Jump to content

Penamaluru

NatuGadu

Recommended Posts

నిద్రపోయాం.. అందుకే ఈవీఎంల తరలింపు జాప్యం!

పరిశీలకులకు ఆర్వో ఇచ్చిన సమాధానం
12 గంటలు ఆలస్యంగా చేరిన ఈవీఎంలు

నిద్రపోయాం.. అందుకే ఈవీఎంల తరలింపు జాప్యం!

విజయవాడ: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల  పనితీరు, టాంపరింగ్‌పై వివాదం నెలకొంది. అనుమానాలు ఏర్పడుతున్నాయి. దీనిపై చర్చ సాగుతోంది. ఈ చర్చకు బలం చేకూరే విధంగా పోలింగ్‌ ముగిసిన 12 గంటల తర్వాతా ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు చేరలేదు. కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈవీఎంలను రిటర్నింగ్‌ అధికారి ఆలస్యంగా తీసుకెళ్లడాన్ని ఎన్నికల పరిశీలకులు గుర్తించి స్వీకరించేందుకు తొలుత నిరాకరించి, తర్వాత తీసుకుని సంతకం చేసినట్లు తెలిసింది. పార్లమెంటు పరిశీలకుడు సంతకం చేయలేదని తెలిసింది. ఈవీఎంల రవాణాకు జాప్యం జరగడంపై ఆ రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన సమాధానం ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది. 3 రోజులుగా నిద్ర లేదని, తాను నిద్రపోయి రావడంవల్ల జాప్యం అయిందని ఆ ఆర్వో వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈవీఎంలు పెద్దగా మొరాయించలేదు. కేవలం 2 కంట్రోల్‌ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌నే మార్చాల్సి వచ్చింది. కానూరు పంచాయతీలో ఒక బూత్‌, యనమలకుదురులో రెండు బూత్‌లు, వణుకూరులో ఒక బూత్‌లో అర్థరాత్రి 12 గంటలవరకు పోలింగ్‌ జరిగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రం సమీపంలోని దనేకుల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11 వతేదీ అర్థరాత్రి లోపే పోలింగ్‌ ముగిస్తే.. 12 వతేదీ రాత్రి 9 గంటలకు ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంకు వెళ్లాయి. ఆలస్యంగా రావడంవల్ల తాము స్వీకరించబోమని ఎన్నికల పరిశీలకులు గణేష్‌కుమార్‌ (పార్లమెంట్‌) బినోద్‌ జాన్‌ (అసెంబ్లీ) నిరాకరించారు. ఆ తర్వాత తీసుకున్నారు.

సబ్‌కలెక్టర్‌కు నోటీసు, తహసీల్దార్‌ సస్పెన్షన్‌
మచిలీపట్నం స్ట్రాంగ్‌రూంల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్‌కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఏఆర్‌వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్‌ పి.తేజేశ్వరరావును సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. రిజర్వు ఈవీఎంలను మచిలీపట్నం కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వాటిని వాహనంలో తరలించిన అంశం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ సీరియస్‌ అయింది.

Link to comment
Share on other sites

Jaffas discussions lo 6-11PM they are saying managed polling officers & opposition agents to do rigging in most places. Mainly EG & WG lo this is done for YCP ani cheppukuntunnaru.

Even Guntur 10-11PM B.Gardens, Nallacheruvu laanti places lo YCP-Modugula done rigging with his followers, TDP recognized it late.

How far these rumors true, how many polling booths TDP polling agents were there till end?

Link to comment
Share on other sites

11 minutes ago, RKumar said:

Tdp strong area lone vallu guddu konnaru ante.... 

Link to comment
Share on other sites

ఏది నిజం? 

ఎన్నిచోట్ల ఈవీఎంల సమస్య? 
ఈనాడు - అమరావతి

16ap-main2a_5.jpg

ఏపీలో 92 వేల ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించగా, 381 ఈవీఎంల్లోనే సమస్యలు వచ్చాయి. మొత్తం ఈవీఎంల్లో ఇది 0.03 శాతం మాత్రమే. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా మొరాయిస్తే వాటిని పరిష్కరించాం.

