Jump to content

Desh Drohi Party - BJP?

RKumar

Recommended Posts

‘నా శాపం వల్లే ఆయన మరణించారు’

హేమంత్‌ కర్కరేపై సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

sadhvi1.jpg

భోపాల్‌: ఇటీవలే భాజపాలో చేరి భోపాల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని వ్యాఖ్యానించారు. ముంబయి యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ 26/11 దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్‌చక్ర అవార్డు లభించింది. ‘‘నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు’’ అని ప్రజ్ఞా ఠాకూర్‌ అన్నారు. ఎన్నికల వేళ విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రజ్ఞా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. 2016లో ఆమెకు ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే భాజపాలో చేరిన ఆమె ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న భోపాల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా.. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ మాలేగావ్‌ పేలుళ్లలో కుమారుడిని కోల్పోయిన నిస్సార్‌ సయీద్‌ గురువారం ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయమూర్తి ఎన్‌ఐఏ, ప్రజ్ఞాసింగ్‌లిద్దరినీ సమాధానాలు సమర్పించాల్సిందిగా కోరుతూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

‘రాహుల్‌ వ్యాఖ్యలపై బ్రిటన్‌ కోర్టుకు వెళతా’

lalit1.jpg

దిల్లీ: ‘దొంగలందరి పేరులో మోదీ ఎందుకు ఉంది’ అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్‌ చేసిన విమర్శలు మోదీ అనే ఇంటి పేరు కలిగిన లక్షల మందినీ అగౌరవపరిచేలా ఉందంటూ బిహార్‌ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్‌కుమార్‌ మోదీ గురువారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్‌ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న లలిత్‌ మోదీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్రిటన్‌ కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

‘‘ మోదీలంతా దొంగలే అని రాహుల్‌ అన్నారు. ఈ విషయంపై ఆయన్ని బ్రిటన్‌ కోర్టుకు లాగుతా. ఐదు దశాబ్దాల పాలనా కాలంలో భారతదేశాన్ని దోచుకున్నది గాంధీ-నెహ్రూ కుటుంబమేనన్నది జగమెరిగిన సత్యం’’ అని ట్వటర్‌లో లలిత్‌ మోదీ రాసుకొచ్చారు. ఆయన ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్యాగ్‌  చేయడం గమనార్హం. 

ఇటీవల ఓ సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. ‘దొంగలందరి  పేరులో మోదీ ఎందుకు ఉంది?’ అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఉన్న నీరవ్‌ మోదీ, ఐపీఎల్‌ వ్యవహారంలో నిందితుడు లలిత్‌ మోదీ, రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాన మోదీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని సుశీల్‌కుమార్‌ మోదీ కోర్టుకు వెళ్లారు. ఈ అంశం ఏప్రిల్‌ 22న విచారణకు రానుంది. మరోవైపు ప్రధాని మోదీకి కూడా ఆయన వ్యాఖ్యాల్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇలాంటి భాష మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో దేశంలోని వెనకబడిన వర్గాలన్నింటినీ అవమానించారని ఆరోపించారు.

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Mundhu nuvvu India dobbinchukora ayya,kuyya.

Link to comment
Share on other sites

ఎవరిని నమ్మాలి.. మోదీనా.. బ్యాంకులనా?

విజయ్‌ మాల్యా 

18brk-mallya.jpg

దిల్లీ: తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విజయ్‌ మాల్యా తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఏకంగా ప్రధాని మోదీపైనే ఆరోపణలు చేశారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారా లేదా బ్యాంకులు చెబుతున్నాయా అర్థం కావడం లేదని విమర్శించారు.

‘బ్యాంకులకు నేను(మాల్యా) చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కొన్ని బ్యాంకులు ఇంగ్లీష్‌ కోర్టుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పాయి. ఎవరిని నమ్మాలి? అయితే మోదీ లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలి’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. 

ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి లండన్‌లో ఉంటున్నారు. అతడిని భారత్‌కు అప్పగించే విషయమై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. రుణాలు చెల్లించే విషయంలో సెటిల్‌మెంట్‌కు రావాలని మాల్యా బ్యాంకులను కోరారు. అయితే ఇందుకు బ్యాంకులు ఒప్పుకోకపోవడంతో విమర్శలు చేస్తూ వస్తున్నారు. 

