Jump to content

How to hack evms


dil

Recommended Posts

VVPAT display time 7 seconds nundi 3 seconds ki change ayyindhante, it means that they have modified something in EVM machine.....Who are those ?

As per Protocol, VVPAT display time should be there for 7 Seconds for must.

Now it is very clear.....In Telangana, complete manupulation has been happened with the help of Modi & EC. ee KCR aa Modi ki longipoyaadu.

 

So, Quid-Pro-Quo concept lo work chesaaru.

 

MLAs to KCR & TRS MPs to BJP. And same has been planed in AP also....We have to see how far hey have succeeded in that.

CBN is fighting for protecting Democracy in India

Link to comment
Share on other sites

6 minutes ago, Rajakeeyam said:

What was he doing during 2017 EVM challenge by EC?

He is saying he is able to hack EVMs. But, EC is currently not allowing him to present his ideas and the way how he could hack it. This is the latest affair of last day. 

I don't know what value your question and answer to that are going to add. 

Link to comment
Share on other sites

21 minutes ago, Hello26 said:

He is saying he is able to hack EVMs. But, EC is currently not allowing him to present his ideas and the way how he could hack it. This is the latest affair of last day. 

I don't know what value your question and answer to that are going to add. 

EC had an open challenge in 2017 to show EVM is hackable. He didn’t participate?

Link to comment
Share on other sites

EVM hacking antu asalu vishayanni side chesesaru ga.. 30+% EVM malfunction is true in AP. In many booths EVMs malfunctioned many times. Some EVMs had problem of vote going to one party though the vote was casted for a different party... who are the repair guys that came in to repair EVMs. Why is EC hesitant to count all VVPAT slips in the constituencies where EVMs malfunctioned? ee Qs ki answer cheyyakunda hacking antu topic divert chesesaru

Link to comment
Share on other sites

It's a software which can be programmed anyway if needed. After certain date and certain hour n minute...count for a symbol should go up by n number. After every i number of votes to a symbol the count on other symbol should go up or down by j times. After the blue button is pushed against a symbol & VVPAT displays the same symbol...but the counter should function is certain way.

So, there are so many scenarios and everything can be programmed. If you are from IT background ...u will agree to this, I believe. 

Link to comment
Share on other sites

8 minutes ago, Hello26 said:

It's a software which can be programmed anyway if needed. After certain date and certain hour n minute...count for a symbol should go up by n number. After every i number of votes to a symbol the count on other symbol should go up or down by j times. After the blue button is pushed against a symbol & VVPAT displays the same symbol...but the counter should function is certain way.

So, there are so many scenarios and everything can be programmed. If you are from IT background ...u will agree to this, I believe. 

Yes,EVM is just like any other small program.You can easily manage them for your favor if you have the control over them.

Link to comment
Share on other sites

https://www.eenadu.net/ap/mainnews/2019/04/15/95963/

 

ఈవీఎంలలో కోడ్‌ మారింది

ఆ యంత్రాలు లోపభూయిష్టం
 తేలిగ్గా హ్యాక్‌ చేయవచ్చు
 పేపర్‌ బ్యాలెట్టే ఉత్తమం
  ‘ఈనాడు’ ముఖాముఖిలో ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణ ప్రసాద్‌
ఈనాడు - అమరావతి

 


14ap-main3a_5.jpg

ఈ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయా? లేదా? అన్నది నేను చెప్పలేదు. మీ ఇంటికి వేసిన తాళం కప్ప పగులగొట్టి ఉంది. దొంగతనం జరిగిందో లేదో తెలియాలంటే లోపలికి వెళ్లి చూడాలి. కోడ్‌ మారడం ద్వారా తాళం పగులగొట్టి ఉందని మాత్రమే నేను చెప్పగలను. ఒక టెక్నాలజీ నిపుణుడిగా... ఈవీఎంలలో ఉన్న సమస్యల్ని వివరించగలను.

- హరికృష్ణ ప్రసాద్‌


ప్రతి సంవత్సరం అమెరికాలో ‘డెస్కాన్‌’ అని ఒక ఈవెంట్‌ జరుగుతుంది. ప్రపంచంలో ఈవీఎంలను వినియోగించే చాలా దేశాలు వాటిని అక్కడికి పంపిస్తాయి. అక్కడ హ్యాకర్లు వాటిని చెక్‌ చేస్తారు. లోపాలు బయటపడితే ఆయా దేశాలు వాటిని పక్కన పెట్టి లోపరహితంగా ఉన్న మెషీన్లను రూపొందించడంపై దృష్టి పెడతాయి. మన ఈవీఎంలను ఈసీ ఎప్పుడూ అక్కడికి పంపదు. డెస్కాన్‌ తరహాలోనే గోవాలో నైనాక్‌ అని ఒక ఈవెంట్‌ జరిగింది. ఇది ఇండియన్‌ హ్యాకర్స్‌ కమ్యూనిటీ నిర్వహించే కార్యక్రమం. హ్యాకింగ్‌లో డెస్కాన్‌ నిపుణులకు మనవాళ్లు ఎక్కడా తీసిపోరు. నైనాక్‌కు ఈవీఎంలను పంపాలని ఈసీకి నేను సూచించినా పట్టించుకోలేదు.