-  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది (పోలింగ్‌ రోజు)

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చింది.

- సీఈసీ సునీల్‌ అరోడా (సోమవారం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో)

4 వేల పైచిలుకు ఈవీఎంలు వీవీప్యాట్‌లు మొరాయించాయి.

- క్షేత్రస్థాయి పరిశీలన

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారేమో 381 చోట్ల ఈవీఎంల్లో సమస్యలు వచ్చాయంటారు.  భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరేమో 45 ఈవీఎంల్లోనే సమస్య తలెత్తింది అని చెబుతారు. క్షేత్రస్థాయిలో చూస్తే వందలు కాదు. రాష్ట్రంలో  వేల కొద్దీ ఈవీఎంలు  పోలింగ్‌ రోజున మొరాయించాయి. వివిధ కేంద్రాల్లో కనిష్ఠంగా 45 నిమిషాలు నుంచి గరిష్ఠంగా 7 గంటల వరకూ ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో అర్ధరాత్రి దాటి వేకువజాము వరకూ పోలింగ్‌ నిర్వహించవలసి వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ సమయంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లో ఎంత మంది ఉంటే, వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈవీఎంల మొరాయింపు లేకుండా పోలింగ్‌ సక్రమంగా జరిగి ఉంటే, సాయంత్రం 7-8 గంటల్లోగా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటి మరుసటి రోజు వేకువజాము వరకూ కూడా పోలింగ్‌ నిర్వహించారంటే.. ఈవీఎంల వైఫల్యం కాకుండా వేరే సమస్య ఇంకేముంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. 
పోలింగ్‌ రోజున ‘ఈనాడు, న్యూస్‌టుడే’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పడు 4,583 చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్లు మొరాయించినట్లు తేలింది. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా ఓట్లు వేయటం సాధ్యం కాదు. దీంతో ఆ కేంద్రాల్లో పోలింగ్‌కు గంటలు తరబడి అంతరాయం ఏర్పడిందని అర్ధమవుతుంది. కొన్ని చోట్లయితే పోలింగ్‌ మొదలుకావటమే ఆలస్యమైంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, పదుల చోట్ల మాత్రమే ఈవీఎంల్లో 
సమస్యలు తలెత్తాయని చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
వందల సంఖ్యలో ఈవీఎంలను ఎందుకు మార్చాల్సి వచ్చింది? 
పోలింగ్‌ రోజున ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 211 ఈవీఎంలను అధికారులు మార్చారు. మొరాయించటం, సాంకేతిక సమస్యలు కారణంగా వీటిని మార్చారు. 180 కంట్రోల్‌ యూనిట్లు, 241 వీవీప్యాట్‌లను కూడా మార్చాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 114, శ్రీకాకుళం జిల్లాలో 252, కడప జిల్లాలో 40 ఈవీఎంలు మార్చారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. 618 పోలింగ్‌ కేంద్రాల్లో 2 గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత కూడా పలు చోట్ల సాయంత్రం వరకూ ఈవీఎంలు సతాయించాయి. 
ఏప్రిల్‌ 11వ తేదీన రాత్రి ఏ సమయానికి ఎన్ని కేంద్రాల్లో  పోలింగ్‌ కొనసాగిందంటే.. 
రాత్రి 9.15 గంటల వరకూ: 726 
10.30 గంటల వరకూ: 139 
11 గంటల వరకూ: 70 
11.30 గంటల వరకూ: 49 
12 గంటల వరకూ: 23 
12.30 గంటల తర్వాత: 14 
12వ తేదీ ఉదయం వరకూ: 6

Link to comment
Share on other sites

32 minutes ago, RKumar said:

Jaffas discussions lo 6-11PM they are saying managed polling officers & opposition agents to do rigging in most places. Mainly EG & WG lo this is done for YCP ani cheppukuntunnaru.

Even Guntur 10-11PM B.Gardens, Nallacheruvu laanti places lo YCP-Modugula done rigging with his followers, TDP recognized it late.

