Jump to content

RK Kothhapaluku


RKumar

Recommended Posts

పోటెత్తిన ఓటు చెప్పే పాఠం!
14-04-2019 00:15:48
 
636907977566774146.jpg
తెలంగాణలో అమలు చేసిన రైతుబంధు, పింఛన్లు వంటి పథకాలకే కేసీఆర్‌కు అద్భుత విజయం దక్కిందని గ్రహించిన చంద్రబాబు తన బుర్రకు పదునుపెట్టారు. ఫలితంగా పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వంతున పసుపు–కుంకుమ కింద అందజేశారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిపొందినవారి సంఖ్య కోటిన్నరగా ఉంది. తాజా ఎన్నికలలో ఈ రెండు పథకాల ప్రభావం కూడా అధికంగా కనపడింది. తెలంగాణలో రైతుబంధు పథకానికి ఎంతటి ప్రచారం లభించిందో ఆంధ్రప్రదేశ్‌లో పసుపు–కుంకుమ పథకానికి కూడా అంతటి ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతోపాటు, రాష్ట్రానికి ఏదో కీడు జరగబోతోందని భావించిన వర్గాలన్నీ చంద్రబాబువైపు చేరినట్టుగా ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టమవుతోంది.
 
తాను ఓడిపోతే పోలవరం నిర్మాణం, రాజధాని అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడా ప్రజలను ప్రభావితం చేసింది. తాను అధికారంలోకి వస్తే పోలవరం, రాజధాని నిర్మాణం అంతకంటే వేగంగా చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోలేకపోయారు. చంద్రబాబుకంటే మంచి పాలన, సమర్థ పాలన తాను ఎలా అందిస్తానో వివరించడంలో జగన్‌ ఆసక్తిచూపలేదు. ‘ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి’ అని కలవరించడమేగానీ తటస్థులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను జగన్మోహన్‌ రెడ్డి చేయలేదు. అలాంటప్పుడు, ఇప్పటికే సంక్షేమ ఫలాలను అందుకుంటున్న వారికి ‘ఎవరో అధికారంలోకి వస్తే ఇంకేదో జరుగుతుందన్న ప్రచారంపై ఆసక్తి ఎందుకు ఉంటుంది?’ 

ADVERTISEMENT

 
 
 
గతంలో ఎన్నడూ లేనివిధంగా, చూడని విధంగా రాజకీయపుటెత్తులు, రణతంత్రపు జిత్తులతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్ర ప్రజలకు నిబద్ధత లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కించపరిచినట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఓటర్లు మాత్రం అంతులేని సహనంతో అర్ధరాత్రి వరకు నిరీక్షించి మరీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్‌ కమిషన్‌ ఘోరాతిఘోరంగా విఫలమైంది. దేశచరిత్రలోనే మొదటిసారిగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం వింత పరిణామం మాత్రమే కాదు... ప్రజల చైతన్యానికి నిదర్శనం కూడా! ఓటింగ్‌ మిషన్లు పదేపదే మొరాయించినా ఓటర్లు మాత్రం క్యూలైన్లలోనే నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకునే ఇళ్లకు వెళ్లారు. హైదరాబాద్‌లో నివసిస్తూ ఆంధ్రాలో ఓటుహక్కు కలిగి ఉన్నవారు వేలు, లక్షల సంఖ్యలో ఏ వాహనం దొరికితే ఆ వాహనం ఎక్కి మరీ వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. సీమాంధ్రులలో ఇంతటి చైతన్యం, పట్టుదల రావడానికి కారణమేంటి? అన్నది పరిశీలిద్దాం!
 
ఏపీ ఓటరు ఎవరి వైపు!
సంకుల సమరంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రజలు రెండు శిబిరాలుగా విడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించడానికై రాజకీయ ప్రత్యర్థులందరూ ఏకం అయ్యారన్న భావన ఏపీ ప్రజల్లో బలంగా వ్యాపించింది. చంద్రబాబు ఓడిపోతే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందనీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి గెలిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుందన్న భయం కూడా ప్రజలలో నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ను గెలిపించుకోవాలన్న పట్టుదల, కసి ప్రజలలో ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి ఏకమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెడుతున్నారన్న భావన కూడా ఓటర్లలో ఏర్పడినట్టుగా కనిపించింది. అదే సమయంలో చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ ఫలాలను అందుకున్నవారు కృతజ్ఞతా భావంతో పోలింగ్‌ కేంద్రాలకు పరుగులు తీశారు. ప్రత్యర్థులు తనను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించిన చంద్రబాబు జరుగుతున్న తంతును ప్రజలకు వివరించి నమ్మించడంలో సఫలీకృతులయ్యారు.
 
