Jump to content

కొడాలి నానికి కష్టమేనా? గుడివాడ రూరల్‌లో సైకిల్‌ స్పీడ్‌


koushik_k

Recommended Posts

  • గుడివాడ రూరల్‌లో సైకిల్‌ స్పీడ్‌
  • అవినాష్‌ విజయానికి చెమటోడుస్తున్న నాయకులు
  • అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం
గుడివాడ రూరల్‌: గుడివాడ రూరల్‌ గ్రామాల్లో సైతం సైకిల్‌ జోరు అందుకుంది. దాంతో వైసీపీ కలవరపడుతోంది. గుడివాడ రూరల్‌ మండలానికి టీడీపీ అడ్డాగా పేరుంది. ఒకటిరెండు సందర్భాల్లో తప్పితే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకే మెజార్టీ వచ్చేది. 2004 ఎన్నికల వరకూ మండలంలో సగం గ్రామాలు ముదినేపల్లి నియోజకవర్గంలో ఉండేవి. మిగిలిన సగం గుడివాడ నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1989, 2014 ఎన్నికల్లో మినహా ప్రతి సారీ టీడీపీకే మెజార్టీ వచ్చింది. ముదినేపల్లి నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామాల్లో జడ్పీ మాజీ చైర్మన్‌ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు హవా నడిచేది. గుడివాడ నియోజకవర్గంలో భాగమైన గ్రామాల్లో టీడీపీనే ఆధిపత్యం ప్రదర్శించేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం గుడివాడ రూరల్‌ మండలం మొత్తాన్ని గుడివాడ నియోజకవర్గంలో కలిపారు.
 
 
తొలిసారిగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ రూరల్‌ మండలంలో టీడీపీ 1526 ఓట్ల మెజార్టీ సాధించింది. 2014కు వచ్చేసరికి వైసీపీకి 3952 ఓట్ల మెజార్టీ వచ్చింది. కొడాలి నానితో కలసి వైసీపీలోకి ఫిరాయించిన నేతలు పార్టీకి కొంత మేర నష్టం చేకూర్చారు. మరికొందరు కోవర్టులుగా పనిచేసి రావికి వెన్నుపోటు పొడిచి పార్టీని దెబ్బతీశారు. టీడీపీ జెండాపై రాజకీయంగా ఎదిగి తమ పార్టీనే దెబ్బతీసిన కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని మండల పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు.
 
 
టీడీపీ అభ్యర్థిగా అధిష్ఠానం దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపింది. అతను అన్ని హంగు, ఆర్బాటం, మందిమార్బలంతో ఎన్నికల రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా రూరల్‌ పార్టీలో హైఓల్టేజి వాతావరణం నెలకొంది. టీడీపీ పట్ల వీర విధేయత, అంకితభావం ఉన్న కార్యకర్తలు, నాయకులకు అవినాష్‌ రాక కొత్త ఉత్సాహాన్ని నిప్పింది. ఇప్పుడు కసిగా వైసీపీని దెబ్బతీయాలనే పట్టుదలతో క్యాడర్‌ పనిచేస్తోంది. అయితే ఇప్పటికీ ముఖ్యనేతలు కొందరు నానితో టచ్‌లో ఉన్నట్లు పార్టీ అధిష్ఠానానికి సమాచారం వెళ్లింది. ఎన్నికల అనంతరం వీరి సంగతి చూద్దామనే ధోరణిలో పార్టీ నాయకత్వం ఉంది.
 
 
పట్టుదలతో పనిచేస్తే పూర్వవైభవం
ఐదేళ్లుగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించారు. పార్టీని ప్రజలకు చేరువ చేశారు. గత ఎన్నికల్లో కొడాలి నానికి పనిచేసిన మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు కారే జోసెఫ్‌, కాకొల్లు రాజారెడ్డి, అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం వంటి వారు తిరిగి టీడీపీ గూటికి చేరడంతో పార్టీ పరిస్థితి మెరుగైందని రాజకీయ పరిశీలకులంటున్నారు.
 