2014లోనూ ఈసీ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించింది. వాళ్లు వీవీప్యాట్‌లను పెట్టేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈవీఎంలకు అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో వీవీప్యాట్‌ల పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు నా సలహాలూ తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేపర్‌ బ్యాలెట్‌కు వెళ్లడమే ఉత్తమం. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే ఓటు వేసే విధానం తెచ్చి ఆప్టికల్‌ స్కాన్‌ యూనిట్స్‌ పెడితే వేగంగా ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

- వేమూరు హరికృష్ణప్రసాద్‌


ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉన్నాయని, వాటిని ఎవరైనా హ్యాక్‌ చేసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్‌ సందర్భంగా ఈ విషయం రుజువైందని తెలిపారు. ఓటు వేశాక వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు కనిపించాల్సిన స్లిప్‌ 3 సెకన్లే  కనిపించిందంటే ఎక్కడో తేడా జరిగినట్టేనని, కోడ్‌ మారి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానానికే వెళ్లడం మంచిదని చెబుతున్న హరికృష్ణ ప్రసాద్‌తో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి..

14ap-main3b_3.jpg

అప్పట్లో రెండు లోపాలు బయట పెట్టాం
2010లో మొదటిసారి ఈవీఎంలను హ్యాక్‌ చేసినప్పుడు ప్రధానంగా 2 లోపాలను బయట పెట్టాం. ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌లోని రిజల్ట్‌ బటన్‌ నొక్కి... డిస్‌ప్లే యూనిట్‌లో కనిపించిన సంఖ్యను లెక్కిస్తారు. డిస్‌ప్లే యూనిట్‌లో ఒక చిప్‌ను అమర్చి బ్లూటూత్‌ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయవచ్చని నిరూపించాం. పోలింగ్‌ ముగిశాక  అవకాశం దొరికితే ఈవీఎం మెమొరీలో ఉన్న ఓట్లను ఎలా మార్చేయవచ్చో నిరూపించాం.

వీవీప్యాట్‌లు తెచ్చినప్పుడు  నేనూ అభినందించా
ఓటరు ఓటు వేసినప్పుడు వీవీప్యాట్‌లో స్లిప్‌ ప్రింటవుతుంది. అది అద్దంలో కిందకు జారుతూ మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక చాలా మంది ఈవీఎంలను హ్యాక్‌ చేస్తామంటూ తిరిగారు. అది సాధ్యం కాదని, లోపాలు తలెత్తకుండా ఈసీ పటిష్ఠ వ్యవస్థ పెట్టిందని, వీవీప్యాట్‌ల ద్వారా పారదర్శకత తెచ్చిందని వాళ్లకు నేనే చెప్పా.

వాట్సాప్‌ వీడియో సందేశం చూసి  కలెక్టర్‌ను అప్రమత్తం చేశా
ఈ నెల పదో తేదీన నాకు వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. పీలేరులో 273 నెంబరు బూత్‌కు సంబంధించిన ఒక ఈవీఎంను బయట పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులతో ఉన్న అసలు బ్యాలెట్‌ పేపర్‌ను దానికి అతికించి ఓట్లు వేసే ప్రక్రియను ప్రదర్శించారు. ఈ ప్రక్రియలో నేను ప్రధానంగా గమనించింది. వీవీప్యాట్‌లో లోపం. దానిలో స్లిప్‌ ప్రింటవుతూ. నెమ్మదిగా కిందకు జారుతూ రావడానికి బదులుగా ఒక్కసారిగా లైట్‌లాగా వెలిగి, అప్పటికే ప్రింటయిన స్లిప్‌ కనిపించింది. అది కూడా 3 సెకన్లలోనే మాయమైంది. అది కిందకు పడిందో లేదో అర్ధంకాని పరిస్థితి. అదే రోజు రాత్రి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నకు ఫోన్‌ చేసి విషయం చెప్పా. ఆయన బెల్‌ ఇంజినీర్లతో మాట్లాడారు. 3 సెకన్లు కనిపించినా ఫర్వాలేదని, ప్రొసీడ్‌ అవ్వమని వారి నుంచి కలెక్టర్‌కు సమాధానం వచ్చింది. కలెక్టరు మళ్లీ నాకు ఫోన్‌ చేసి మీకు అనుమానం ఉంటే ఆ ఒక్క మెషీన్‌ తీసేద్దామని చెప్పారు. సమస్య ఒక్క మెషీన్‌ తీసేయడం గురించి కాదనీ, 3 సెకన్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నా. మాక్‌ పోలింగ్‌ సమయంలో ఇలాంటి తేడాలు కనిపిస్తే నమోదు చేయాల్సిందిగా పోలింగ్‌ ఏజెంట్లకు సూచించాలని కొందరు తెదేపా నాయకులకు చెప్పా.