గతానికి భిన్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చివరలో శిరస్సు వంచి మరీ ప్రజలను అండగా నిలబడమని అర్థించారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరఫున విజయలక్ష్మి, షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టగా... తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు ఒక్కరే అంతా తానై నిలిచారు. దీంతో జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్నట్టుగా ‘ఒక్క చాన్స్‌ ఇద్దాం’ అనుకున్నవారు ఒకవైపు, ‘రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అని భావించినవారు మరోవైపు మోహరించారు. జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా రెడ్డి సామాజికవర్గం సంఘటితమై జగన్మోహన్‌ రెడ్డి వెనుక నిలబడగా, కమ్మ సామాజికవర్గంతోపాటు తటస్థులంతా చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. ఫలితంగా ఎన్నికల పోరు పరాకాష్ఠకు చేరడంతోపాటు పంతాలు– పట్టింపులు కూడా ఇరువర్గాలలో పెరిగాయి.
 
md-sir-main%20aaa.jpgపోలింగ్‌ పూర్తి అయ్యిందో లేదో ‘గెలిచేశాం, అన్ని సీట్లు.. ఇన్ని సీట్లు’ అంటూ వైసీపీ నాయకులు సంబరాలు చేసుకోవడంతోపాటు పందాలకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైన అంతులేని వ్యతిరేకత ఉందని నమ్మి, అందుకు అనుగుణంగా ప్రచారంచేసిన వైసీపీ వర్గాలు చంద్రబాబును గద్దె దించడానికై ప్రజలు దండయాత్రగా పోలింగ్‌ కేంద్రాలకు దౌడు తీశారని భావిస్తున్నాయి. ఈ కారణంగానే వారిలో గెలుపుపై భరోసా పెరిగింది. దీంతో తెలుగుదేశం వర్గాలతోపాటు వారికి అండగా నిలబడిన తటస్థులలో కించిత్‌ భయం నెలకొన్నది.
 
జనం మాటేమిటి?
ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగివుంటుంది? క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటి? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం! ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోయి అరాచక పరిస్థితులు నెలకొన్నాయని కొంతకాలంగా జగన్‌ అండ్‌ కో చేస్తూ వచ్చిన ప్రచారంతో నిజమే కాబోలు అని చాలామంది భావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలలో సానుకూలత ఉన్నట్టుగా ఏపీలో చంద్రబాబుపై అదేస్థాయిలో వ్యతిరేకత ఉందని ఇంటా–బయటా జరిగిన ప్రచారంతో వాస్తవం మరుగున పడిపోయింది. జగన్మోహన్‌ రెడ్డి సొంత మీడియాతోపాటు చంద్రబాబుతో రాజకీయ విభేదాలు తలెత్తడంతో భారతీయ జనతాపార్టీ నాయకులు సహా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఈ ప్రచారానికి స్వరం కలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే ప్రచారం జరగడంతో జాతీయ మీడియా సైతం అదే ప్రభావానికి లోనైంది.
 
