Jump to content

KAPU kaasthunna TDP in Andhra Pradesh


RKumar

Recommended Posts

కాపు కాస్తూ..

కాపుల దశాబ్దాల కల సాకారం
ఈడబ్ల్యూఎస్‌తో కాపులకు న్యాయం
ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్ల అమలు
కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.4,000 కోట్ల కేటాయింపు
ఈనాడు డిజిటల్‌- అమరావతి

24election9a_1.jpg

అసాధ్యమని అందరూ ఆ అంశాన్ని పక్కన పెట్టారు..
కానీ ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్లింది..
దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలిపోతూ వచ్చిన కాపుల రిజర్వేషన్‌ కల సాకారమైంది..
అందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి దారిదీపమైంది.
తెలుగుదేశం ప్రభుత్వం కాపుల జీవితాల్లో వెలుగులు నింపింది. దశాబ్దాలుగా నలిగిన సమస్యను పరిష్కరించింది. రిజర్వేషన్‌ కావాలన్న వారి కలను సాకారం చేయడం ద్వారా సర్కారు తన చిత్తశుద్ధిని చాటిచెప్పింది. చాకచక్యంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్‌లో ఐదు శాతాన్ని కాపులకు ప్రత్యేకించింది. రిజర్వేషన్‌తోనే సరిపెట్టకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసి రూ.వేల కోట్లతో నాలుగేళ్లలో దాదాపు 2.11 లక్షల మందికి రాయితీ రుణాలిచ్చింది.

దశాబ్దాల కల

కాపులను బీసీల్లో చేర్చి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అంశం దశాబ్దాల తరబడి చర్చల్లోనే నలిగింది. రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు స్వాతంత్య్రానంతరం ఆర్థికంగా, సామాజికంగా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయం ఉంది. ఈ అంశం సెంటిమెంటుగా మారింది. 1994లో కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేపట్టారు.

బ్రిటీష్‌ పాలనలో బీసీలే

1915లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బ్రిటిష్‌ ప్రభుత్వం కాపులను వెనుకబడిన తరగతులు(బీసీ)గా గుర్తించింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు వారిని బీసీ జాబితా నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ వారిని బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించినప్పటికీ సాంకేతిక కారణాలతో హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది.

కమిషన్‌తో కాలయాపన

2004లో అధికారాన్ని చేపట్టిన వైఎస్‌ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తి దాల్వాయి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నిర్వహణపరమైన అవసరాల కోసం ఈ కమిషన్‌కు అరకొర నిధులే విడుదల చేసింది. నివేదిక ఇవ్వకుండానే ఆ కమిషన్‌ కాలపరిమితి ముగిసింది. 2014 ఎన్నికల నాటికి అన్ని రాజకీయ పార్టీలకు ఇదో ప్రాధాన్యాంశంగా మారింది. కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని ‘మీకోసం’ పాదయాత్ర సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.

చిత్తశుద్ధికి నిదర్శనం..

2014లో అధికారంలోకొచ్చిన తెదేపా ప్రభుత్వం 2016 జనవరిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల అధ్యయనానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మంజునాథ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2017 డిసెంబరులో కమిషన్‌ తన నివేదిక సమర్పించింది. నివేదికపై కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాపుల్లో ఆర్థికంగా మాత్రమే కొంత వెనుకబాటుతనం ఉందని ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు తప్పకుండా ఇవ్వాలని కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు పేర్కొన్నారు. సభ్యుల సిఫారసులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్‌ కేటగిరి కింద వారిని బీసీ జాబితాలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో తీర్మానించి కేంద్రానికి పంపింది.

కేంద్రంపై పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న న్యాయస్థానం ఆదేశాలను బూచిగా చూపిస్తూ కేంద్రం కాలయాపన చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, బహిరంగ వేదికల నుంచి కేంద్రాన్ని నిలదీసింది. పలు దఫాలుగా పోరాటాన్ని కొనసాగించింది. తాజాగా అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 10శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాపులకు న్యాయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఉపయోగించుకుంది.  ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఇచ్చే 10 శాతంలో 5 శాతాన్ని కాపులకు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ వస్తే అమలు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో వెనువెంటనే శాసనసభలో బిల్లుపెట్టి ఆమోదం తీసుకుంది.

రూ.4000 కోట్లతో సంక్షేమానికి పెద్దపీట..

కాపులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దీనిద్వారా రూ. నాలుగువేల కోట్లను వారి సంక్షేమానికి వెచ్చించింది. కేవలం రాయితీ రుణాల మంజూరుకే పరిమితమవకుండా విదేశీ విద్య, ఉచితంగా సివిల్స్‌ శిక్షణ, సబ్సిడీపై కారు రుణాలు ఇవ్వడం, కాపు భవనాల నిర్మాణం వంటి కొత్త పథకాలనుకూడా అమలు చేస్తోంది.
* కాపు కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం గత నాలుగేళ్లలో 2.11 లక్షల మందికి రూ.1,441.75 కోట్ల రాయితీ రుణాలను మంజూరు చేసింది.
* ప్రభుత్వమే డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి కారు కొనుగోలుకు 284 మందికి రూ.21.30 కోట్ల సాయం అందించింది.
* విదేశీ విద్యా దీవెన పథకం కింద 1,892 మంది విద్యార్థులకు రూ.207 కోట్ల సాయాన్ని విడుదల చేసింది.
* మూడేళ్లలో 39,739 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ.28.73 కోట్లు ఖర్చు చేసింది.
* రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రూ.145.15 కోట్లతో 500 మినీ కాపు భవనాల నిర్మాణాన్ని చేపట్టింది.