7 రాష్ట్రాల నుంచి ఈవీఎంలను వెనక్కుపిలిపించింది అందుకేనా?
ఈవీఎంలను పోలింగ్‌ కోసం వినియోగించే ముందు జిల్లాల్లోని గోదాముల నుంచి బయటకు తీసి ఇంజినీర్లు శుభ్రం చేస్తారు. ఆ సందర్భంగా మాక్‌పోల్‌ నిర్వహిస్తారు. దీన్ని మొదటి దశ చెకింగ్‌ అంటారు. ఆ సందర్భంలో ఇంజినీర్లకు కోడ్‌ మారిన విషయం తెలియదా? తెలిసీ ఊరుకున్నారా?అనేది ఈసీ చెప్పాలి. 2018 నవంబరు మొదటి వారంలో ఏడు రాష్ట్రాల నుంచి మొత్తం ఈవీఎంలను ఈసీ వెనక్కు రప్పించుకుంది. ఈవీఎంలకు అల్యూమినియం కవర్లకు బదులు, స్టీల్‌ కవర్లు ఏర్పాటు చేయమని సాంకేతిక సలహా కమిటీ చెప్పిందని అందుకే వెనక్కు రప్పించామని కారణం చెప్పారు. దీనిపై రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చారో లేదో తెలీదు. ఈసీ చెబుతున్న కారణం హేతుబద్ధంగా లేదు.

వాళ్లే మిషన్‌ ఇచ్చారు... పైగా నాపై కేసు పెట్టారు
2004లో చంద్రబాబు ఓడిపోతారని మేము ఊహించలేదు. ఆ తర్వాత నేను ఈవీఎం వంటి ఒక నమూనా యంత్రం రూపొందించి చంద్రబాబును కలసి ఈవీఎంను ఎవరైనా హ్యాక్‌ చేయవచ్చని చెప్పా. ఆయన ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్పి ఊరుకున్నారు. 2009లోనూ ఆయన ఓడిపోయాక.. ఈవీఎంలను హ్యాక్‌ చేయగలగడం నిజమే అయితే, దానిలో పారదర్శకత లేకపోతే ఆందోళన తెలియజేద్దామని చెప్పారు. ఈవీఎంలు ఎలా హ్యాక్‌ చేయవచ్చో దిల్లీ ప్రెస్‌క్లబ్‌లో చూపించాం. దానిలో నిజముంటే తమను కలసి చూపించాలని ఈసీ నన్ను సవాల్‌ చేసింది. సుబ్రమణ్యస్వామి తదితరులం వెళ్లాం. నేను వివరిస్తూండగానే మధ్యలో మమ్మల్ని ఆపేసి పంపించేశారు. దానిపై సుబ్రమణ్యస్వామి విలేకరుల సమావేశం పెట్టి ఈసీ వైఖరిని తప్పుబట్టారు. ఆ తర్వాత ఈసీ అధికారే ఒకరు ఒక ఈవీఎంను తెచ్చారు. ఇది వరకు నేను తయారు చేసిన యంత్రాలతో హ్యాకింగ్‌ సాధ్యమేనని చూపించానని, ఇప్పుడు వాళ్ల యంత్రంతో చూపించమని అడిగారు. ఒక రాత్రిలోనే ఆ మెషీన్‌ను హ్యాక్‌ చేసి చూపించా. ఆ మొత్తం ప్రక్రియను వీడియో తీశాం. అది ఈసీకి సంబంధించిన ఈవీఎం అనడానికి రుజువుగా దాని నెంబరు చిత్రీకరించాం. ఆ తర్వాత ఆ మెషీన్‌ వాళ్లకు ఇచ్చేశా. తర్వాత ఆ వీడియోను ఒక టీవీ ఛానల్లో ప్రదర్శించాం. నేను చూపించిన నెంబరు ఆధారంగా అది ముంబయిలోని ఒక ప్రాంతంలోని మెషీన్‌ అని, దాన్ని నేను కొట్టేశానని నాపై దొంగతనం నేరం మోపి, ఈసీ కేసు పెట్టింది. నా దగ్గర మెషీన్‌ లేదు. నాకు ఇచ్చిన వ్యక్తికే దాన్ని ఇచ్చేశానని చెప్పా. అలాంటి మెషీన్లు బోలెడు పోయాయని తర్వాత గుర్తించారు. నన్ను 8 రోజులు జైల్లో కూర్చోబెట్టారు. బెయిల్‌పై బయటకు వచ్చా. ఆ సందర్భంలో జడ్జి.... నేను చెప్పింది తప్పయితే జైల్లో పెట్టమని, నిజమైతే రివార్డు ఇచ్చి మెచ్చుకోండని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నేను చేసిన పనికి గుర్తింపుగా... ఈఎఫ్‌ఎఫ్‌ అనే అంతర్జాతీయ సివిల్‌ లిబర్టీస్‌ ఫోరం నాకు 2010 సంవత్సరానికి ‘పయనీర్‌’ అవార్డు ఇచ్చి సత్కరించింది. నా ట్విటర్‌ను అనుసరించే వారిలో మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఖురేషీ కూడా ఉన్నారు.