‘ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభంజనం’ అంటూ ప్రచారం చేశాయి. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా గిట్టనివారు సైతం ఇదే ప్రచారం చేస్తూ వచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు ఆంధ్రా ముఖ్యులు కూడా ఈ విషయంలో జగన్‌తో చేతులు కలిపారు. గతంలో అభ్యుదయ భావాలున్న వారుగా ప్రచారం పొందినవారిలో కూడా కులతత్వం ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా కరాళనృత్యం చేయడం మొదలెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదవీ విరమణ చేసిన ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా తోడయ్యారు. చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా ఈ శక్తులన్నీ చేతులు కలిపి ప్రజల్లో ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేశాయి. ప్రత్యర్థులు అలుపెరగకుండా సాగించిన ఈ ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కూడా ఒక దశలో ఆత్మస్థ్యైర్యం సన్నగిల్లింది. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచార సభలకు వచ్చినవారిని చూసి చంద్రబాబు పనైపోయిందని పలువురు భావించారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయిందంటూ సర్వేలను ఉటంకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ చేస్తూ వచ్చిన ప్రకటనలు కూడా జతకలిశాయి. ఈ ప్రచార ఉధృతికి ప్రజలు కూడా ప్రభావితం కావాలి. కానీ, పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అలా జరిగినట్టు కనిపించడం లేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వచ్చిన చంద్రబాబు కూడా వ్యూహాలను మార్చుకుని, ప్రత్యర్థులపై విరుచుకుపడటం మొదలెట్టారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటున్న వారు రాష్ట్రానికి నష్టం చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఉధృతం చేశారు.
 
ఈ ప్రచారాన్ని ప్రజలు కూడా విశ్వసించారు. దీంతో రిటర్న్‌ గిఫ్ట్‌ పేరిట ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని ప్రకటించిన కేసీఆర్‌ గమ్మున ఉండిపోయారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేస్తానని ప్రకటించిన మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా చంద్రబాబు చేసుకోగలిగారు. జగన్మోహన్‌ రెడ్డి కోసం ప్రధానమంత్రి తనను ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు చేసిన ప్రచారం కూడా ప్రజలపై ప్రభావం చూపింది. ఫలితంగా చంద్రబాబుపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దాడిని రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా విద్యావంతులు, తటస్థులు భావించడం మొదలెట్టారు. పోలింగ్‌ ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా ఈ వర్గం ఓటర్లు మాత్రం ఉదయం ఆరు గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రాబోయే ఫలితాలకు ఇదొక సంకేతం! తెలంగాణ ప్రజలు తమ తీర్పు ద్వారా చంద్రబాబుకు జ్ఞానోపదేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికలలో కేసీఆర్‌ను దీవిస్తూ ప్రజలెందుకు తీర్పు ఇచ్చారో చంద్రబాబుకు స్పష్టంగా బోధపడింది. తెలంగాణలో అమలు చేసిన రైతుబంధు, పింఛన్లు వంటి పథకాలకే కేసీఆర్‌కు అద్భుత విజయం దక్కిందని గ్రహించిన చంద్రబాబు తన బుర్రకు పదునుపెట్టారు. ఫలితంగా పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వంతున పసుపు–కుంకుమ కింద అందజేశారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిపొందినవారి సంఖ్య కోటిన్నరగా ఉంది. తాజా ఎన్నికలలో ఈ రెండు పథకాల ప్రభావం కూడా అధికంగా కనపడింది.
 
తెలంగాణలో రైతుబంధు పథకానికి ఎంతటి ప్రచారం లభించిందో ఆంధ్రప్రదేశ్‌లో పసుపు–కుంకుమ పథకానికి కూడా అంతటి ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతోపాటు, రాష్ట్రానికి ఏదో కీడు జరగబోతోందని భావించిన వర్గాలన్నీ చంద్రబాబువైపు చేరినట్టుగా ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ అండ్‌ కో ప్రచారం చేసినట్లుగా వ్యతిరేకత లేకపోవడంతో ఈ పర్యాయం కూడా జగన్మోహన్‌ రెడ్డికి నిరాశ తప్పదన్న అభిప్రాయం ఉంది. జగన్‌ అధికారంలోకి వచ్చినట్టేనని ఆయన వీరాభిమానులు గోలగోలగా చేస్తూ వచ్చిన ప్రచారం కూడా తటస్థులను ఆలోచనలో పడేసింది. జగన్‌ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందన్న భయం ఒక వర్గం ప్రజలలో ఏర్పడటానికి ఈ ప్రచారమే కారణం. తాను ఓడిపోతే పోలవరం నిర్మాణం, రాజధాని అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడా ప్రజలను ప్రభావితం చేసింది. తాను అధికారంలోకి వస్తే పోలవరం, రాజధాని నిర్మాణం అంతకంటే వేగంగా చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోలేకపోయారు. తాను ముఖ్యమంత్రి అయిపోయినట్టేనని బలంగా నమ్ముతున్న జగన్‌ అమరావతి గురించి మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. తాను ప్రకటించిన ‘నవరత్నాలు’ చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్‌ అండ్‌ కో విశ్వసించడం వల్ల చంద్రబాబు చేసిన ప్రచారాన్ని వారు పట్టించుకోలేదు.
 
