Jump to content

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు తాజా ఆదేశాలు ఏంటంటే...


Recommended Posts

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు తాజా ఆదేశాలు ఏంటంటే...
15-04-2019 14:47:49
 
636909366056375572.jpg
  • గెలుపుపై అంచనాలు
  • ఓటింగ్‌పై టీడీపీ అభ్యర్థుల లెక్కలు
  • బూత్‌లవారీగా పోలైన ఓట్లపై విశ్లేషణ
  • నివేదిక కోరిన అధిష్ఠానం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
ఎన్నికలు ముగిసిన తరువాత ఓటింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దృష్టి సారించారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా పోలైన ఓట్లపై ఒక అంచనాకు వచ్చారు. సెగ్మెంట్‌లలో బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలతో కూడిన 17(సీ) ద్వారా సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి తీసుకున్నారు. ప్రతి సెగ్మెంట్‌లో బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు? పోలైన ఓట్లు? పురుషులు, మహిళలు? ఎవరి శాతమెంత? అనేది ఈ 17(సీ)లో ఉంటుంది. దీని ప్రకారం బూత్‌ల వారీగా టీడీపీకి వచ్చే ఓట్లెన్ని? ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి? అనేది అంచనా వేశారు.
 
 
గత ఎన్నికలలో వచ్చిన ఓట్లతో ప్రస్తుత ఎన్నికలలో వచ్చే ఓట్లను పోల్చి లెక్కలు వేశారు. పార్టీకి బలమైన బూత్‌లలో పోల్‌ శాతం పెరిగితే అనుకూలంగా ఉంటుందని అంచనా మేరకు లెక్కలు కట్టారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఎక్కువగా పోలైన బూత్‌ల వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే బూత్‌లలో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండింటికీ మధ్య తేడా ఎంత? దాని ప్రకారం గెలుపుపై అంచనాలు వేశారు. అయితే ఈ నెల 11న పోలింగ్‌ సరళి ప్రధానంగా మధ్యాహ్నం తరువాత మహిళలు ఓటింగ్‌కు వచ్చారు.
 
ఎంత రాత్రయినా సరే వుండి, ఓటేసి వచ్చారు. దీనిపై తెలుగుదేశం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తరువాత ప్రభుత్వం అమలు చేసిన పసుపు కుంకుమ పథకం, పింఛను పెంపు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే మహిళలు ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన విషయం గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని బూత్‌లవారీగా పోలైన ఓట్లను విశ్లేషించారు.
 
 
ఇదే సమయంలో అధిష్ఠానం కూడా ఓటింగ్‌ సరళిపై అభ్యర్థుల నుంచి నివేదికలు కోరింది. ఎన్నికలతో సరిపెట్టకుండా పోలైన ఓట్ల శాతం మేరకు పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. అందుకే నియోజకవర్గంలో బూత్‌లవారీగా ఓట్ల వివరాలతో పంపాలని సూచించింది. ప్రతి బూత్‌ ఏజెంట్‌ సంతకం తీసుకుని నివేదిక పంపాలని ఆదేశించింది. అంటే ఆయా బూత్‌లలో టీడీపీకి వచ్చే ఓట్లు ఎన్ని ఉంటాయన్నదానిపై ఏజెంట్లకు అంచనా ఉంటుంది.
 
దాని ప్రకారం బూత్‌లలో ఓట్లు పెరిగాయా? లేదా తగ్గాయా? ఒకవేళ తగ్గితే కారణాలేంటి? అనేది ఏజెంట్లకు తెలుస్తుంది. అందుకు ఏజెంట్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని పంపాలని అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు, మూడు రోజుల తరువాత నియోజకవర్గాల వారీగా అధినేత చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. అందుకే సెగ్మెంట్‌ల నుంచి నివేదికలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పాటు విశాఖ లోక్‌సభ పరిధిలోని విజయనగరం జిల్లా ఎస్‌.కోట అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలైన ఓట్ల వివరాలతో కూడిన ఫారం17(సీ) అధిష్ఠానానికి పంపారు.
Link to comment
Share on other sites

2 hours ago, Lokanadham said:

Ma 2 booths kalipi 200 majority expect chestunnam bro. 

