Jump to content

Imran Khan soft corner on Modi


Recommended Posts

ఇస్లామాబాద్ : భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భాజపా విజయం సాధిస్తే.. భారత్ -పాక్ మధ్య శాంతి చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పక్షంలో కశ్మీర్ పై ఒక సయోధ్యకు రావడం కష్టతరమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భాజపా విజయం వల్లే కశ్మీర్ అంశంలో ఇరు దేశాలు ఒక సయోధ్యకు రాగలవు’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఊహించలేదని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తరహాలోనే మోదీ కూడా ‘భయం, జాతీయత’ లాంటి అంశాల్ని ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అలాగే జమ్ముకశ్మీర్ ప్రజల ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తామన్న భాజపా హామీ కూడా ఆందోళన కలిగించే అంశమన్నారు.

పుల్వామా దాడి, అనంతర పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వైమానిక దాడులతో మోదీ విజయవకాశాలు మెరుగయ్యాయని నిపుణులు, పలు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ గెలుపునకు అవకాశాలు సన్నగిల్లితే పాక్ పై భారత్ మరోసారి సైనిక చర్యకు పాల్పడొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే పాక్ పై మరో దాడికి భారత్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Eenadu

https://www.eenadu.net/newsdetails/16/2019/04/10/81525/Imran-Khan-Sees-Better-Chance-Of-Peace-Talks-

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...