చంద్రబాబుకంటే మంచి పాలన, సమర్థ పాలన తాను ఎలా అందిస్తానో వివరించడంలో జగన్‌ ఆసక్తిచూపలేదు. ‘ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి’ అని కలవరించడమేగానీ తటస్థులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను జగన్మోహన్‌ రెడ్డి చేయలేదు. అలాంటప్పుడు, ఇప్పటికే సంక్షేమ ఫలాలను అందుకుంటున్న వారికి ‘ఎవరో అధికారంలోకి వస్తే ఇంకేదో జరుగుతుందన్న ప్రచారంపై ఆసక్తి ఎందుకు ఉంటుంది?’ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందిన ప్రజలు.. కాంగ్రెస్‌ పార్టీ అంతకంటే ఎక్కువగా మేలుచేస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే జరగబోతోందని పోలింగ్‌ సరళి స్పష్టంచేస్తోంది. చంద్రబాబు పట్ల ప్రచారంలో ఉన్నట్టుగా వ్యతిరేకత లేదని క్షేత్రస్థాయిలో పర్యటించిన వారికి మాత్రమే తెలుస్తోంది. చంద్రబాబుపై నిజంగా వ్యతిరేకత ఆ స్థాయిలో ఉండి ఉంటే తనకు ఒక్క చాన్స్‌ ఇవ్వవలసిందిగా జగన్మోహన్‌ రెడ్డి వేడుకోవలసిన అవసరం ఉండదు కదా? దీన్నిబట్టి పోలింగ్‌ సరళి తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పోలింగ్‌ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టేనన్న సిద్ధాంతానికి కాలదోషం పట్టింది.
 
ఓటింగ్‌ మిషన్లు గంటల తరబడి మొరాయించడంతో తిరిగి వెళ్లిపోయిన ఓటర్లు కూడా మధ్యాహ్న సమయంలో చంద్రబాబు చేసిన విజ్ఞప్తితో మళ్లీ పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, మహిళలు గంటలకొద్దీ నిరీక్షించి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరముందా? అని ప్రశ్నించుకుంటే.. లేదనే సమాధానమే లభిస్తోంది. అర్ధరాత్రి దాటినా పోలింగ్‌ కేంద్రాలను వదలకుండా చంద్రబాబుపై కసి తీర్చుకోవాల్సిన అవసరం వృద్ధులు, మహిళలకు ఎందుకుంటుంది? హైదరాబాద్‌ నుంచి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు అష్టకష్టాలు పడి స్వగ్రామాలకు వెళ్లి ఓటువేశారు. చంద్రబాబును ఓడించి తీరాలన్న పంతం హైదరాబాద్‌లో నివసిస్తున్నవారికి ఎందుకుంటుంది? వ్యయప్రయాసలకోర్చి అంతదూరం ఎందుకు వెళతారు? వృద్ధులు, మహిళలు కృతజ్ఞతాభావాన్ని చాటుకోవడానికే తమ ఇబ్బందులను అధిగమించి ఓటింగ్‌లో పాల్గొన్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. గతానికి భిన్నంగా విద్యావంతులు, తటస్థులు కూడా భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రహసనంగా మారినా ప్రజలు సహనాన్ని కోల్పోకుండా తాము ఎవరిని బలపరచాలనుకున్నారో వారినే బలపరిచారు.
 