 
మేజర్‌ పంచాయతీల్లో టీడీపీ హవా..
మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళీ మండల నాయకులను ఒకతాటిపైకి తీసుకురావడంలో కొంత వరకు సఫలీకృ తమయ్యారు. మేజర్‌ పంచాయతీలైన దొండపాడు, మోటూరు, చౌటపల్లి, బిళ్లపాడు, మల్లాయిపాలెంలో పార్టీ పటిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో దొండపాడు, చౌటపల్లిల్లో టీడీపీ మెజార్టీ సాధించింది. మరింత మెజార్టీ కోసం లింగమనేని వీరబసవయ్య, ముసునూరు రాజేంద్రప్రసాద్‌, ముక్తినేని అమర్‌బాబు, అడుసుమిల్లి వెంకటరత్నం(బాబాయి) కలసికట్టుగా కృషి చేస్తున్నారు. దొండపాడులోని ఎస్సీ, బీసీ కాలనీల్లో రూ.2.5 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మించడంతో పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. చౌటపల్లిలో టీడీపీ నాయకుడు సూరపనేని వెంకటరమణప్రసాద్‌ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో చేసిన అభివృద్ధి మెజార్టీకి ఉపకరించనుంది.
 
గత తప్పిదాలను పునరావృతం కాకుండా చేసి మల్లాయిపాలెంలో మళ్లీ టీడీపీ జెండా ఎగిరేలా చేస్తామని మాజీ సర్పంచ్‌ సాబెరుల్లాబేగ్‌, సమ్మెట బ్రహ్మాజీలంటున్నారు. బిళ్లపాడులో సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించినా అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి మెజార్టీ వచ్చింది.
 
దానికి కారణం నాయకుల మధ్య సమన్వయ లోపంమన్న వాదనలున్నాయి. ప్రస్తుతం మండల కోఆప్షన్‌ సభ్యుడు కారే జోసెఫ్‌ టీడీపీలోకి రావడంతో పార్టీకి కలసివచ్చే అంశం. ఉపద్రష్ట రాంబాబు, ఉపద్రష్ట శాస్త్రి, అవ్వారు రాంపండులు క్రియాశీలంగా వ్యహహరిస్తే టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌కు కలసి వచ్చే అవకాశం ఉంది. మోటూరులో గత ఎన్నికలలో వైసీపీకి 435 ఓట్ల మెజార్టీ లభించింది. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఘంటా బాలాజీ, చీకటి శేషగిరిరావు, సహకార సంఘం అధ్యక్షుడు ఘంటా పాలసులోచనరావు కలసికట్టుగా కృషి చేస్తే టీడీపీకి మెజార్టీ లభించే అవకాశం ఉంది. మోటూరులో ఎస్సీ, బీసీ కాలనీల్లో అంతర్గత రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించడం టీడీపీకి సానుకూలంగా పరిణమించే అవకాశం ఉంది.
 
 
కంచుకోటల్లో బలం చాటేదిశగా వ్యూహాలు
బొమ్ములూరులో సహకార సంఘం అధ్యక్షుడు లింగం నాగభూషణం(బాబ్జీ), మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, తూర్పు కృష్ణా ప్రాజెక్ట్‌ కమిటీ ఛైర్మన్‌ గుత్తా శివరామకృష్ణ(చంటి)లు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న లింగవరం గ్రామాన్ని కొడాలి నాని వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి అనుగుణంగా మార్చారు. టీడీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న ఆ గ్రామ ప్రముఖుడు రామలింగారెడ్డి వైసీపీలో చేరడంతో గత ఎన్నికల్లో టీడీపీకి చుక్కెదురైంది. అయితే టీడీపీ నేత రావి ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి వైసీపీ నుంచి గ్రామ మాజీ సర్పంచ్‌ నరసారెడిని టీడీపీలోకి లాగారు. లింగవరంలో టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని నాయకులు నమ్మకంతో ఉన్నారు.
 
