Jump to content

CBN to Karnataka


Recommended Posts

This is absolutely required now.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

CM-KARNATAKA_1.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని, జేడీఎస్‌ వ్యవస్థాపకులు దేవేగౌడ ఆహ్వానం మేరకు తొలుత కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. జేడీఎస్‌- కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆయన సోమవారం ప్రచారం నిర్వహించనున్నారు. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఉదయం కర్ణాటకకు పయనం కానున్నారు.

 

Ee dabba gallu (KCR and Jagan) dabba lo stones vesi sounds cheyalsinde

Link to comment
Share on other sites

 

This 68 Year Old Man is a machine that runs on Auto Pilot mode. Relentless in willpower. We all should strive for his work ethic.

Unfortunately, he is representing us who spend time on betting for the outcome of elections. Shame on us.

Link to comment
Share on other sites

Going to Mandya... Kumaraswamy's son is contesting from there... It's a strong JDS area but overall Karnataka is unable to receive that decision... It's a hot favourite now for everyone to keenly watch at... 

Mana time ala undi.... Rahul and co, Kumaraswamy, didi, Kejriwal, stalin, Akhilesh, mayawati.... Ufff.. ee Modi gadu inta tuppasi xxxxx anukoledu.... BJP with a person like Vajpayee undi unte ippudu.... Kadha vere laa undedi.... India is seriously looking at a leadership crisis. 

Link to comment
Share on other sites

మండ్యలో నేడు బాబు ప్రచారం.. ప్రభావమెంత?

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ , జనతాదళ్ మిత్రపక్షాల అభ్యర్థి, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి తరఫున మండ్యలో ఆయన ప్రచారం చేస్తారు. మండ్య జిల్లా పాండవపురలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి, దివంగత కన్నడ నటుడు అంబరీశ్ సతీమణి సుమలత పోటీ చేస్తున్నారు. సుమలతకు భాజపా బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగు ఓట్లపై దృష్టి
చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్న సమాచారంతో తెలుగు ఓటర్లలో ఉత్సాహం మొదలైంది. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలార్ , చిక్కబళ్లాపుర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తారు. 10 నెలల క్రితం కర్ణాటక విధానసభకు నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. కేంద్రం విభజన చట్టంలో ఆంధ్రకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, దీంతో ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే 50కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై నేరుగా పడిందని జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషణలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని 40 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 21, భాజపా 15, బెంగళూరులోని 28 సీట్లలో కాంగ్రెస్ 15, భాజపా 11, బళ్లారిలోని మొత్తం 9సీట్లలో కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకున్నాయి.

మండ్య ప్రభావం రాష్ట్రమంతా..
ప్రస్తుతం మండ్యలో పార్టీల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లభిస్తోంది. సుమలత- ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అంటూ మండ్య సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్ నేత శివరామే గౌడ ఇటీవల చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. జేడీఎస్ నేతలు ఈ వ్యాఖ్యలకు భయపడే చంద్రబాబును ప్రచారానికి దించినట్లు భాజపా విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు ఓ సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని మాజీ ప్రధాని దేవేగౌడ భాజపా విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. ఆయన ప్రచారం కేవలం మండ్య అభ్యర్థి కోసమే కాదని, భాజపాను ఓడించే క్రమంలో ‘మహాఘట్ బంధన్ ’ను బలోపేతం చేసేందుకేనని జేడీఎస్ వర్గాలు చెప్పాయి. గత విధానసభ ఎన్నికలు, ఆపై 5 స్థానాల ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల విజయం జాతీయ రాజకీయాలకు ఊతమని భావించే చంద్రబాబు మండ్యలో ప్రచారానికి వస్తున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

58 minutes ago, vinayak said:

JDS strong area adi.Devegowda requested 

Sumalatha contesting akkada after ambareesh died... Congress chala beg chesindi aa seat vadileyyamani sumalatha ki.. Seat raka poye sariki independent ga vesindi.. Emotion medha nadusthundi akkada.. Paiga telugu aavida