జగన్మోహన్‌ రెడ్డి మద్దతుదారులను మినహాయిస్తే, మిగతా ప్రజల దృష్టిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ప్రతినాయకులు. వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్టుగా ఎన్నికలు జరిగాయని జగన్మోహన్‌ రెడ్డి తాజాగా ప్రకటించారు. నిజమే ఓటర్లు వన్‌ సైడ్‌గానే తీర్పు ఇచ్చారు. ఆ వన్‌ సైడ్‌ ఎటువైపు అన్నది తేలాలంటే మరో 40 రోజులు వేచిచూడాలి. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అన్న జగన్మోహన్‌ రెడ్డి విజ్ఞప్తికి ప్రజలు ఆకర్షితులైతే తప్ప ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ఇక చంద్రబాబును ఓడించి కక్ష తీర్చుకోవాలన్న భారతీయ జనతా పార్టీ నాయకుల కోర్కె నెరవేరుతుందా? అంటే అనుమానమే! నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు– ఎదుటివాడికి రెండు కళ్లు పోవాలన్నట్టుగా ఏపీలో భారతీయ జనతాపార్టీ పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పాలిట ఎవరు విలన్లు? ఎవరు హీరోలు? అన్నది ఓట్ల లెక్కింపు తర్వాత తేలుతుంది. అప్పటివరకు ఎవరి ఊహల్లో వారు ఊరేగవచ్చు.
 
విజయ సాయిరెడ్డి ‘క్రిమినాలజీ’...
ఈ విషయం అలా ఉంచితే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలి రోజుల్లో నన్ను విమర్శించడంతోపాటు అడ్డమైన ఆరోపణలు చేశారు. గతంలో నన్ను రెండు పర్యాయాలు కలిసిన విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు చూసి ఆయన సాత్వికుడు అని భావించాను. ప్రస్తుతం ఆయన ప్రవర్తన చూసిన తర్వాత ఆర్థిక నేరాలకు దర్శకత్వం వహించడంలోనే కాదు– క్రిమినాలజీ విషయంలో కూడా ఆయన దిట్ట అన్న భావన కలుగుతోంది. దందాలు, సెటిల్‌మెంట్లు, మేళ్లు చేయడం ద్వారా పర్సంటేజీలు అందుకున్నట్టు అభియోగాలున్న విజయసాయి రెడ్డి తన దారిలోనే అందరూ నడుస్తారని భావిస్తున్నట్టుగా ఉంది. అధికారంలోకి రాకముందే విజయసాయి రెడ్డి ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటే.. గ్రహచారం కొద్దీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
 
గతంలో నన్ను జైలుకు పంపుతానన్న గాలి జనార్ధన్‌ రెడ్డి తానే జైలుకు వెళ్లాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా నన్ను జైలుకు పంపుతానని చెబుతున్నారంటే ఆయనకు మళ్లీ జైలుయోగం ఉన్నట్టుంది. తమ దారిలోకి రావడం లేదన్న కక్షతో మీడియాకు కులాన్ని ఆపాదించే దుస్సాహసాన్ని కూడా విజయసాయి రెడ్డి చేశారు. కుడి ఎడమల ఎటు చూసినా రెడ్డి సామాజికవర్గం వారే ఉండే జగన్‌ మీడియాకు నిధులు సమకూర్చిపెట్టిన విజయసాయి రెడ్డి... కులం గురించి మాట్లాడటమా? మురుగుకాల్వలో పొర్లాడే వరాహం తన ముందు తిరిగే మనుషులను చూసి ‘వాళ్లేమిటి అంత మురికిగా ఉన్నారు’ అని భావిస్తుందట! కులతత్వం విషయంలో విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఈ కోవలోకే వస్తాయి.
Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Get well soon.

3 idiots lo Ameer Khan "All is well" laa nuvvu kuda BP raise ayinappudalla "Get well soon" anukuntaava dude.

Aavesapadaku ekkuva. Taggipoddhi le

Link to comment
Share on other sites

1 minute ago, KingV said:

Ee comment choosaka innallu nee gurunchi emi anukokapoyina ippudu ikkada anta pedda topu anukuntunnaru brother

Dude tamaru naaku baamardaa? Nuvvu ani ekavachanam tho calling

Link to comment
Share on other sites

4 minutes ago, LION_NTR said:

Aa article lo meeku antha offend ayye content emi kanipinchindi? 🧐

Aayana first thread title " Broker Rk" pettaadu. Taruvata teesesaadu

Daaniki annaanu. Tanani adagandi .. thread title lo Broker RK ani pettatam lo udhdhesam ento. Nannu adigite nenu EMI cheptaanu.