కారుతో ఉపాధి లభించింది

24election9b_2.jpg

పాత కారు స్థానంలో కొత్త కారు కొనుక్కోవాలన్నది నా కల. చాలీచాలని ఆదాయంతో కొత్తది కొనడం కష్టమే అనుకున్నా. డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పథకం కింద కాపు కార్పొరేషన్‌ ద్వారా  ప్రభుత్వ సాయంతో కొత్త కారు కల నిజమైంది. రోజువారీ గిరాకీ కూడా పెరిగింది. అంతకు ముందు నెలకు రూ.30 వేల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య వస్తోంది. పెరిగిన ఆదాయం నా కుటుంబ అవసరాల్ని తీర్చుతోంది
- జూజుల వరప్రసాద్‌, గోకవరం మండలం, తూర్పుగోదావరి

ఆయనకు చేదోడుగా ఉంటున్నా

ద్యోగం కోసం ఎన్నో సార్లు ముఖాముఖి దశ వరకూ వెళ్లినా అవకాశం రాలేదు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఖర్చుతో కూడుకున్నది కావడంతో వెనుకడుగేశా. ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాక చీరల దుకాణం ప్రారంభించేందుకు రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకున్నా. రూ.లక్ష రాయితీతో రూ.రెండు లక్షల రుణం వచ్చింది. ఇప్పుడు సొంతంగా శారీ దుకాణం ప్రారంభించాం. నెలకు రూ.5 వేలు తక్కువ కాకుండా ఆదాయం వస్తోంది.
- జ్యోతి, గుణదల, విజయవాడ

డ్రైవర్‌ ఓనర్‌ అయ్యాడు

24election9c_1.jpg

ట్రాన్స్‌పోర్టు సంస్థలో పనిచేసేవాణ్ని. సొంతంగా కారు కొనుక్కొని నడపాలనుకున్నా డబ్బుల్లేక వెనుకడుగేశా. ఒక దశలో సొంత కారు కలే అనుకున్నా. ఇదే సమయంలో కాపు కార్పొరేషన్‌ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణలో చేరా. శిక్షణ పూర్తయ్యాక డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ కింద కారు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేసింది. రూ.లక్ష రాయితీతో రుణమిచ్చింది. ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య ఆదాయం వస్తోంది. డబ్బు పొదుపు చేసుకునేందుకు అవకాశం కల్గింది. కుటుంబం సాఫీగా గడుస్తోంది. మా అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు
- నిషిధర్‌, సుంగిపాలెం, డీవీపాలెం మండలం, గుంటూరు జిల్లా
Link to comment
Share on other sites

Alaage YSR family Kapulani ela vaadukuni vadilesado publish cheyyali.

2004 & 2009 YSR promised Reservations for Kapus & ditched big time. Everyone afraid raising voice against YSR to ask Kapu reservations. Kaneesam BC/Kapu commission ki kooda dabbulu ivvaledu to study. 

Tickets kooda TDP ki against ga vere option leka konthamandiki tickets ivvadam thappa vaallaki chance vunte 1 seat kooda ivvaru.

Ippudu kooda YSR family dead against Kapu & Balijas, Kapu reservations ni oppose chesadu Jagan first open ga taruvaatha 10% Economically Backward OCs lo 5% isthe kooda Jagan opposed openly.

Rayalaseema-Nellore lo YSRCP oke okka seat ichhindi Balijas ki, TDP gave 4 MLA tickets & 1 MP ticket.

Link to comment
Share on other sites

26 minutes ago, RKumar said:

Alaage YSR family Kapulani ela vaadukuni vadilesado publish cheyyali.

2004 & 2009 YSR promised Reservations for Kapus & ditched big time. Everyone afraid raising voice against YSR to ask Kapu reservations. Kaneesam BC/Kapu commission ki kooda dabbulu ivvaledu to study. 

Tickets kooda TDP ki against ga vere option leka konthamandiki tickets ivvadam thappa vaallaki chance vunte 1 seat kooda ivvaru.

Ippudu kooda YSR family dead against Kapu & Balijas, Kapu reservations ni oppose chesadu Jagan first open ga taruvaatha 10% Economically Backward OCs lo 5% isthe kooda Jagan opposed openly.

Rayalaseema-Nellore lo YSRCP oke okka seat ichhindi Balijas ki, TDP gave 4 MLA tickets & 1 MP ticket.

Manam enni chesina final ga Mana meeda padi edavatamega vallu chesedi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...