Jump to content

CBN Request to TG Students

vinayak

Recommended Posts

Nara Chandrababu Naidu

7 hrs · 

పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి.

మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే బహుమతి.

Link to comment
Share on other sites

ప్రజాసమస్యలపై ఎంపిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాం. అటు వడగాడ్పులు, ఇటు అకాల వర్షాలతో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పండ్ల తోటలకు, ఉద్యాన పంటలకు, కూరగాయల తోటలకు వాటిల్లిన నష్టంపై చర్చించాం. ఎన్నికలు అయిపోయాయని అనుకోకుండా ఈ 40 రోజులు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో తిరగాలి, అకాల వర్షాల బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాం. జరిగిన నష్టం తీవ్రత గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, అవసరాన్ని బట్టి ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే తాగునీటి ఎద్దడి, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు అయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించాం.

Link to comment
Share on other sites

7 minutes ago, vinayak said:

Bro, oka chinna doubt, jagan ki BP vunda?

Link to comment
Share on other sites

CBN showed immense maturity (smartness) here by not dragging kcr name here... 

Mata madyalo kcr anna oka Padam vasthe chalu...

Ma pillalni mem sampukumtam.. mekendhira bay ... Jai TG... Jai kcr... Antaru sheep's...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...