 
వైసీపీ నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత
వలివర్తిపాడులో వైసీపీ నాయకత్వంపై గ్రామంలో తీవ్రవ్యతిరేకత ఉన్నా సొమ్ము చేసుకునే యంత్రాంగం టీడీపీ స్థానిక నాయకత్వంలో కొరవడటం లోటుగా ఉంది. కీలక నాయకుడు పంచకర్ల వాసు స్తబ్ధుగా ఉండటం అక్కడ టీడీపీకి ప్రతికూలంగా పరిణమించింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న వలివర్తిపాడులో పార్టీకి మెజార్టీ ఓటర్లు మద్దతు పలుకుతున్నా వారికి అండగా నిలిచే నాయకుడు లేకపోవడం వైసీపీకి కలసివస్తోంది. రామనపూడిలో టీడీపీ నాయకులు సుంకర రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ మసిముక్కు గోపాలకృష్ణ, మాజీసర్పంచ్‌ జుజ్జువరపు వీరభద్రరావు సమన్వయం చేసుకుని పనిచేస్తే పార్టీకి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 
తటివర్రులో టీడీపీ నాయకులు కైలా దాసు, మాజీ సర్పంచ్‌ కాకొల్లు రాజారెడ్డి మధ్య విభేదాలను పార్టీ నాయకత్వం పరిష్కరిస్తే అక్కడ వైసీపీకి చెక్‌ పెట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి ఈ గ్రామంలో బంధుగణం ఉండటం టీడీపీకి కలసివచ్చే అవకాశం ఉంది. సీపూడిలో టీడీపీ నాయకులు కేడీసీబీ బ్యాంకు డైరెక్టర్‌ గుంజా విజయకుమార్‌, గొరిపర్తి నాంచారయ్యలు కలసికట్టుగా పనిచేస్తుండటంతో ఇక్కడ గతానికి భిన్నంగా మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

నందివాడ మండలంలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రాజకీయంగా పలుమార్పులు చోటు చేసుకున్నాయి. ముదినేపల్లిలో భాగంగా ఉన్న కాలంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని కోటేశ్వరరావు ప్రభావంతో కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది. మండలంలో మొత్తం 28748 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు అధికం. గుడివాడ నియోజకవర్గంలో చేరిన తొలిసారి 2009లో మండల ఓటర్లు 872 ఓట్ల మెజార్టీతో టీడీపీకే పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 2823 ఓట్ల మెజార్టీ లభించింది. దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం పెనవేసుకున్న కొంతమంది టీడీపీ నాయకులు కొడాలి నానితో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి మైనస్‌ అయింది. పదేళ్లపాటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నాని పార్టీ ఫిరాయింపుతో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది. కొంత మంది బలమైన నేతలను తనవైపుకు తిప్పుకోవడంతో 2014 ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంత మంది నేతలు టీడీపీలో ఉంటూనే లోపాయికారీగా నాని ప్రలోభాలకు లొంగి వైసీపీకి పనిచేశారు. ఈ కారణాలతో

devineni-avinash.jpg
టీడీపీ బలంగా ఉన్న నందివాడలో వైసీపీ పాగా వేసింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో సీన్‌ రివర్స్‌ అవడం ఖాయమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మండలంలో త్వరలో నిర్వహించనున్న అవినాష్‌ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పర్యటన ప్రారంభించక ముందే మండల టీడీపీ నాయకులు ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిబద్ధతతో ఉన్నారు. నాయకులు విబేధాలు వీడి పనిచేస్తుండటంతో ఆధిక్యం సాధిస్తుందనేది శ్రేణుల మాట. గత ఎన్నికలకు ముందు మండల టీడీపీకి ఇరుసుగా వ్యవహరించిన బీసీ నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటకృష్ణ హఠాన్మరణం టీడీపీ వైఫల్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గత ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు మండలంలో కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరావు తన వర్గంతో టీడీపీలో చేరడంతో గ్రామ స్థాయిలో టీడీపీ నాయకుల మధ్య విభాదాలు తెలెత్తాయి. పిన్నమనేని చేరిక టీడీపీకి ప్లస్‌ కావాల్సింది పోయి మైనస్‌గా మారింది. నందివాడ మండల కేంద్రంలో టీడీపీ నేత వేములపల్లి వెంకటేశ్వరరావు(బాబు) అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియశీలంగా లేకపోవడం గత ఎన్నికల్లో ఆ గ్రామంలో టీడీపీకి మైనస్‌ వచ్చింది. తమిరిశ టీడీపీ నాయకుడు, గుడివాడకు చెందిన వైద్యుడు మాగంటి శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ గ్రామంలోనూ మైనస్‌ వచ్చింది. వీటికి తోడు మండల టీడీపీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో క్యాడర్‌ సరిగా పనిచేయకపోవడం కూడా
kodali-nani-gudiwada-300x162.jpg

పరాజయానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కొడాలి నానికి అండగా నిలిచిన జనార్థనపురం(జొన్నపాడు)కు చెందిన మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మలిరెడ్డి ప్రభాకరరెడ్డి, పుట్టగుంటకు చెందిన ఎస్సీ సామాజిక వర్గంలో కీలక నేతలు తెన్నేటి భాస్కరరెడ్డి, అబ్బూరి భాస్కరరావు, ఇలపర్రు శివారు ఎల్‌ఎన్‌పురానికి చెందిన మండల వైస్‌ ఎంపీపీ బడాని దామోదరరావు (దామ్‌బాబు)లు ప్రస్తుతం టీడీపీ విజయానికి కృషి చేస్తుండటంతో విజయం టీడీపీ వైపు మొగ్గు చూపుతోందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఆర్థిక, అంగబలాల్లో సమర్థుడైన దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో మండల టీడీపీలో ఉత్సాహం నెలకొంది. టీడీపీని దెబ్బతీయడానికి కొడాలి నాని ఎత్తుగడలు ఈసారి పారే అవకాశాలు ఎంతమాత్రం లేవని పార్టీ కార్యకర్తలంటున్నారు. టీడీపీ పాత నాయకులు, పిన్నమనేని వెంకటేశ్వరావు వర్గం నాయకుల నడుమ అక్కడక్కడా ఉన్న విభేదాలను సర్దుబాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తే మండలంలో టీడీపీ ఆధిక్యం సాధించే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు సైతం గత ఐదేళ్లుగా మండలంపై దృష్టి పెట్టి సిమెంట్‌ రోడ్లు వేయించడం, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో చేసిన కృషి గ్రామాల్లో టీడీపీకి సానుకూల పవనాలకు కారణ మవుతోంది.గతంలో వైసీపీకి వచ్చిన మెజార్టీని అధిగమించి టీడీపీకి మెజార్టీ సాధించే దిశగా నాయకులు పక్కా వ్యూహరచనతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఒక పక్క సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకు లాభిస్తాయని పార్టీ శ్రేణులంటున్నాయి. మండల టీడీపీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు, గుడివాడ అర్బన్‌ బ్యాంకు అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జీ మండలంలో అవినాష్‌ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకుని
ysrcp_logo_9381-300x164.jpg
ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో ప్రతి నాయకుడు మండలంలో టీడీపీకి పూర్వవైభవం సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జొన్నపాడులో గత ఎన్నికల్లో వైసీపీకి 980 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏడాదిగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి టీడీపీ చేసిన కృషితో అవినాష్‌ ఈ సారి మెజార్టీ సాధిస్తామని పార్టీ నాయకులంటున్నారు. అరిపిరాలలో నీటి సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ రవి గ్రామంలో రూ.ఐదు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు తోడు రూ.పది కోట్లు నిధులతో చేపట్టిన తారకరామ ఎత్తిపోతల పథకంతో ఆ గ్రామం టీడీపీకి అనుకూలంగా మారిందని అంచనా. తారకరామ ఎత్తిపోతలతో మండల ఆయకట్టులో సగభాగానికి సాగునీటి సమస్య తీరిపోనుంది. మండల టీడీపీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు సొంత గ్రామం పోలుకొండతోపాటు పొణుకుమాడు, గండేపూడి, శంకరపాడు, దండిగానపూడిల్లో పట్టు ఉంది. గత ఎన్నికల్లో పోలుకొండలో టీడీపీకి కొద్ది ఓట్లే ఆధిక్యత లభించింది. ఈసారి ఆయా గ్రామాల్లో భారీ మెజార్టీ సాధించే దిశగా వ్యూహాలకు పదునుపెదు తున్నారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు స్వగ్రామం రుద్రపాకలో గతంలో టీడీసీకి కేవలం 13 ఓట్లే మెజార్టీ లభించింది. ఈ సారి భారీ మెజార్టీ సాధించాలని ఆయన వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ నాయకుడిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టీడీపీ అనుకూలంగా మారనుంది. ఎల్‌.ఎన్‌పురం (కాళింగిపేట)లో వైస్‌ఎంపీపీ బడాని దామోదరరావు టీడీపీలో చేరడంతో వైసీపీకి నాయకుడే లేకుండా పోయారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 140 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ దఫా 500 పైగా సాధిస్తామని నాయకులంటున్నారు. వెంకటరాఘవాపురం, కుదరవల్లి, రామాపురంల్లో

