Jump to content

ysrcP goons attack on Nellore TNSF leader-Tirumala Naidu

comradee

Recommended Posts

తెదేపా యువనేతపై హత్యాయత్నం

నెల్లూరులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత తిరుమలనాయుడిపై దాడి
ఇనుప కడ్డీలతో బలంగా మోదడంతో తలకు గాయాలు
  కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో బెదిరింపులు
  వైకాపా ఎమ్మెల్యే అనుచరులే దాడికి పాల్పడ్డారు
  తెదేపా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆరోపణ
ఈనాడు - నెల్లూరు

14ap-main6a_4.jpg

నెల్లూరు జిల్లాలో ఎన్నికల కక్షలు పురివిప్పాయి. నడిరోడ్డు మీద తెదేపా యువనేతపై హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఇనుప కడ్డీలతో తలపై బలంగా మోదారు. వెంబడించి మరీ దాడి చేశారు. మొత్తం 9 మంది దాడిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం. వీరిలో కొందరిని గుర్తించారు. మిగిలినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు నగరంలో నిరసన ప్రదర్శనకు దిగారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఎమ్మెల్యే లేరు. ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందు నుంచీ బెదిరింపులు..
గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ విజయం కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ముందు నుంచి తిరుమల నాయుడికి ఫోన్ల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ‘పుట్టిన రోజు నీతో కలిసి వేడుకలు చేసుకోవాలని ఒకసారి.. మీ కుటుంబ సభ్యులకు తల బహుమతిగా పంపిస్తాం’ అని మరోసారి కొందరు బెదిరించారు. ఆదివారం ఉదయం ఇదే విషయమై పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఇతర నేతల దగ్గర ఈ విషయాలను తిరుమల నాయుడు ప్రస్తావించారు. అనంతరం ఇంటికి బయలుదేరి వెళ్తున్న సమయంలో అప్పటివరకు రెక్కీ నిర్వహిస్తున్న గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అనుచరులు ఇన్నోవా వాహనంలో ఆయనను వెంబడించారు. నిర్మానుష్యంగా ఉన్న వీధిలోకి ప్రవేశించిన తర్వాత తిరుమల నాయుడు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారు. ఇనుప కడ్డీలతో తలపై బలంగా మోదడంతో కిందపడిపోయారు. ఆ తర్వాత ఎడాపెడా కొట్టడంతో ఆయన తలపై బలమైన గాయమైంది. స్థానికంగా ఉన్న మహిళలు పెద్ద ఎత్తున అరుస్తూ అక్కడికి చేరుకోవడంతో దాడికి పాల్పడినవారు పారిపోయారు. వెంటనే పార్టీ నేతలకు సమాచారం అందటంతో అందరూ ఘటనాస్థలికి చేరుకుని తిరుమల నాయుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దాడి నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు భారీగా ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై ఎమ్మెల్యే పార్టీ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో తిరిగి వెళ్లారు. మరోవైపు, పార్టీ కార్యాలయంపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు దాడికి పాల్పడి ఎమ్మెల్యేను అసభ్య పదజాలంతో దూషించారంటూ వైకాపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిపై దాడి చేయడాన్ని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఖండించారు. ఎమ్మెల్యే అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కొద్ది రోజులుగా బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని.. ఇదే విషయమై ఆదివారం తిరుమల నాయుడు తమతో చర్చించి ఇంటికి వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని చెప్పారు. తెదేపా గ్రామీణ అభ్యర్థి అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం పనిచేసిన వారిపై దాడికి పాల్పడటం ద్వారా వైకాపా శ్రేణులు హింసను ప్రేరేపిస్తున్నాయని ధ్వజమెత్తారు.

