Jump to content

polling


Recommended Posts

21:40(IST)
ఒంగోలులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అధికారి  
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలులోని 33వ కేంద్రంలో పోలింగ్‌ అధికారి సీల్‌ వేయకుండా ఈవీఎంను తరలించారంటూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఏజెంట్లకు ఫారం 17 ఇచ్చేందుకు నిరాకరించారు. 

Link to comment
Share on other sites

21:45(IST)
అర్ధరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగే అవకాశం: ద్వివేది
అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్‌ 80 శాతానికి చేరువలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నిర్దేశిత సమయం ముగిశాక 6 వేల కేంద్రాలకు పైగా పోలింగ్ కొనసాగినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కేంద్రాల్లో పోలింగ్‌ ఇంకా కొనసాగుతోంది.

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సిబ్బంది పొరపాటుతో మాక్ పోల్ ఓట్లను తొలగించకుండానే పోలింగ్ ప్రారంభించారని అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. మాక్ పోల్‌లో నమోదైన ఓట్లను మినహాయించడమా? లేదా రీ పోలింగ్ చేయడమో తేల్చాలని అధికారులు కోరినట్లు తెలిసింది.

 

https://www.andhrajyothy.com/artical?SID=764721

Link to comment
Share on other sites

21:56(IST)
విశాఖ జిల్లా ఆర్‌. శివరామపురంలో ఘర్షణ
విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం ఆర్‌. శివరామపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడంతో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ధర్మశ్రీని పోలింగ్‌ కేంద్రం నుంచి పంపివేశారు.

Link to comment
Share on other sites

22:33(IST)
విజయవాడ ప్రసాదంపాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత
విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం ముగిసినా ఓటుకు అనుమతిస్తున్నారంటూ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తమ కార్యకర్తల పట్ల అతిగా ప్రవర్తించారంటూ పోలింగ్‌ కేంద్రం వద్ద వల్లభనేని వంశీ నిలదీశారు.

Link to comment
Share on other sites

22:42(IST)
తిరుపతిలోని రామానుజపల్లెలో ఉద్రిక్తత
తిరుపతి గ్రామీణ పరిధిలోని రామానుజపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ సమయం ముగిసినా ఓటు వేసేందుకు అనుమతించాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు.నిబంధనలు అనుమతించవని ఎన్నికల అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు అనుమతించాలని వైకాపా నేతలు పట్టుబడటంతో  పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.  దీంతో వైకాపా, తెదేపా అభ్యర్థులు చెవిరెడ్డి, నాని పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గాలు మోహరించాయి.  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

Link to comment
Share on other sites

22:52(IST)
ఈవీఎంల తరలింపును అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులోని 11వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చోటు చేసుకుంది. 50 ఓట్లు అధికంగా పోలయ్యాయని ఆరోపిస్తూ.. ఈవీఎం సామగ్రి తరలింపును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని తెదేపా వర్గీయులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. నలుగురు వైకాపా సానుభూతిపరులకు గాయాలయ్యాయి.

Link to comment
Share on other sites

22:56(IST)
గాజువాకలో జనసేన కార్యకర్తపై దాడి..పరిస్థితి విషమం
గాజువాక: విశాఖ జిల్లా గంగవరంలో అమ్మెరు అనే జనసేన కార్యకర్తపై వైకాపా నాయకులు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

23:10(IST)
నల్లచెరువు పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం తర్వాత వచ్చిన వారిని ఓట్లు వేసేందుకు అనుమతించారని, పోలింగ్‌ సిబ్బంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా కార్యకర్తలు అందోళనకు దిగారు. కలెక్టర్‌, ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్దకు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ చేరుకోవడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని అదుపు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

23:22(IST)
శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఘర్షణ
శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం నరేంద్రపురంలో ఘర్షణ జరిగింది. వైకాపా కార్యకర్తల దాడిలో తెదేపా వర్గీయులకు గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Link to comment
Share on other sites

23:30(IST)
చంద్రగిరి వైకాపా అభ్యర్థిపై కేసు నమోదు
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనపై హత్యాయత్నం చేశారంటూ  తెదేపా అభ్యర్థి నాని భార్య గానసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మలగుంట పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన సమయంలో  చెవిరెడ్డి, ఆయన అనుచరులు తనపై దాడి చేసి  కారు అద్దాలు బద్దలు ధ్వంసం చేశారని, సిబ్బందిని కూడా గాయపర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి  పోలీసులు కేసు నమోదు చేశారు. .

Link to comment
Share on other sites

23:34(IST)
మంగళగిరిలో ముగిసిన పోలింగ్‌.. స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంల తరలింపు
గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈవీఎంలను పోలింగ్‌ సిబ్బంది ఆచార్య నాగార్జున వర్సిటీలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తున్నారు. ఈ నియోజక వర్గ పరిధిలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. మంత్రి నారాలోకేశ్‌ స్వయంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

23:54(IST)
పాడేరులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌
విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు  ఉదయం పోలింగ్‌ ప్రక్రియ మొదలైన కొద్ది సేపటికే నియోజకవర్గంలో  చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో  పోలింగ్‌ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈవీఎంలను మార్చడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ఆలస్యంగా ముగిసింది. అనంతరం ఈవీఎంలను పోలింగ్‌ అధికారులు పాడేరులోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.

Link to comment
Share on other sites

00:04(IST)
తేలప్రోలు పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ
కృష్ణా జిల్లా ఉంగుటూరులోని తేలప్రోలు పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తెలుగు యువత నాయకుడు రాము తమ్ముడు సుదీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని చికిత్స నిమిత్తం గన్నవరం మండలం చిన్న అవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...