ysrcp-jansena-tdp.jpg

పట్టు ఉన్న కుదరవల్లి నీటి సంఘం అధ్యక్షుడు కాకరాల సురేష్‌ ఆయా గ్రామాల నాయకులతో సమన్వయంతో వ్యవహరిస్తూ పార్టీకి మంచి మెజార్టీ కట్టబెట్టేక్రమంలో విజయవంత మయ్యారని సమాచారం. కుదరవల్లిలో మండల పార్టీ ప్రధానకార్యదర్శి, బీసీ నాయకుడు మసిముక్కు వేణుగోపాల్‌, రామాపురంలో ఎస్సీ నాయకులు అందుగుల ఏసుపాదం, కర్రా గాబ్రియేల్‌ పార్టీ విజయానికి కృషి చేస్తుండటంతో ఆయా గ్రామాల్లో గతానికి భిన్నంగా ఆధిక్యత దిశగా దూసుకువెళ్తోంది. తుమ్మలపల్లిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సాధన సాంబశివరావు, డీసీ ఉపాధ్యక్షుడు యలమంచిలి సతీష్‌ కలసికట్టుగా పనిచేయడం టీడీపీకి సానుకూలంగా మారింది. పెదలింగాలలో వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న గ్రామ టీడీపీ అధ్యక్షుడు కలపాల నాగేశ్వరావు, తెలుగుయువత నాయకుడు తాతినేని మురళీలు అవినాష్‌కు భారీ మెజార్టీ సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చేదుర్తిపాడు, ఒద్దులమెరక గ్రామాల్లో కొందరు టీడీపీ నాయకులు మారినా కార్యకర్తలు టీడీపీని అంటిపెట్టుకునే ఉంటూ అవినాష్‌ విజయానికి దోహదం చేస్తున్నారు. చినలింగాలలో వైసీపీ నాయకుడిపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశగా మాజీ ఎంపీపీ కొలకలేటి భవానీప్రసాద్‌ వేసిన ఎత్తుగడలు ఫలించాయని అక్కడ నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పుట్ట గుంటలో గత ఎన్నికల్లో వైసీపీ పక్షాన కీలకంగా వ్యవహరించిన గ్రామ ప్రముఖుడు తెన్నేటి భాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్‌ అబ్బూరి భాస్కరరావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ పైచేయి సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెన్ననపూడిలో మాజీ సర్పంచ్‌ లింగం సురేంద్ర, పొట్లూరి స్వామి, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి మేరీవిజయకుమారి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. పెదవిరివాడలో టీడీపీ నాయకుడు రామకృష్ణంరాజు, మాజీ సర్పంచ్‌ చట్టుమల్ల రంగమ్మ అవినాష్‌ విజయానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ పార్టీని విజయపథంలో నడిపిస్తున్నారు. అనమనపూడిలో గతంలో వైసీపీకి పనిచేసిన బీసీ నాయకులు ప్రస్తుతం టీడీపీకి పనిచేస్తున్నారు. తమిరిశలో ప్రముఖ వైద్యుడు మాగంటి శ్రీనివాస్‌ పార్టీకి భారీ మెజార్టీ తీసుకువచ్చేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారు. అక్కడ వైరి వర్గాలుగా ఉన్న కొల్లి వెంకటకృష్ణారావు(పెదబాబు), కొల్లి కోటేశ్వరరావు (చినబాబు) సోదరులు ఇద్దరూ టీడీపీ విజయానికి పనిచేస్తుండటం కలసివస్తోంది. నందివాడలో మండల ప్రముఖుడు వేములపల్లి వెంకటేశ్వరరావు (బాబు) అవినాష్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు

Link to comment
Share on other sites

Just now, RKumar said:

Kodali Nani odipothe YSRCP will not cross 50 mark.

Ala benchmark kinda theskolem bro . GDV kottali ante velugu anna undali venna ayna undali ani munde chepppa..  Rendu unna candidate ne dincharu e sari.. 2014 lo dinchina TDP e gelichedi. 

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Ee comedian Congress batch Telangana elections appudu full comedy chesi DB nunchi maayam ayyaru 3 months malli ippudu digaaru.