Overall ga comfortable ga bayatapadtham bro.. Oka vadamalapeta mandalam manaku minus...

@Lokanadham , can you share us  update on how about Tamil voters voted in Nagari, EkambaraKuppam and Nindra surrounding areas. Roja heavy relying on Tamil voters , If there is change in Tamil voters, this time easy win for TDP. Last time it was symphothy votes helped Roja ( as she lost 2  elections). 1 positive is Chengareddy supported TDP looks like this time, He could turn some voters in Nagari and Nindra surrounding areas. Any body has update on Nagari, please reply here.

Link to comment
Share on other sites

10 hours ago, Lokanadham said:

Ekambarakuppam , satrawada and chithala patteda mudiliars manake support chesaru brother... Ex muncipal chairman bhanumurthi ground lo baga work chesadu... Chengareddy Nindra lo work chesadu... Sure ga Nagari kodutham bro

Thanks @Lokanadham for the update, then easy win for Bhanu (Nagari) this time.

Link to comment
Share on other sites

1 hour ago, naanidilip said:

Yes

chittoor sure shot seats post poll?

Madanapalli, Pileru TDP edge annaru 3 days before election. Election roju tough ayyayi both along with palamaneru antunnaru.

Kuppam kaakunda comfortable ga geliche seats evi?

Link to comment
Share on other sites

accurate-survey-as-of-now-is-this.jpg
Advertisements

గత గురువారం దేశ వ్యాప్తంగా తొలి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు జరుగగా..ఏపీ లో లోక్ సభ తో పాటు అసెంబ్లీ కి సంబందించిన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుండే ఏపీలో పోలింగ్ మొదలు అవ్వగా..పోలింగ్ మొదలైనప్పటి నుండే ఈవీఎంలు మొరాయించడం మొదలు పెట్టాయి. దీంతో ఓటర్లకు చుక్కలు కనిపించాయి. ఎండలో నిలబడలేక చాలామంది వెనుతిరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. ఆరు గంటల్లోపు పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తామని.. ఎంత రాత్రి అయినా.. ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది చెప్పడంతో చాలా మంది సాయంత్రం 4 గంటల నుండి పోలింగ్ లో పాల్గొన్నారు. దీంతో అప్పటి వరకు 50 శాతంగా ఉన్న పోలింగ్ ..

Survey-2-1024x10241-300x300.jpg

ఆ తర్వాత బాగా పెరిగింది. పోలింగ్ సమయం దాటినా 6 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారని సమాచారం తెలిసిందీ. రాత్రి పది గంటల సమయంలోనూ 400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. కృష్ణా జిల్లా జక్కంపూడిలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. రాత్రి 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అప్పటికీ క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుతీరి ఉండటంతో పోలింగ్ 80 శాతానికి పైగా నమోదైనట్లు భావించారు. ఓవరాల్ గా ఏపీ ఎన్నికలు హింసాత్మకంగా జరిగాయి..ఓవైపు ఘర్షణలు జరుగుతున్నా ఓటర్లు మాత్రం భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. గుంటూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో టీడీపీ కి చెందిన వ్యక్తి , వైసీపీ కి చెందిన మరో వ్యక్తి మరణించారు. అంతే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు ఏపీలో పోలింగ్ జరిగింది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. అలాగే క్యూలైన్లలో నిల్చుని.. ఎంత ఆలస్యమైనా ఓటు వేశారు. తిరుపతి వెంకన్న దగ్గరకు వెళ్లి ఇబ్బంది పడతామా అన్న రీతిలో ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలు ముగియటంతో పోస్ట్ పోల్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి. అలా వచ్చిన తాజా సర్వే ఫలితాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్ అయినా ఈ ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయని ఎక్కువ మంది షేర్ చెయ్యటం గమనార్హం .

accurate-survey-1.jpeg

accurate-survey-2.jpeg

accurate-survey-3.jpeg

accurate-survey-4.jpeg

accurate-survey-5.jpeg

accurate-survey-13.jpeg

accurate-survey-12.jpeg

accurate-survey-11.jpeg

accurate-survey-10.jpeg

accurate-survey-9.jpeg

accurate-survey-8.jpeg

accurate-survey-6.jpeg

accurate-survey-7.jpeg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...