How far these rumors true, how many polling booths TDP polling agents were there till end?

Areyyyyy Hooooo :sleep:

B.gardens lo rigging next to impossible. It’s TDP adda and polling percentage will also be very high, wheel chair lo Kooda ocharu. It’s my booth only . Tampering ithe matram ika devude kapadali 😢

Link to comment
Share on other sites

15 minutes ago, uravis said:

B.gardens lo rigging next to impossible. It’s TDP adda and polling percentage will also be very high, wheel chair lo Kooda ocharu. It’s my booth only . Tampering ithe matram ika devude kapadali 😢

ekkada A booth location cheppandi

Link to comment
Share on other sites

51 minutes ago, uravis said:

B.gardens lo rigging next to impossible. It’s TDP adda and polling percentage will also be very high, wheel chair lo Kooda ocharu. It’s my booth only . Tampering ithe matram ika devude kapadali 😢

నల్లచెరువు, బృందావన్‌గార్డెన్స్‌లో ఉద్రిక్తత
 
 వైకాపా రిగ్గింగ్‌ను అడ్డుకున్న తెదేపా
 మోహరించిన మూడు ప్రధాన రాజకీయ పక్షాలు
నీ పోలీసుల లాఠీఛార్జి

amr-gen2a_121.jpg

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు, బృందావన్‌గార్డెన్స్‌లో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్లచెరువులోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారని తెదేపా నాయకులకు సమాచారం అందింది. పోలింగ్‌ గడువు ముగిశాక దొంగ ఓట్లు వేసేందుకు ఓటర్ల స్లిప్పులు వైకాపా పంపిణీ చేసి లోపలకు పంపుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. విషయాన్ని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌, పశ్చిమ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. రిగ్గింగ్‌ జరుగుతుండటం వల్ల పోలింగ్‌ను నిలిపివేయాలని కోరారు. అయినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల అధికారులు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు ఓటర్లకు నగదు పంపిణీ చేసి రిగ్గింగ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి పోలీసులు, అధికారులు సహకరించారని విమర్శించారు. తెదేపా నాయకులు రీపోలింగ్‌ జరపాలని, వైకాపా నాయకులు పోలింగ్‌ కొనసాగించాలని నినాదాలు చేశారు. ఇంతలో తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌, పార్టీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, చుక్కపల్లి రమేష్‌లు అక్కడకు చేరుకున్నారు. గడువు ముగిశాక ఏవిధంగా లోపలకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్‌ను నిలిపివేయాలని కోరారు. ఇంతలో వైకాపా గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, వైకాపా నాయకులు లేళ్ళ అప్పిరెడ్డి కూడా అక్కడకు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి అధికారులతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రం లోపల పోటీలో ఉన్న అభ్యర్థులు ఉండగా.. వెలుపల మూడు పార్టీల నాయకులు మోహరించారు. ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పినా వినలేదు. పోలింగ్‌ ముగించే వరకు ఇక్కడ నుంచే కదిలేది లేదని తెదేపా నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. వైకాపా నాయకులు పోలింగ్‌ కొనసాగించాలని పట్టుబట్టడంతో పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు ఎటువాళ్లు అటు పారిపోయారు. అంతకుముందు బృందావన్‌గార్డెన్స్‌లోని దివ్యాంగుల వసతి గృహం వద్ద తెదేపా, వైకాపా నాయకులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్‌ ఏజెంట్‌ ఒకరు చుక్కా ఏసురత్నం అని పేరు ఉండటం దీనికి కారణమైంది. అర్థం పర్థం లేకుండా ఆ పేరు ఎందుకు పెట్టారని ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైకాపా నాయకులు.. తెదేపా నాయకులు ఉన్న ఇంటి వైపు దూసుకొచ్చారు. దీనిని తెదేపా నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని ప్రతిఘటించారు. ఈ రెండు వ్యవహారాల్లో పోలీసులు తీరు ఏకపక్షంగా ఉందని తెదేపా నాయకులు ఆరోపించారు. నల్లచెరువులో పోలింగ్‌బూత్‌ల్లో 690 వరకు దొంగ ఓటర్ల స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌ చేయించారని విమర్శించారు. దొంగ ఓట్లు పోలైనందున ఇక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దొంగ స్లిప్పులపై ఓట్లు వేయనిస్తారా.. చెప్పాలని నిలదీశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి రీపోలింగ్‌ జరపాల్సిందేనని తెదేపా నాయకులు పట్టుబడుతున్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సిరిపురపు శ్రీధర్‌, ముత్తినేని రాజేష్‌, రావిపాటి సాయికృష్ణ, దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