Nuvvu magaadivaite... Telengana elections appudu TDP gelustundi ani nenu vesina okka post chupinchu. ide challenge, Magaadivaite raa mari

 

by th way.. 2014 election results taruvata nuvvu maayam ayaav . gurtundo ledo.

appudu kuda kulaala lekkalu ani cheppi.. ikkada ee kulapollu intha mandi unnaru so ikkada gelupu ee party de nai comedy post lu vese vaadivi.

 

2014 elections taruvata edo sitting lo... nee  gurinchi discussion vachi , nee post lu gurtuchesukoni kaasepu baaga navvukunnam kudaanu

Link to comment
Share on other sites

1 hour ago, TDP_2019 said:

Mee Info cheppandi, TDP position enti gudiwada lo??

Not easy for Nani this time. Kashtapadutunnaru. Cadre lo munupennadi leni viswasam kanipistundi

Confirm YSRCP seat nuchi.. Tough fight ane situation ki vachindi. 

Link to comment
Share on other sites

40 minutes ago, JVC said:

Not easy for Nani this time. Kashtapadutunnaru. Cadre lo munupennadi leni viswasam kanipistundi

Confirm YSRCP seat nuchi.. Tough fight ane situation ki vachindi. 

Anni kastha dissect chesi cheppandi.... like rural and urban.... eh areas manaki edge and eh areas Nani ki favor? Want to hear from locals. 

Link to comment
Share on other sites

గుడివాడలో నానీకి పడింది దెబ్బ!

 

గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనిపిస్తోంది. వైసీపీలో కీలక నేతలు అనుకున్న వారు అందరూ సైకిల్ ఎక్కారు. సీఎం స్వయంగా కన్‌సంట్రేట్ చేయటంతో గుడివాడ రాజకీయం రంజుగా మారింది. సీఎం చంద్రబాబు సమక్షంలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

kodali-nani343434.jpg

గుడివాడలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నందివాడ మండల జడ్పీటీసీ సభ్యుడు, వైసీపీ నేత మీగడ ప్రేమ్‌కుమార్‌, ముదినేపల్లి మండలం పెనుమల్లికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ బొర్రా చలమయ్య, పారిశ్రామికవేత్త స్వచ్ఛంద సేవకులు అబ్దుల్‌ వహీద్‌, బీజేపీ నాయకుడు అంగడాల వెంకటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు పొంగులేటి జయరాజు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి చంద్రబాబు కండువాలను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అవినాష్‌ విజయానికి కృషి చేయాలని సీఎం సూచించారు. నందివాడ మండలంలో వైసీపీకి షాక్‌లపై షాకులు తగులుతున్నాయి. మొన్న వైసీపీ వైస్‌ ఎంపీపీ బడాని దామోదరరావు, పార్టీని వీడగా తాజాగా ఆ జాబితాలో జడ్పీటీసీ సభ్యుడు మీగడ ప్రేమ్‌కుమార్‌ చేరారు. గుడివాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రేమ్‌కుమార్‌, పోలుకొండ గ్రామ కన్వీనర్‌ మీగడ రాఘవరావు, బూత్‌ కమిటీ కన్వీనర్‌ మీగడ కోటేశ్వరరావు, అనుచరులు పార్టీలో చేరారు. ఒక్కొక్కొరు వైసీపీనీ వీడడంతో పార్టీ మండలంలో డీలా పడింది.

 

kodali-nani45454545.jpg

నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మీగడ ప్రేమ్‌కుమార్‌ వైసీపీ వీడడంతో ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికే జడ్పీటీసీ సభ్యుడు సొంత గ్రామమైన పోలుకొండ గ్రా మంలో టీడీపీ బలంగా ఉండగా మీగడ రాకతో బలం మరింతగా పెరిగింది. రోజురోజుకు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. గుడివాడలో బలమైన కాపులు, బీసీలు ఏకపక్షంగా టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. స్వయంగా బీసీల పెద్ద దిక్కు మాజీ మంత్రి కఠారీ ఈశ్వర్, కాపు జేఏసీ నేత సుధాకర్ నాయుడు అక్కడే ఉండి అవినాష్‌ గెలుపును పర్యవేక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

21 hours ago, sskmaestro said:

@chsrk brother, please add your anchana on Gudiwada.... Nani win or loss? (No third option plz ? )

Very positive environment visible for TDP in all segments of Gudivada...and we are expecting a significant victory for Avinash bro..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...