మరోవైపు లండన్‌లో ఉన్నా భారత్‌లో జరిగే విషయాలపై మాల్యా స్పందిస్తున్నారు. ఇటీవలే జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ సంక్షోభంపై స్పందిస్తూ ప్రభుత్వం, బ్యాంకులపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

Link to comment
Share on other sites

ee case evaraina scams lo leni Modi veyyali gaani, ee Lalit Modi veyyatam enti, andu lonu Britain lo. eedu inka India British colony anukuntunnada :roflmao::roflmao::roflmao:

Asalu mundu Britain meeda legal proceedings start cheyyali ilanti scam artists landarini valla country loki allow chestunnanduku. 

Link to comment
Share on other sites

3 hours ago, swarnandhra said:

10 hours ago, RKumar said:
‘రాహుల్‌ వ్యాఖ్యలపై బ్రిటన్‌ కోర్టుకు వెళతా’

lalit1.jpg

దిల్లీ: ‘దొంగలందరి పేరులో మోదీ ఎందుకు ఉంది’ అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్‌ చేసిన విమర్శలు మోదీ అనే ఇంటి పేరు కలిగిన లక్షల మందినీ అగౌరవపరిచేలా ఉందంటూ బిహార్‌ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్‌కుమార్‌ మోదీ గురువారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్‌ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న లలిత్‌ మోదీ.. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్రిటన్‌ కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

‘‘ మోదీలంతా దొంగలే అని రాహుల్‌ అన్నారు. ఈ విషయంపై ఆయన్ని బ్రిటన్‌ కోర్టుకు లాగుతా. ఐదు దశాబ్దాల పాలనా కాలంలో భారతదేశాన్ని దోచుకున్నది గాంధీ-నెహ్రూ కుటుంబమేనన్నది జగమెరిగిన సత్యం’’ అని ట్వటర్‌లో లలిత్‌ మోదీ రాసుకొచ్చారు. ఆయన ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్యాగ్‌  చేయడం గమనార్హం. 

ఇటీవల ఓ సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. ‘దొంగలందరి  పేరులో మోదీ ఎందుకు ఉంది?’ అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఉన్న నీరవ్‌ మోదీ, ఐపీఎల్‌ వ్యవహారంలో నిందితుడు లలిత్‌ మోదీ, రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాన మోదీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని సుశీల్‌కుమార్‌ మోదీ కోర్టుకు వెళ్లారు. ఈ అంశం ఏప్రిల్‌ 22న విచారణకు రానుంది. మరోవైపు ప్రధాని మోదీకి కూడా ఆయన వ్యాఖ్యాల్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇలాంటి భాష మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో దేశంలోని వెనకబడిన వర్గాలన్నింటినీ అవమానించారని ఆరోపించారు.

ee porcupine  gaadu rg meeda britain court ki povatam endo kamedy gaa ... 

Link to comment
Share on other sites

నా శాపం తగిలే కర్కరే మృతి 

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్‌ అధికారిపై సాధ్వీ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు 
మాలేగావ్‌ పేలుళ్ల కేసులో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపణ 
సర్వనాశనమైపోతావని అప్పుడే  చెప్పానన్న భాజపా అభ్యర్థిని 
ఆమె మాటలపై మండిపడిన కాంగ్రెస్‌ 
అమరవీరులను అవమానించటమేనని ఆగ్రహించిన ఐపీఎస్‌ అధికారుల సంఘం 
క్షమాపణలు చెప్పిన సాధ్వీ ప్రజ్ఞా