Link to comment
Share on other sites

తిరుమలనాయుడి భార్య దీక్ష

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి అమృల్లాపైనా వైకాపా శ్రేణుల దాడి
తెదేపా విద్యార్థి విభాగ నేతలపై కొనసాగుతున్న దాష్టీకం
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌టుడే

15AP-MAIN9a.jpg

నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నాయకులపై వైకాపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడిపై నెల్లూరు గ్రామీణం వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు ఇనుపరాడ్లతో కొట్టి హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి షేక్‌ అమృల్లాపై కూడా వారు దాడులకు తెగబడ్డారు. దాడికి వ్యతిరేకంగా నెల్లూరు నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టారు. తిరుమలనాయుడి భార్య అన్విత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, కొందరు మహిళలు రూరల్‌ వైకాపా కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. తన భర్తకు ఎలాంటి ప్రాణహాని ఉండదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వచ్చి చెప్పే వరకు దీక్ష విరమించబోనని అన్విత ఆరునెలల చంటిబిడ్డతో సహా అక్కడ బైఠాయించారు. అటు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు... ఇటు వైకాపా శ్రేణులు గుమికూడడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అన్విత దీక్షను విరమింపజేయాలని పోలీసులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వచ్చి దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయిస్తానని మాట ఇస్తేనే కదులుతామని, లేదంటే తమను కూడా చంపేయాలంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకొని ఆటోలో ఎక్కించి దర్గామిట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు.     ఈ సందర్భంగా కోటంరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అమృల్లాపై ఒక్కసారిగా  వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాళ్లతో తన్ని, చేతులతో తీవ్రంగా కొట్టారు. వారి నుంచి అమృల్లాను రక్షించిన పోలీసులు అతనితో పాటు నాయకులు దత్తాత్రేయ యాదవ్‌, కిషోర్‌, వంశీచౌదరిలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాడి చేయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేయకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అరెస్టు చేస్తారా అంటూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వారు స్టేషన్‌లోనే నిరాహారదీక్షకు దిగారు.

15AP-MAIN9b.jpg

నాయుడికి పలువురి పరామర్శ
టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి, జాతీయ సమన్వయకర్త రవినాయుడు, పలు జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతలు సింహపురి  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలనాయుడుని పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం వీఆర్సీ సెంటర్‌, గాంధీబొమ్మ సెంటర్లలో చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ‘రక్తం తాగే నరరూప రాక్షసుడు’గా కోటంరెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తిరుమలనాయుడి రక్తం తాగుతున్నట్లుగా ప్రదర్శన నిర్వహించారు. వైకాపా దాడులకు బెదిరేదిలేదని, ఇటువంటి ఫ్యాక్షన్‌ రాజకీయాలు, దాడులు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే  తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని బ్రహ్మం చౌదరి హెచ్చరించారు.

Link to comment
Share on other sites

22 hours ago, RKumar said:

Power lo vundi kooda TDP vaalla position ila vunte power lekapothe Jagan & Co okkadini migalchadu.

This attack is from Nellore Rural YSRCP MLA candidate Sridhar Reddy.

Power lo vunna CBN chesedhi yemi ledhu.

Chesevaadaithe ivaala Paritala Ravianna mana madhya vundevaaru :close:

Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

What SP is doing?

Open ga champesthaam ani tiruguthunnaru Nellore lo YCP batch, rural lo intha ghoragam vunte N-City lo inka entha ghoram ga vundo.

Why they are doing all these things, elections ayipoyaayi gaa....what police is doing? Inka mana cadre kooda undhi , cadre enduku tiragabadatam ledhu? Atleast to protect themselves and others

Link to comment
Share on other sites

29 minutes ago, Seniorfan said:

eee betting lanjax kodukaa kotam reddy Sreedhar reddy ante... 

Chuss ఆ betting case lo muyinchi lopaleyyalsindi ఇద్దరిని.. ఛాన్స్ వచ్చినప్పుడు vadukoleru.. 

Link to comment
Share on other sites

1 hour ago, Seniorfan said:

Eee Nellore XXXXX kodukulu kula pichhi tho sachhipothunnaru.... gruddalo dammunte votes adukkoni gelavandi.... dourjanyam chesi kaadu...

Ippativaraku Money, Muslims & Balija support tho laakkochharu population wise 3rd/4th place ayina. Ee saari ee rendu communities lo 60% change vundi at least.

Ee saari YSRCP ki debba padithe it will become another Krishna in future, all major communities will get representation in this district.

Just check their MLA & MP seats.

YSRCP: Except 1 MLA seat-Sitting rest all general OC seats 6-MLA & 1 MP given to Reddys. 3 SC seats lekapothe avi pakka vaalle teesukune vaallu.