Pettindi tanayite.

 

Link to comment
Share on other sites

5 minutes ago, JVC said:

3 idiots lo Ameer Khan "All is well" laa nuvvu kuda BP raise ayinappudalla "Get well soon" anukuntaava dude.

Aavesapadaku ekkuva. Taggipoddhi le

Neekunnada?

US Keyboard batch digindi.

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Neekunnada?

US Keyboard batch digindi.

India lo ayina ade keyboard use chestaru dude.

 

Paina okaayana "Broker Rk" anatam lo uddhesam enti ani adugutunnadu.

Answer anta cheppu dude.

Pratodu comment chese vaade ABN ni, Rk ni ainadaaniki kaani daaniki. Ee kukka edupulu ento

Link to comment
Share on other sites

13 minutes ago, JVC said:

Aayana first thread title " Broker Rk" pettaadu. Taruvata teesesaadu

Daaniki annaanu. Tanani adagandi .. thread title lo Broker RK ani pettatam lo udhdhesam ento. Nannu adigite nenu EMI cheptaanu.

Pettindi tanayite.

 

Oh.....hmmmm....got it

Link to comment
Share on other sites

13 minutes ago, JVC said:

Aayana first thread title " Broker Rk" pettaadu. Taruvata teesesaadu

Daaniki annaanu. Tanani adagandi .. thread title lo Broker RK ani pettatam lo udhdhesam ento. Nannu adigite nenu EMI cheptaanu.

Pettindi tanayite.

 

Ohh..now I get it.🤝

hmm..AJ RK kooda mana side lekapothe..asalu news open kooda cheyyalemu. Tanani Broker anadam ..its not in good humor.

hope everyone in this DB restrain from abusing him.

Link to comment
Share on other sites

52 minutes ago, RKumar said:

Andhra Jyothi RK broker kaake inkemiti.

KCR ki kooda baaka kottinodu oka time lo. Jagan power loki vasthe aadiki kooda kodathaadu baaka.

 

JVC garu meeru kuda entandi edi chaia petty one.Leave it

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:

Andhra Jyothi RK broker kaake inkemiti.

KCR ki kooda baaka kottinodu oka time lo. Jagan power loki vasthe aadiki kooda kodathaadu baaka.

 

ABN RK kuda nilaage freelancer emo le. Neeku nachaka pothe nirmohamatam ga chepthavu kadha....

 

By the way on the second guess (for fun) I am hoping you (RKumar) are not the pen name of ABN RK.

Link to comment
Share on other sites

11 minutes ago, JAYAM_NANI said:

ABN RK kuda nilaage freelancer emo le. Neeku nachaka pothe nirmohamatam ga chepthavu kadha....

 

By the way on the second guess (for fun) I am hoping you (RKumar) are not the pen name of ABN RK.

Good Joke.

Link to comment
Share on other sites

1 hour ago, vinayak said:

Can you explain few points why you came to that conclusion.also provide me which media is independent?

@vinayakDude motham posts chadavali.

Nenu ABN RK ni kaadu broker annadi.

Ee Thread Statrer RK ni.

Endukante thread start chesinappudu title lo "Broker Rk" ani pettadu. Daaniki counter gaa annaanu. Taruvata thread title nunchi "broker" ane word ni teesesaadu.

 

 

Link to comment
Share on other sites

41 minutes ago, JVC said:

@vinayakDude motham posts chadavali.

Nenu ABN RK ni kaadu broker annadi.

Ee Thread Statrer RK ni.

Endukante thread start chesinappudu title lo "Broker Rk" ani pettadu. Daaniki counter gaa annaanu. Taruvata thread title nunchi "broker" ane word ni teesesaadu.

 

 

Andharu movie starting chudaledhu, so ee confusion...

Link to comment
Share on other sites

47 minutes ago, JVC said:

@vinayakDude motham posts chadavali.

Nenu ABN RK ni kaadu broker annadi.

Ee Thread Statrer RK ni.

Endukante thread start chesinappudu title lo "Broker Rk" ani pettadu. Daaniki counter gaa annaanu. Taruvata thread title nunchi "broker" ane word ni teesesaadu.

 

 

Nee kastam thread starter ki kooda rakudadhu bro 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...