ఇలా అయితే కోడ్‌ మారినట్టా? కాదా?

11వ తేదీన ఉదయమే పోలింగ్‌ మొదలైంది. ఎక్కడికక్కడ ఈవీఎంలు మొరాయించాయి. వీవీప్యాట్‌లలో స్లిప్‌ రెండు మూడు సెకన్లే కనిపిస్తోందని కొందరు ఓటర్లు వీడియోలు తీసి పంపించారు. విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి ట్విటర్‌లో సందేశం పెట్టా. ఈసీ నుంచి స్పందన లేదు. వీవీప్యాట్‌లో స్లిప్‌ 7 సెకన్లు కనిపించేలా కోడ్‌ రాసినప్పుడు, స్లిప్‌ 3 సెకన్లే కనిపిస్తుంటే  కోడ్‌ మారినట్టా కాదా? మనం 7 గంటలకు అలారం పెట్టుకుంటే, అది 3 గంటలకే మోగితే ఎవరో వచ్చి మార్చారనే కదా?

వీవీప్యాట్‌లను హ్యాక్‌ చేయవచ్చు

14ap-main3c_1.jpg

వీవీప్యాట్‌లను తెచ్చినప్పుడు... భద్రతాపరమైన లోపాలున్నాయి, సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకోండి అని సలహా ఇచ్చా. భద్రతా ఉల్లంఘన జరిగిందని ఈ ఎన్నికల్లో రుజువైంది. ఈవీఎంలలో ర్యాండమైజేషన్‌ అని ఒక పద్ధతి అనుసరిస్తారు. వాటిని గోదాము నుంచి బయటకు తీశాక ర్యాండమైజేషన్‌ విధానంలో ఏ నియోజకవర్గానికి ఏ లాట్‌ వెళ్లాలో నిర్ణయిస్తారు. ఈవీఎంలు నియోజకవర్గానికి వెళ్లాక ఏ బూత్‌కు ఏ మెషీన్లు వెళ్లాలో రెండో అంచె ర్యాండమైజేషన్‌లో నిర్ణయిస్తారు. ఏ మెషీన్‌ ఏ బూత్‌కు వెళుతుందో, అక్కడి అభ్యర్థుల సంఖ్య ఎంతో, ఏ గుర్తు ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి హ్యాక్‌ చేయడం కష్టం కదా? అన్నది ఈసీ వాదన. కానీ వీవీప్యాట్‌ల ర్యాండమైజేషనే పెద్ద ఫార్స్‌గా మారింది. ప్రధాన పార్టీల చిహ్నాలు శాశ్వతం. అవి మారవు. ఇప్పుడు వినియోగిస్తున్న ఎం3 మోడల్‌లో బ్యాలెట్‌ యూనిట్‌ వీవీప్యాట్‌కు, వీవీప్యాట్‌ కంట్రోల్‌ యూనిట్‌కు అనుసంధానమై ఉంటుంది. ఓటరు బ్యాలెట్‌ యూనిట్‌లో బటన్‌ నొక్కితే ఓటు మొదట వీవీప్యాట్‌కి వెళుతుంది. ఈ ఓటు ఫలానా గుర్తుకు రాసుకో అని అది కంట్రోల్‌ యూనిట్‌లో ఉన్న మెమొరీకి చెబుతుంది. అంటే వీవీప్యాట్‌ను మన నియంత్రణలోకి తీసుకుంటే అడ్డగోలుగా హ్యాక్‌ చేయవచ్చు. ఓటరు ఎవరికి ఓటు వేసినా అది మనం కావాలనుకున్న వారికి వెళ్లేలా చేయవచ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...