ ప్రారంభించింది.
 
అయితే దీన్ని జగన్‌ వ్యతిరేకించారు. పైగా ఇటీవల ముగిసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరావతి విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. దీంతో జగన్‌ అధికారంలోకి వస్తే రాజధాని ఏర్పాటు విషయంలో మార్పులు చోటు చేసుకోవచ్చన్న అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొనకొండ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాల్లో క్రమేపీ వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా వైసీపీ నాయకులే ఎక్కువగా ఆప్రాంతానికి వచ్చి భూముల కొనుగోలుకు శ్రీకారం పలుకుతున్నారు. జిల్లాలోని ఓ వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త ఇటీవల ఒంగోలులో తనకున్న ఒక విలువైన స్థలాన్ని విక్రయించారు. ఆయన కూడా ఆ డబ్బులను వెచ్చించి దొనకొండ సమీపంలో భూముల కొనుగోలుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఒక మిత్రుడితో ఆయన వైసీపీ గెలుపు ఖాయమని, దొనకొండ ప్రాంత అభివృద్ధికి జగన్‌ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది
 
. ఒంగోలులో స్థలాలకు ధరలు పెరగడం లేదని, అక్కడ పెరుగుదల వేగంగా ఉండవచ్చన ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే దొనకొండ నుంచి పొదిలి వెళ్లే రోడ్డులో దొండపాడు వద్ద 85 ఎకరాల పొలం కొనుగోలు చేసేందుకు వారం క్రితం బేరసారాలు జరిగాయి. ఎకరం రూ. 14 లక్షల ప్రకారం కొనుగోలుకు తాత్కాలికంగా బేరం కుదిరిందని అంటున్నారు. ఈ భూమి కొనుగోలుకు వచ్చిన వారు విజయవాడ ప్రాంతవాసులు అని చెప్తున్నారు. బేరాసారాల సందర్భంలో వారు ప్రముఖ వైసీపీ నేత కోసమేనని చెప్పడం విశేషం. హైదరాబాదుకు చెందిన వారు ఇటీవల అక్కడకు వచ్చి భూములను పరిశీలించారు.
 
దొనకొండ నుంచి మార్కాపురం వెళ్లే రోడ్డులో వినుకొండ బైపాస్‌కు సమీపంలో 50 నుంచి 100 ఎకరాల పొలం కావాలని వారు రెండు రోజులు తిరిగారు. ఇక దొనకొండ విమానాశ్రయం చుట్టుపక్కల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇటీవల అక్కడ ప్లాట్లు వేసి విక్రయాలు కూడా ప్రారంభించారు. విమానాశ్రయానికి సమీపంలో గతంలో ఎకరా రూ. 30 లక్షలు ఉండగా ప్రస్తుతం హడావుడి పెరగడంతో రూ. 40 లక్షలు పలుకుతుంది. ఇక చుట్టుపక్కల గతంలో ఎకరా ధర రూ. 8 నుంచి రూ. 10 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ. 14 లక్షలకు చేరింది. అమావాస్య వలన రెండు రోజుల నుంచి బేరసారాలు తగ్గగా సోమవారం నుంచి మరికొందరు కొనుగోలుదారులు వస్తామని సమాచారం పంపినట్లు ఆప్రాంత దళారులు చెప్తున్నాడు.
 
ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ పారిశ్రామిక కారిడార్‌కు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. భూముల సేకరణ జరిగింది. కొన్ని పరిశ్రమలు ఏర్పాటుకు సంస్థలు ముందుకు వచ్చినట్లుగా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే కారిడార్‌ ఏర్పాటులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని వైసీపీ నాయకులు ఎన్నికల సందర్భంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం వైసీపీ గెలుపు ఖాయమన్న ఆశతో భూముల కొనుగోలుకు రావడం ఆప్రాంత ప్రజల్లో చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

Just now, Ntrforever said:

 apart from who is going to win or lose. Can we invest in that area for plots for gajam 1700 Rs near to donakonda

akkada gajam lekka kaadu uncle...Gadhula lekka ante 72sqft... mamulu gaa aithe akkada thondalu kudaa gudlu pettav.....

Link to comment
Share on other sites

19 minutes ago, uma said:

akkada gajam lekka kaadu uncle...Gadhula lekka ante 72sqft... mamulu gaa aithe akkada thondalu kudaa gudlu pettav.....

neee :rofl2:

Link to comment
Share on other sites

Vellu inka maaraleda !! Last elections lo already debba tinnaru !!

 

maa ongole lo iythey peaks lo rates penchi koorchunnaru last time elections ke .. 

 

eesare elections results lopu em chesi chasthaaro

Link to comment
Share on other sites

5 minutes ago, Kedism said:

Vellu inka maaraleda !! Last elections lo already debba tinnaru !!

 

maa ongole lo iythey peaks lo rates penchi koorchunnaru last time elections ke .. 

 

eesare elections results lopu em chesi chasthaaro

My relatives lost huge amount ..in 2014.

 

 

Link to comment
Share on other sites

7 minutes ago, Kedism said:

Vellu inka maaraleda !! Last elections lo already debba tinnaru !!

 

maa ongole lo iythey peaks lo rates penchi koorchunnaru last time elections ke .. 

 

eesare elections results lopu em chesi chasthaaro

Donakonda lo Enni ekaralu konnav ?

Link to comment
Share on other sites

17 minutes ago, ravindras said:

@uma  ongole prices already peak lo vunnaayi kadhaa . 2014 election mundhu ongole lo capital pedathaarani akkada real estate baagaaa perigipoyindhani  friend cheppaadu.

em peaks le uncle...appudu unna rate le ippudu unnayi........maa jalaganna cheeyyam aithe emanna perugutaayemo sudaali..

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

Donakonda lo Enni ekaralu konnav ?

wrong question...donkakonda samsthanam saamantha raaju ni pattukoni entaa pichi pesnaa...

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Shh as question mimalni adagaboyi porapaatuna Rajeev ni adiga.. tappaipoyindhi..

attaa seppu....malli wrong question to me....enni konnav kaadu enni ammav ani adugunannu....konevaadu leka freee gaa vadilesaaa....

Link to comment
Share on other sites

Just now, uma said:

attaa seppu....malli wrong question to me....enni konnav kaadu enni ammav ani adugunannu....konevaadu leka freee gaa vadilesaaa....

Evado bayata nundi vachi teleka edho capital hype lo konnaru ante ok...

 

Same district nundi vachi donakonda lo konnav ante  .... U need a gajamala annai

Link to comment
Share on other sites

1 minute ago, Venu_NTR said:

Evado bayata nundi vachi teleka edho capital hype lo konnaru ante ok...

 

Same district nundi vachi donakonda lo konnav ante  .... U need a gajamala annai

yow venu uncle....nenu konala ammalaa...antha money ye unte B'lore lo inko flat koni rent ki ichukunvaadini...poyi poyi aa kondallo raallu enduku kontaanu...

Link to comment
Share on other sites

5 minutes ago, chanti149 said:

Ee dialogue endi andaru using..? Nijamga pettava enti....??😂

pettav uncle...anni kondalu ....pedda pedda raallu....very high temparature....no water facility....bore veyyaalanna oka 5 times try chesthe thousands feet lo...luck unte paduddi....ledante need to wait for rains...

Link to comment
Share on other sites

27 minutes ago, uma said:

yow venu uncle....nenu konala ammalaa...antha money ye unte B'lore lo inko flat koni rent ki ichukunvaadini...poyi poyi aa kondallo raallu enduku kontaanu...

Inko flat ante, already enni unnayi yendi..??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...