Jump to content

Found VVPAT Slips


chellam

Recommended Posts

ఆత్మకూరు: ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు భారీగా బయటపడ్డాయి. ఈ స్లిప్పును ఓ విద్యార్థి ‘ఈటీవీ’ ప్రతినిధికి తీసుకొచ్చి ఇచ్చారు. స్లిప్పుల కలకలం అంశాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ’ తీసుకెళ్లింది. ఈవీఎంల ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి అనేక కవర్లలో స్లిప్పులు దొరికాయి. దీనిపై స్థానిక అధికారుల వివరణను కోరనున్నట్టు కలెక్టర్ చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...