As per above articie in Eenadu YCP B.Gardens, Nallacheruvu lo rigging try chesindi/kontha chesindi ante vaallu strong ga vunde places lo ela vundi vuntadi?

Agents & Police cooperate chesina chota one side rigging chesukuni vuntaaru.

Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

As per above articie in Eenadu YCP B.Gardens, Nallacheruvu lo rigging try chesindi/kontha chesindi ante vaallu strong ga vunde places lo ela vundi vuntadi?

Agents & Police cooperate chesina chota one side rigging chesukuni vuntaaru.

nalla cheruvu, brodipet, and they added some villages in 2009 under guntur west these will be prone to rigging if they manage

Link to comment
Share on other sites

ఉద్దేశపూర్వకమా.. నిర్లక్ష్యమా..?

ఆలస్యంగా ఈవీఎంల తరలింపు ఘటనపై విచారణ
పెనమలూరు ఆర్వో తీరుపై విమర్శలు

17evms1a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగితే.. పోలింగ్‌ ముగిసిన 12గంటల తర్వాత ఈవీఎంలు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని రెండు పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు ఆలస్యంగా పంపిణీ కేంద్రానికి చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 12గంటలకు పోలింగ్‌  ముగిస్తే మరుసటి రోజు రాత్రి 9గంటలకు ఈవీఎంలను అప్పగించడం కలకలం రేపుతోంది. ఈవీఎంల అప్పగింతకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చిన సమాధానం ఎన్నికల అధికారులను నివ్వెరపోయేలా చేసింది. నిద్ర పోయాం.. అందుకే ఆలస్యమైందంటూ బాధ్యత కల్గిన రిటర్నింగ్‌ అధికారి చెప్పడంతో ఈవీఎంలు తీసుకొనేందుకు స్ట్రాంగ్‌రూమ్‌ అధికారులు తొలుత నిరాకరించారు. ఆ తర్వాత స్వీకరించినట్టు తెలుస్తోంది. తమకు మూడు రోజులుగా నిద్ర లేదని, అందువల్ల బాగా నిద్రపట్టేసిందని.. అందుకే ఈవీఎంల అప్పగింత ఆలస్యమైందంటూ ఆర్‌వో విస్తుపోయే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ అంశంపై ఈసీ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల నుంచి ఈసీ వివరణ కోరినట్టు సమాచారం. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తోంది. ఎన్ని గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రం నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారనే అంశంపై కలెక్టర్‌ను వివరణ కోరనున్నారు. నివేదిక వచ్చాక పూర్తిస్థాయిలో విచారించాక చర్యలు తీసుకొనే అవకాశం కనబడుతోంది. అయితే ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందా.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా అనే విషయాలు విచారణలో తేలనున్నాయి.

Link to comment
Share on other sites

7 hours ago, uravis said:

B.gardens lo rigging next to impossible. It’s TDP adda and polling percentage will also be very high, wheel chair lo Kooda ocharu. It’s my booth only . Tampering ithe matram ika devude kapadali 😢

Videos kuda vunnay... Where Galla is quarrelling with police to stop rigging... During night...

Link to comment
Share on other sites

1 hour ago, Venu_NTR said:

Videos kuda vunnay... Where Galla is quarrelling with police to stop rigging... During night...

Enni votes rigging chesi vuntaaru G-West lo? What those booth agents doing.

4PM ke YCP agents bayata TDP agents ni instigate chesthunnaru to vote for Fan.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...