Jump to content

Postal Voting - AP


RKumar

Recommended Posts

పోస్టల్‌ ఓట్లపై దృష్టి పెట్టండి

ఫారం 17(సి)లు అందరూ పంపాలి
పార్టీ అభ్యర్థులకు సీఎం సూచన
22న ఉండవల్లిలో కార్యగోష్ఠి

ap-main10a_11.jpg

ఈనాడు, అమరావతి: పార్టీ అభ్యర్థులు, నాయకులు పోస్టల్‌ ఓట్లపై దృష్టి పెట్టాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో 2.47 లక్షల పోస్టల్‌ ఓట్లున్నాయని, వాటిలో ఇప్పటిదాకా 65శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు. పార్టీ అభ్యర్థులతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్‌ అనంతర పరిణామాలు, ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిటర్నింగ్‌ అధికారుల నుంచి ఫారం 17(సి) దరఖాస్తుల్ని తీసుకోవడం వంటి అంశాలపై 22న జరిగే కార్యగోష్ఠిలో చర్చిద్దామని తెలిపారు. పోస్టల్‌ ఓట్లు నూరుశాతం పోలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఇంతవరకు 17(సి)లు 23శాతమే వచ్చాయని, లోక్‌సభ నియోజకవర్గాలవారీగా చూస్తే 68 శాతంతో నర్సాపురం, 62 శాతంతో రాజమహేంద్రవరం ముందున్నాయని చెప్పారు. పోస్టల్‌ ఓట్ల పోలింగ్‌లో 80.21 శాతంతో శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉండగా, 41.86 శాతంతో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో ఉందని తెలిపారు. ‘17(ఎ), 17 (సి)లలో పోలింగ్‌ కేంద్రాల వారీగా నమోదైన వివరాల్ని పరిశీలించాలి. ఎక్కడైనా తేడాలుంటే పోరాడాలి’ అని పేర్కొన్నారు. మొత్తం పోలైన పోస్టల్‌ ఓట్లలో 1,14,633 తెదేపాకు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు. స్ట్రాంగ్‌రూములు రాష్ట్రంలో 37 ఉన్నాయని, ప్రతి చోటా పార్టీ మనుషులను కాపలాగా ఉంచాలని సూచించారు.  17(ఎ), 17(సి) ఫారాల్లో నమోదు చేసిన వివరాలు నూరుశాతం సరిపోలాయో లేదో చూడాలని సూచించారు. గాజువాకలో 3వేల ఓట్ల వరకూ తేడా కనిపిస్తోందని పేర్కొన్నారు.

జగన్‌ కళ్లకు ప్రజల ఇబ్బందులు తెలియవు: లోకేశ్‌ ట్వీట్‌
‘లోటస్‌ రక్షణలో, కమలం రేకులు కప్పుకున్న మీ కళ్లకు రాష్ట్రంలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందులు తెలియవు’ అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ 11 పోలింగ్‌ రోజున ఈవీఎంలు సక్రమంగా పనిచేయక ప్రజలు వ్యక్తంచేసిన ఆవేదన వీడియో, అదే రోజు సాయంత్రం జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూఎన్నికల నిర్వహణపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విటర్‌లో జత చేశారు.

Link to comment
Share on other sites

Indaka cvr news vedio okati chusa durgaprasad anta party athanu matladadu.. 

Cbn general ga vachina survery lu kakunda own 4 and 5 survey lu cheyyinchukonnadu prathi booth nunchi total state.. Andhuke ayina 120 antunnadu memu inka 130 antunnamu kani cbn tagginche chebuthunnadu ani cheppadu. 

Link to comment
Share on other sites

11 hours ago, Godavari said:

How this possible 

 

2 hours ago, JAYAM_NANI said:

We don't typically ask such question to Rkumar.

CBNమొత్తం పోలైన పోస్టల్‌ ఓట్లలో 1,14,633 తెదేపాకు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...