Jump to content

విశాఖలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. జేడీకి కలిసొచ్చేనా?


Palnadu

Recommended Posts

విశాఖలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. జేడీకి కలిసొచ్చేనా?

 

శాఖపట్నం: విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా నమోదైనట్టు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీని పరిధిలోని గాజువాక శాసనసభ స్థానం నుంచి బరిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ మినహా మిగిలిన స్థానాల్లోనివారు బలహీనంగానే ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు వారు వ్యక్తిగతంగా పెద్దగా తెలిసినవారు కాకపోవడంతో అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. పైగా తెదేపా, వైకాపా అభ్యర్థులు అన్ని విధాలుగా బలవంతులు. అయినా ఇరు పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ భారీగానే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని తేల్చి చెప్పారు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని వందరూపాయల బాండ్‌ పేపర్‌పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. నగరంలో ఉంటున్న ఇతరరాష్ట్రాల ఓటర్లతో వారివారి భాషల్లో మాట్లాడడం కూడా ఆయనకు కలిసివచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష్మీనారాయణ పెద్దగా తెలియరని కొంతమంది భావించినా.. అక్కడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు స్పష్టమవుతోంది. మరోపక్క తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌ కూడా గట్టి పోటీనిచ్చారు. ఈయన తరఫున పలువురు దిగ్గజ నేతలు ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో తెదేపా బలంగా ఉండడం, ఎమ్మెల్యేలందరూ పూర్తిస్థాయిలో సహకరించడం భరత్‌కు కలిసొచ్చిన అంశాలు. భాజపా తరపున బరిలోకి దిగిన పురందేశ్వరి తనవంతు ప్రయత్నాన్ని చేశారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...