TDP: 3-Reddys, 3-Kams, 1-Balija, 1-Muslim, 1 MP - BC - Yadav

PRP time lo they tried to give representation to others, But money leka only Nellore town kottagaligaru.

Oka time lo General seats anni oka community ke ichhevaallu. Ippudu oka seat musti padesthunnaru.

Link to comment
Share on other sites

43 minutes ago, Muppalla said:

Why they are doing all these things, elections ayipoyaayi gaa....what police is doing? Inka mana cadre kooda undhi , cadre enduku tiragabadatam ledhu? Atleast to protect themselves and others

Ministers ga chesina Somireddy & Narayana should take care of it.

YSRCP vaallu already power loki vacchesam ani feeling lo vunnaru in most districts.

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:

Ippativaraku Money, Muslims & Balija support tho laakkochharu population wise 3rd/4th place ayina. Ee saari ee rendu communities lo 60% change vundi at least.

Ee saari YSRCP ki debba padithe it will become another Krishna in future, all major communities will get representation in this district.

Just check their MLA & MP seats.

YSRCP: Except 1 MLA seat-Sitting rest all general OC seats 6-MLA & 1 MP given to Reddys. 3 SC seats lekapothe avi pakka vaalle teesukune vaallu.

TDP: 3-Reddys, 3-Kams, 1-Balija, 1-Muslim, 1 MP - BC - Yadav

PRP time lo they tried to give representation to others, But money leka only Nellore town kottagaligaru.

Oka time lo General seats anni oka community ke ichhevaallu. Ippudu oka seat musti padesthunnaru.

ysrcp - Kadapa lo 10 seats , 2 sc theeseythey migatha andaru Reddies ey, same case in Kurnool and Chittoor...but why other parties are not highlighting this and even people also not realising the fact....

Entha sepu maa saamaajika vargham ki Adhi ledhu idhi ledhu antaaru but no BC,EC,St organization's pointing at this...

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:

Ministers ga chesina Somireddy & Narayana should take care of it.

YSRCP vaallu already power loki vacchesam ani feeling lo vunnaru in most districts.

But still I believe cadre should give back properly....even as you said senior leaders should give enough backup support...

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:

Ippativaraku Money, Muslims & Balija support tho laakkochharu population wise 3rd/4th place ayina. Ee saari ee rendu communities lo 60% change vundi at least.

Ee saari YSRCP ki debba padithe it will become another Krishna in future, all major communities will get representation in this district.

Just check their MLA & MP seats.

YSRCP: Except 1 MLA seat-Sitting rest all general OC seats 6-MLA & 1 MP given to Reddys. 3 SC seats lekapothe avi pakka vaalle teesukune vaallu.

TDP: 3-Reddys, 3-Kams, 1-Balija, 1-Muslim, 1 MP - BC - Yadav

PRP time lo they tried to give representation to others, But money leka only Nellore town kottagaligaru.

Oka time lo General seats anni oka community ke ichhevaallu. Ippudu oka seat musti padesthunnaru.

TDP social engineering is the best...give equal important to all communities

Link to comment
Share on other sites

9 hours ago, RKumar said:

Ippativaraku Money, Muslims & Balija support tho laakkochharu population wise 3rd/4th place ayina. Ee saari ee rendu communities lo 60% change vundi at least.

Ee saari YSRCP ki debba padithe it will become another Krishna in future, all major communities will get representation in this district.

Just check their MLA & MP seats.

YSRCP: Except 1 MLA seat-Sitting rest all general OC seats 6-MLA & 1 MP given to Reddys. 3 SC seats lekapothe avi pakka vaalle teesukune vaallu.

TDP: 3-Reddys, 3-Kams, 1-Balija, 1-Muslim, 1 MP - BC - Yadav

PRP time lo they tried to give representation to others, But money leka only Nellore town kottagaligaru.

Oka time lo General seats anni oka community ke ichhevaallu. Ippudu oka seat musti padesthunnaru.

Rayalaseema lo other sections started voting based on caste... it will be matter of time anukontunna..... look at chittoor..... Thambhallapalle kottaru, palamaner lo TDP ki only slight majority anta kada? Punganur lo YADAV kurradu kooda sizeable votes vasthunnaianta kada ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...