Jump to content

Need some info on annadata sukhibhava


rajanani

Recommended Posts

రోజుకు 10వేల మందికి జమ
25-04-2019 01:44:55
 
  • అన్నదాత-సుఖీభవలో రెండువిడతలు ఒకేసారి
  • 20రోజుల్లో 2 లక్షల మందికి చేరిక
  • మొత్తంగా 1,813కోట్లు అందజేత
  • ఆదాయపన్ను కడుతున్న వారికి నో
  • ఆ వివరాలు పంపిన కేంద్రం
అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యల ఫలితంగా అర్హులందరికీ అన్నదాత-సుఖీభవ పథకం లబ్ధి క్రమంగా చేరుతోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద సగటును ప్రతిరోజూ 10వేల మంది ఖాతాల్లో సొమ్ము జమవుతోంది. రెండు విడతలు ఒకేసారి అందుకుంటున్న లబ్ధిదారులు కూడా వీరిలో ఉన్నారు. మొత్తం 50లక్షల మంది ఈ పథకం కింద అర్హులని తొలుతే లెక్క తేల్చారు. అందులో 44లక్షల మందికి తొలి విడత సొమ్ము రూ.వెయ్యి అప్పట్లోనే జమ చేశారు. రెండో విడతలోనూ రూ.3వేల చొప్పున ఖాతాల్లో జమైంది. సుమారు 6లక్షల మందికి ఆయా విడతల చెల్లింపులు కాలేదు. పొలం వివరాలు వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం కాకపోవడం, వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానమైనా.. బ్యాంకు ఖాతా తో అనుసంధానం కాకపోవడం తదితర సమస్యలతో వీరికి లబ్ధి చేరలేదు. ప్రభుత్వం ఆ అం శాలన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పరిష్కరించుకుంటూ వస్తోంది. అవి కొలిక్కి వస్తుండటం తో రోజుకు సగటున 10వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమవుతోంది. ఆ విధంగా ఈ 20 రోజుల్లోనే సుమారు 2లక్షల మందికి మేలు జరిగింది.
 
 
నెలరోజుల్లోనే అందరికీ!
ఈ పథకం కింద అర్హులైనా డబ్బు జమకాని వారిని గుర్తించి ఒకేసారి రెండు విడతలకు సంబంధించిన రూ.4వేలను ఖాతాల్లో వేస్తున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ముందే ఆమోదం తెలియజేయడంతో ఈ ప్రక్రియ ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ఇప్పటికి మొదటి విడత కింద 46.42లక్షల మందికి, రెండో విడత సొమ్మును 44.98లక్షల మందికి చెల్లించారు. ఇంకా మొదటి విడత సొమ్ము 3.77లక్షల మందికి, రెండో విడత సొమ్ము 3.93లక్షల మందికి చెల్లించాలని, ఆ మేరకు అర్హులున్నారని ప్రభుత్వ అంచనా. వెబ్‌ల్యాండ్‌ అనుసంధానం, బ్యాంకు ఖాతా అనుసంధానం సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఎంపీఈవోలకు అప్పగించా రు. క్షేత్రస్థాయిలో ఈ సమస్యలు కొలిక్కి రాగా నే బ్యాంకు ఖాతాలోకి డబ్బుజమైయ్యేలా ఏర్పా ట్లు చేశారు. ఇలా మిగిలిపోయిన వారందరికీ రాబోయే నెలరోజుల్లోనే అన్నదాత-సుఖీభవ అందుతుందని అధికారు పేర్కొంటున్నారు.
 
 
వారికి లేదు!
ఇప్పటివరకు మొత్తం రూ.1813కోట్లను రైతులకు అన్నదాత-సుఖీభవ పథకం కింద అందించారు. తొలి విడతలో 46.42లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున రూ.464.2కోట్లను, రెండో విడత కింద 45లక్షల మందికి రూ.3వేల చొప్పున రూ.1350కోట్లు జమ చేశారు. మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. ఆదాయ పన్ను కడుతున్న రైతులకు మాత్రం అన్నదాత -సుఖీభవ అందదు. ఆదాయ పన్ను మదింపుదారుల వివరాలను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. సుమారు 1.6లక్షల మంది రైతు కుటుంబాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలా ఐటీ కట్టేవారికి పథకం వర్తించదు. ఈ విషయం తెలియక తమకు రావడం లేదని అనుకుంటున్న రైతులు ఉన్నారు. వీరికి ఇక వచ్చే అవకాశాలు లేవు.
Link to comment
Share on other sites

52 minutes ago, Dr.Koneru said:

It కట్టె రైతు రైతు కాదా.. Endo le picha palurakalu. Chesedi వంకరగా చేస్తే మండే వాడు calm గా undadu.. 

Income tax kadtunnadu ante, he has alternate income ( other than Agri ) of 5L or more ane kada ?  For someone who can earn Rs.5L alternatively,  removing this benefit makes sense.

Link to comment
Share on other sites

38 minutes ago, krishna_a said:

Income tax kadtunnadu ante, he has alternate income ( other than Agri ) of 5L or more ane kada ?  For someone who can earn Rs.5L alternatively,  removing this benefit makes sense.

Major clause is to have 5 acre land ye kani income sources kadu ga. If by going with ur logic how many of them are owning land and not doing agri but receiving this? BS to cover up their A. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...