Link to comment
Share on other sites

మోదీ మళ్లీ వస్తే నియంతృత్వమే

కర్ణాటక ఎన్నికల సభలో ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి

15AP-MAIN14a.jpg

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దివాలా తీసింది. ఆయనను మరోసారి గెలిపిస్తే  నియంత పాలనే కొనసాగుతుంది’ అని దేశ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ సూచన మేరకే రాజ్యాంగ సంస్థలన్నీ పని చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం రాత్రి కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలో ప్రసంగించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన వీవీప్యాట్‌లలోని 50 శాతం స్లిప్పులను లెక్కించాలని మేం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. దేశమంతా పర్యటించి సీఈసీ అక్రమాలపై ప్రచారం చేస్తాం’ అని చంద్రబాబు తెలిపారు. మోదీ తీరును ప్రశ్నించిన కర్ణాటక, పశ్చిమ్‌ బంగ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రపంచ స్థాయి సమీక్షల ప్రకారం... దేశం గత 40ఏళ్లలో ఎన్నడూ చూడనంత నిరుద్యోగం, ఆర్థిక పతనం, మహిళల అభద్రత, రైతుల ఆత్మహత్యలు వంటివి ఈ ఐదేళ్లలోనే చోటుచేసుకున్నాయని చంద్రబాబు విశ్లేషించారు.

మోదీ పాలనలో రక్షణ లేదు
ప్రధాని మోదీ అత్యంత హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు ‘ఆయన పాలనలో దళితులు, అల్ప సంఖ్యాకులకు రక్షణ లేదు. వాళ్లు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని హింసాత్మక సంఘటనలు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చూశాం. కేవలం ప్రధాని మోదీ అండ చూసుకునే పోలింగ్‌ రోజున ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి’ అని మండి పడ్డారు.

15AP-MAIN14b.jpg

ప్రాంతీయ పార్టీలతో సుపరిపాలన
ప్రాంతీయ పార్టీలతోనే సుపరిపాలన సాధ్యమని చంద్రబాబు విశ్లేషించారు. 1996లో తాను ప్రధానిగా బలపరిచిన హెచ్‌.డి.దేవేగౌడ రైతు బాంధవుడిగా మంచి పాలన అందించారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు కుమారస్వామి సైతం కర్ణాటకలో ఉత్తమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌- జనతాదళ్‌ ఎస్‌ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సుమలతకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని అభిప్రాయపడ్డారు.

పార్లమెంటుకు యువకులు రావాలి..
పార్లమెంటుకు ఉత్సాహవంతులైన యువకుల అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘తెదేపా తరఫున ఆంధ్రప్రదేశ్‌లో యువకులకు మంచి అవకాశం కల్పించాం. మండ్యలోనూ దళ్‌ అభ్యర్థి నిఖిల్‌ వంటి యువ నేతల అవసరాన్ని అందరూ గుర్తించాలి. సినిమాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నా కేవలం తండ్రికిచ్చిన మాట ప్రకారం నిఖిల్‌ ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. నిఖిల్‌ సినిమాల్లోనే కాదు.. ప్రజా జీవితంలోనూ జాగ్వార్‌’ అని కొనియాడారు. ఈ చల్లని మండ్యలో అడుగుపెడితే నెల రోజులపాటు తానుపడిన శ్రమంతా మాయమైందని, ఈ గాలిలో ఏదో మహత్తు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్‌, కాంగ్రెస్‌ కీలక నేతలు పాల్గొన్నారు. పాండవపురలో బాబు రోడ్‌షోకు మంచి స్పందన లభించింది.

నేడు చెన్నైకి సీఎం
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం చెన్నై వెళుతున్నారు. ఈవీఎంలలో లోపాలపై డీఎంకే కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరించనున్నారు. డీఎంకేకు మద్దతునివ్వాలని తెలుగు ప్రజలను కోరనున్నారు.

Link to comment
Share on other sites

9 hours ago, swarnandhra said:

Telugu ame kada ani ally ki against ga poti chestunte ameki support cheyyala? em parledu. win/loose different thing. friend ki support cheyyatam correct. ayina ee sympathy drama ekkuva ayipoindi, kharma.

if sympathy is confined to one constituency, no

problem ... make sure it doesn’t boomerang in other areas

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...