భోపాల్‌: మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 2008 సెప్టెంబరు 26న ముంబయిపై ముష్కురుల దాడిని తిప్పికొట్టే యత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద నిరోధక దళం అధిపతి హేమంత్‌ కర్కరే గురించి ఆమె అనుచితంగా మాట్లాడారంటూ ఆగ్రహం 19AP-main14a.jpgవ్యక్తమవుతోంది. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో తనను కర్కరే చిత్రహింసలకు గురిచేసినందున సర్వనాశనమైపోతావని శపించానని, ఆ తర్వాత ఆయన మృత్యువాతపడ్డారని గురువారం రాత్రి భోపాల్‌లో భాజపా కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యానించారు. సాధ్వి మాటలు భాజపాను ఇబ్బందుల్లో పడేశాయి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ‘‘మాలెగావ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న కమిటీ పిలుపుతో కర్కరే ముంబయి వచ్చారు. అప్పుడు నేను అక్కడి జైలులో ఉన్నా. నాకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లేనప్పుడు జైలులో ఉంచటం అక్రమం అవుతుందని దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు కర్కరేకి తెలిపారు. కానీ, ఎలాగైనా సరే ఆధారాలు సాధిస్తానని కర్కరే చెప్పారు. అందుకోసం ఏమైనా చేస్తానన్నారు. అవసరమైతే సృష్టిస్తానని చెప్పారు. నన్ను జైలు నుంచి విడుదల చేయటానికి మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత నన్ను కర్కరే పలు విధాలుగా హింసించారు. అది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? అంటూ రకరకాలుగా ప్రశ్నించారు. నాకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసునని చెప్పాను. అప్పుడు అవన్నీ తెలుసుకోవటానికి దేవుడిని సంప్రదించాలా అని కర్కరే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే...మీరు తెలుసుకోవాలంటే దేవుడి దగ్గరకే వెళ్లవచ్చునని తెలిపాను. దీంతో కర్కరే నన్ను తీవ్రంగా హింసించారు. దాంతో సర్వనాశనమైపోతావని శపిస్తూ నెల రోజుల్లో వాళ్ల ఇంటిలో మరణానంతర క్రతువులు జరుగుతాయని చెప్పా. సరిగ్గా నెల తర్వాత ఉగ్రవాదుల కాల్పుల్లో కర్కరే చనిపోయారు’’ అని సాధ్వి సమావేశంలో భాజపా కార్యకర్తలతో చెప్పారు. 
మృతవీరుడిని గౌరవించాలి: రాహుల్‌ గాంధీ 
ఉగ్రవాదులపై పోరులో ప్రాణాలు అర్పించిన కర్కరే పట్ల హుందాగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. కర్కరే త్యాగాన్ని చులకన చేసేలా ఎవరూ మాట్లాడరాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భోపాల్‌ లోక్‌సభ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ప్రజ్ఞా వ్యాఖ్యలు అమరవీరుడిని అగౌరవపరిచేలా ఉన్నాయని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిరసన వ్యక్తం చేయగా, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. 
సాధ్వి వ్యక్తిగత అభిప్రాయమే: భాజపా 
కర్కరేపై సాధ్వి ప్రజ్ఞా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి సంబంధంలేదని భాజపా పేర్కొంది. చిత్రహింసలకు గురైన ఆమె ఆవేదనతో అలా మట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఉగ్రవాదులపై సాహసోపేత పోరులో కర్కరే ప్రాణాలు కోల్పోయారని విశ్వసిస్తున్నట్లు భాజపా ఒక ప్రకటనలో తెలిపింది. 
అమరుల త్యాగాలను గౌరవించాలి 
హేమంత్‌ కర్కరే ఉగ్రవాదులపై పోరులో తన ప్రాణాలను త్యాగం చేశారని ఐపీఎస్‌ అధికారుల సంఘం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. అమరుల త్యాగాలను గౌరవించాలని డిమాండ్‌ చేసింది. ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని మధ్యప్రదేశ్‌ ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 
క్షమాపణలు కోరిన ప్రజ్ఞాసింగ్‌ 
తన వ్యాఖ్యలపై సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. భావోద్వేగంతో కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ప్రజ్ఞా కోరారని ఆమె సహాయకుడు ఉపమా సింగ్‌ వెల్లడించారు. ‘‘నా వ్యాఖ్యల వల్ల దేశ శత్రువులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కనుక నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. క్షమాపణలు కోరుతున్నాను’’ అని శుక్రవారం బరేసియా సభలో ప్రజ్ఞా తెలిపారని ఉపమా సింగ్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

17 hours ago, RKumar said:
నా శాపం తగిలే కర్కరే మృతి 

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్‌ అధికారిపై సాధ్వీ ప్రజ్ఞా వివాదాస్పద

idee bjp valla manasika paristhithi ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...